ఇవాంకకు ప్రధాని ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా ?

ఇవాంకకు ప్రధాని ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా ?

విదేశీ అతిథులను విశిష్టమైన బహుమతులు ఇవ్వడంలో మన ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారు. దేశ సాంప్రదాయానికి, విశిష్టతకు, చరిత్రకు సంభందించిన బహుమతులిచ్చి అతిథులను ఆశ్చర్యపరుస్తుంటారు మోదీ. అలాంటి ఆయన జీఈఎస్ సదస్సుకు పాల్గొనడానికి ఇండియాకు వచ్చిన అమెరికి అధ్యక్షుడి కూతురు, సలహాదారు అయిన ఇవాంకకు ఏం గిప్ట్ ఇచ్చారో తెలుసుకోవాలనుందా ?అయితే ఈ స్టోరీ చదవండి.

హైదరాబాద్ లో నిర్వహిస్తున్న 8 వ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా తరపున ఇవాంక పాల్గొన్నారు. ఈ సదస్సులోనే పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హైదరాబాద్ కు విచ్చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో జీఈఎస్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఇవాంక ప్రారంభించారు. అనంతరం ఫలక్ నుమా ప్యాలెస్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విందులో ప్రధాని, ఇవాంక తో పాటు పలువును ప్రముఖులు పాల్గొనన్నారు. 

అయితే అమెరికా తరపున ఇండియాలో పర్యటిస్తున్న ఇవాంకకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ అరుదైన బహుమతిని అందించారు. గుజరాత్ లో మాత్రమే ప్రత్యేకంగా దొరికే  ''సధేలీ క్రాప్ట్'' తో తయారుచేసిన ఓ చెక్కపెట్టెను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఈ తరహా ఆర్ట్ ను గుజరాత్ లో కిటీకీలకు, తలుపులకు అలంకరణ గా వాడుతుంటారు. అంతే కాకుండా ఇంట్లో డెకరేషన్ కోసం, ఆభరణాలను దాచుకునే పెట్టెలపై, ఫోటో ప్రేములపై కూడా వాడుతుంటారు. ఓ అరుదైన కలపతో చేసే పెట్టెపై చిన్న చిన్న కలప ముక్కలను వాడుతూ అందంగా తీర్యిదిద్దడమో ఈ సదేలీ కళ ప్రత్యేకత. ఈ తరహా కళ ఎక్కువగా గుజరత్ లోని సూరత్ లో కనబడుతుంది.

ఇలా సాంప్రదాయబద్దమైన, అపురూపయైన బహుమతిని ఇవాంకకు అందించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు మోదీ. ఓ వైపు దేశ ప్రధానిగా విశేష అతిథికి విశిష్ట బహుమతిని అందిస్తూనే, మరోవైపు స్వరాష్ట్ర కళలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Home Page

Next page