మహిళా నిందితురాలి చెంప చెల్లుమనిపించిన పోలీసాయన మీద వేటు పడింది. ఓ దొంగతనం కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే క్రమంలో బేగంపేట ఎసిపి రంగారావు  మంగ అనే  నిందితురాలిపై చేయిచేసుకున్న విషయం తెలిసిందే.  అయితే ఈ వీడియో మీడియాలోను, సోషల్ మీడియాలోను సర్క్యులేట్ అవుతూ దుమారాన్ని లేపాయి. దీంతో ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాల్సిందిగా సిటీ పోలీసు కమిషనర్ ఆదేశాలు మేరకు నార్త్ జోన్ డిసిపి సుమతి   విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. రంగారావు నిందితులను ప్రవేశపెట్టే సమయంలో సంయమనం కోల్పోయి దాడికి దిగాడని డిసిపి సుమతి తెలిపారు. వారు నిందితులైనప్పటికి ఇలా దాడిచేయడం తప్పని, ఇలా దురుసుగా ప్రవర్తించిన ఏసిపి పై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఎసిపినిహెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు సుమతి తెలిపారు.

 

వీడియో