గుజరాత్ అసెంబ్లీలో ఇవాళ గందరగొళ వాతావరణం పెలకొంది. అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యుల మద్య మాటల యుద్దం కాస్త ఫైట్ కి దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు రణరంగం సృష్టించారు.ఈ అసెంబ్లీ ఫైట్ కి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

గుజరాత్ అసెంబ్లీలో ఇవాళ ఆశారాం ఆశ్రమంలో ఇద్దరు చిన్నారుల మృతిపై చర్చ జరుగుతోంది. ఈ పిల్లల మృతిపై జస్టిస్ త్రివేది కమీషన్ ఇచ్చిన నివేదికపై అధికార, విపక్ష ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొన్నారు. అయితే ఈ చర్చల్లో మాటా మాటా పెరిగి ఆవేశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ డూదత్  బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ పంచాల్‌ను మైక్‌ తీసుకుని కొట్టారు.  దీంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాడిని ఖండిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

వీడియో