అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నార్త్ జోన్ డిసిపి సుమతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమెన్స్ డే సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అసలు మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోలేని రోజు రావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇది తాను ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ గా చెప్పట్లేదని, సాధారణ మహిళగానే చెప్తున్నానన్నారు. మహిళలు అత్యంత సున్నితమైన వారని,ప్రతి ఒక్క మహిళ వారికి జరిగే అన్యాయాన్ని బయటకు చెప్పి నిలదీసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలా నిలదీసిన నాడే మహిళలకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ,సేఫ్టీతో ఉంటారని డిసిపి సుమతి అన్నారు.  

 

వీడియో