కొందరు మస్త్ రఫ్ గ ఉంటరు. ఇంకొందరు మంచిగనే ఉంటరు. కొందరు డబ్బులు కమాయిస్తరు. ఇంకొందరు ఏం కమాయించరు. కొందరు గుప్పు గుప్పుమనుకుంట వచ్చే పొగ గొట్టాల మధ్య సిన్సియర్ గా డ్యూటీ చేస్తరు. ఇంకొందరు చెయ్యరు. కొందరు పొగ పీల్చలేక రోగాలపాలై ప్రాణాల మీదికి తెచ్చుకున్నోళ్లు ఉన్నరు. ఇంకొందరు కోట్లకు పడగలెత్తినోళ్లు కూడా ఉన్నరు.  

కానీ ఈ ట్రాఫిక్ పోలీసులు ఏం చేసిర్రో తెలిస్తే షాక్ అవుతారు. రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి కి గుండెపోటు రావడం తో అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని పాత బస్తీ లో ఉన్న పురానాపూల్ బ్రిడ్జి వద్ద జరిగింది. ఈ సందర్భంగా తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. ఒకపక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ వ్యక్తిని సేఫ్ చేసేటందుకు ట్రై చేస్తుంటే.. ఇంకో సైడ్ అక్కడి ఆఫీసర్ అర్జంట్ గా అంబులెన్స్ కావాలంటూ ఫోన్ కొట్టిండు. ఎంతైనా వీళ్లు గ్రేట్ కదా అంటున్నరు ఈ వీడియో చూసిన జనాలు మరి మీరూ ఒక లుక్ వేయండి ఈ వీడియో కింద ఉన్నది.