అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనను కావాలనే టీఆర్ఎస్ పార్టీ హైలైట్ చేస్తోందని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తమ మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ని చంపినట్లు సీఎం కేసీఆర్ నన్ను కూడా ఎప్పుడొ అప్పుడు సంపుతాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ లో జరిగిన మార్షల్స్ తోపులాటలో తాను కూడా గాయపడ్డానని మీడియా సభ్యులకు తెలిపాడు. తన మోకాలికి తీవ్ర గాయమైందంటూ కుంటు కుంటు నడిచారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి అడ్డుతగులుతూ కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్స్ ని గవర్నర్ పైకి విసిరాడు. అయితే ఇవికాస్తా గవర్నర్ పక్కనున్న మండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటికి తాకి తీవ్ర గాయమైంది. దీంతో ఈ  దాడిపై టీఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

అయితే ఈ ఘటనపై కోమటిరెడ్డి స్పందించారు. అసెంబ్లీలో జరిగిన తోపులాటలో తనకు కూడా గాయాలు తగిలాయంటూ మీడియా సభ్యులకు గాయాలను చూపించారు. తన మొకాలికి దెబ్బ గట్టిగా తగిలిందని మొకాలి చిప్ప విరిగిందేమోనని అనుమానం వస్తుందని అన్నారు. ఈ సీఎం కేసీఆర్ తనను కేడా ఏదో ఒకరోజు చంపేస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జరిగిన వ్యవహారం లో తాసు చేసింది తప్పేమి కాదంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వెల్లడించారు.