అమెరికా వెళ్లాల‌నుకునే వారికి గుడ్ న్యూస్

did you want to get job in america
Highlights

  • అమెరికా కంపేనీలకు హెచ్1బీ వీసా పున:ప్రారంభం
  • కంపేనీల కోరిక మేరకు తగ్గించిన రుసుము.
  • తిరిగి అమెరికా కంపేనీలకు విదేశీ ఉద్యోగుల ప్రయాణం

ఇండియాలో ఎక్కువ మంది విద్యార్థులు త‌మ గ్రాడ్యుయేష‌న్ త‌రువాత పోస్ట్‌-గ్రాడ్యుయేష‌న్ కు అమెరికా ఎక్కుగా ప్రాధాన్య‌త ఇస్తారు. అమెరికాలో ఉద్యోగం చెయ్య‌డానిక కూడా ఇండియ‌న్లు అధిక మోజు క‌న‌బ‌ర్చుతారు. అలాంటి వారికి గుడ్ న్యూస్‌. అమెరికా త‌న దేశంలో విదేశీయుల‌ను క‌ట్ట‌డి చెయ్య‌డానికి 6 నెల‌ల పాటు హెచ్‌1బీ వీసాను నిలిపివేసింది. దీంతో గంద‌రగోళంలో ప‌డ్డ చాలా మంది ఉద్యోగుల‌కు తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణ‌యంతో కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించింది.

హెచ్1బీ వీసాల నిలిపివేత‌తో అమెరికాలో టెక్ కంపేనీల‌కు చాలా ప్రాజెక్ట్‌లు నిలిచిపోయ్యాయి. ఈ ప‌రిస్థితి నుంచి గట్టెక్కించాల‌ని ఆయా సంస్థ‌లు యూఎస్ సిటిజ‌న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రెంట్ స‌ర్వీసెస్ వారికి మ‌న‌వి చేసుకున్నాయి. వారి కోరిక మేర‌కు ఈ ప్ర‌క్రియ‌ను పునః ప్రారంభించ‌నున్నారు. దీని వ‌ల్ల హెచ్‌1బీ కోసం ఆరు నెల‌లు వేచి ఉండ‌న‌క్క‌ర‌లేదు. కేవ‌లం ద‌ర‌ఖాస్తు చేసుకున్న 15 రోజుల‌కే హెచ్‌1బీ వీసాను పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుతం సంవ‌త్స‌రానికి 65,000 హెచ్‌1బీ వీసాల‌ను అమెరికా జారీ చేస్తోంది. అలాగే డిగ్రీ ముందుగా పూర్తి చేసిన వారికి ప్ర‌త్యేకంగా 20,000 హెచ్‌1బీ వీసాలు జారీచేస్తోంది. ఈ వీసాను అమెరికా కంపెనీలు త‌మ విదేశీ ఉద్యోగుల‌కు జారీ చేస్తాయి. అయితే త్వ‌ర‌లో అమెరికాలో ఉన్న‌ విదేశీ కంపేనీల‌కు కూడా హెచ్1బీ వీసా ప్రాసేస్ స‌ర‌ళీక‌రించే అవ‌కాశం ఉంది.
 

loader