నిన్ను టాప్ డ్యాన్సర్ ని చేస్తానని నమ్మబలికి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ కీచక డ్యాన్స్ మాస్టర్ ఉదంతం జనగామ జిల్లాలో బైటపడింది. డ్యాన్స్ ప్రాక్టీస్ పేరుతో ఇంటికి పిలిచి తనపై మాస్టర్ అత్యాచారం చేశాడని ఓ యువతి  కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని మూడో ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై విచారణ  జరిపిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

జనగామ జిల్లా తడిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ఓ యువతి కొంత కాలంగా కరీంనగర్‌ కు చెందిన సూర్యప్రకాశ్‌ అనే డ్యాన్స్ మాస్టర్ వద్ద డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంటోంది. అయితే ఈ అమ్మాయిపై డ్యాన్స్ మాస్టర్ కన్నేశాడు. ఎలాగైనా యువతిని వశపర్చుకుని అనుభవించాలని భావించిన ప్రకాశ్ ఓ ప్లాన్ వేశాడు.   డ్యాన్సర్ గా మంచి అవకాశాలు ఇప్పిస్తానని యవతిని నమ్మబలికిన ప్రకాశ్‌ ప్రాక్టీస్ మరింత పెంచాలని సూచించాడు. ఇందుకోసం తన ఇంట్లో సాధన చేద్దామని చెప్పి అమ్మాయిని ఇంటికి తీసుకుళ్లాడు. అక్కడ ఆమెను నిర్బంధించి అత్యాచారం చేశాడు. 

 ఈ కామాంధుడి చెర నుండి తప్పించుకున్న యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై అత్యాచారం కేసు, కులం పేరుతో దూషించిన అతని తల్లిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు.