"హెచ్ సీ ఎ లోను కుటుంబ పాలనే" (వీడియో)

First Published 11, Jan 2018, 5:11 PM IST
DK Aruna fired on hca member
Highlights
  • హెచ్ సి ఎ లో కుటుంబ పాలన సాగుతుందన్న డికె అరుణ
  • వివేక్ వ్యవహారంపై విరుచుకుపడ్డ అరుణ

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒకే కుటుంబం చేతిలో దోపిడీకి గురవుతోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ. గత తొమ్మిదేళ్లుగా వివేక్ కుటుంబమే హెచ్ సి ఎ ను శాసిస్తోందని, వీరి నుండి క్రికెట్ కాపాడటానికే టీసిఎను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. తెలంగాణ నుండి  లక్ష్మణ్, అజహారుద్దీన్ తర్వాత ఎవరైనా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్ళు ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు. హెచ్‌సీఏ కు అసలు క్రికెటర్లను తయారుచేయాలనే ఆలోచన ఉంటే కదా క్రికెటర్లు తయారయ్యేది అని విమర్శించారు. అనంతరం టీసీఎ సెక్రటరీ గురువారెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ క్రికెట్ అసోషియేషన్‌కు త్వరలో బీసీసీఐ అనుమతి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.  

 

హెచ్ సి ఎ పాలకవర్గ వ్యవహారశైలిపై డికె అరుణ ప్రెస్ మీట్ వీడియోను కింద చూడండి 

 

 

 

loader