ఇండియన్ సినిమాలో ఎవర్ గ్రీన్ స్టార్ గా ఎదిగిన శ్రీదేవి మృతితో యావత్ భారతం శోకసంద్రంలో మునిగింది. ఈ విషాద సమయంలో శ్రీదేవి మృతిపట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ప్రేక్షకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ  అకాల మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఇలాగే సోషల్ మీడియా వేధిక ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీదేవి మృతికి సంతాపంగా చేసిన ఓ ట్వీట్ ఇపుడు దుమారం రేపుతోంది.

కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ లో శ్రీదేవి ఇకలేరు అనే వార్త వినడానికి చింతిస్తున్నాం. ఆమె ఒక ఉత్తమ నటి. భౌతికంగా దూరమైనా.. సీనీతారగా మా మదిలో చిరస్థాయిగా నిలచిపోయారు. ఆమెకు మా ఘననివాళులు. 2013 యూపీఎ హయాంలోనే శ్రీదేవి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.’అంటూ ట్వీట్ చేశారు. అయితే ఉద్దేశ పూర్వకంగానో లేక అనుకోకుండానో యూపీఏ హయాంలో ఆమెకు పద్మశ్రీ  ఇచ్చామని పేర్కొన్నారు. ఇలా ప్రస్తావించడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే శ్రీదేవి ఆకస్మిక మృతితో తీవ్ర ఆవేధనతో ఉన్న అభిమానులకు ఈ ట్వీట్ మరింత కోపాన్ని తెప్పించింది. ఇలా సంతాప సందేశంతో రాజకీయాలు చేయడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ ట్వీట్ పై అంతకంతకు విమర్శలు ఎక్కువవుతుండటంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ నుండి వివాదాస్పద ట్వీట్ ను తొలగించింది.