కృష్ణా జిల్లా గుడివాడలో ఓ మహిళపై మహిళా కౌన్సిలర్ భర్త లైంగిక దాడికి దిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధిత మహిళకు అండగా, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా డివిజన్ ప్రజలు ఆందోళనుకు దిగారు. దీంతో గుడివాడలో ఆందోళన నెలకొంది.

ఈ వ్యవహారానికి సంభందించిన వివరాల్లోకి వెళితే... గుడివాడలోని 34 డివిజన్ లో తెలుగుదేశం పార్టీ  కార్పోరేటర్ శివశ్రీ  కౌన్సిలర్ గా  ఉన్నారు. అయితే ఈమె భర్త  వెంకట నారాయణ బ్యాంక్ లోన్ విషయంలో సహాయం చేస్తున్నట్లు చెప్పి ఒక మహిళపై మత్తు మందు ప్రయోగించి లోబర్చుకోడానికి ప్రయత్నించాడు. అయితే సదరు మహిళ అతడి దుర్భుద్దిని గమనించిన మహిళ పోలీసులను ఆశ్రయించి లైంగిక వేధింపులపై కేసు పెట్టింది. అయితే ఈమె ఫిర్యాదు చేసి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోడంతో ఆగ్రహించిన డివిజన్ ప్రజలు కౌన్కకసిలర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మున్సిపల్ చైర్మన్ ని కలసి తమకు న్యాయం చేయ్యాలని, అలాగే కౌన్సిలర్ శివ శ్రీ ని వెంటనే పదవి నుండి తొలగించాలని వినతిపత్రం అందించారు. 

 

వీడియో