Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ అహంకారానికి రీజన్ ఇదేనట

  • మంత్రి కేటీఆర్ కు గర్వం పెరిగిపోయిందన్న నరేందర్ రెడ్డి
  • తన తండ్రి సీఎం అనే గర్వం కేటీఆర్ లో ఉందన్న నరేందర్ 
congress leader vem narender reddy fires on ktr

తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఒకప్పటి కేటీఆర్ కాదని, అతనిలో ఇప్పుడు గర్వం పెరిగిపోయిందని అన్నారు కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి.  ఆయన మాటల్లో తాను సీఎం కొడుకుననే గర్వం కనిపిస్తోందని, అందుకే కాంగ్రెస్ పార్టీపైన, పార్టీ అధిష్టానం పైన అహంకారంతో విమర్శలు చేస్తున్నాడని అన్నారు.  
ఇవాళ వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. సీఎం కొడుకుగా తనకు అడ్డెవరు లేరన్నట్లు కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడున్నాడని అన్నారు. కాంగ్రెస్ ను పాతాళంలోకి తొక్కాలని కేటీఆర్ అంటున్నారు. తెలంగాణ ఇచ్చినప్పుడు అదే కాంగ్రెస్ అధినేత్రి వద్దకు వెళ్లి మీ కుటుంబం సాష్టాంగ నమస్కారం చేసిన విషయం గుర్తుందా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కాలని అపుడు అనిపించలేదా. ఇప్పుడు మీ అధికారానికి అడ్డొస్తోందని పాతాళంలోకి తొక్కాలా? మీ అక్రమ పాలనను బయటపెడుతోందని పాతాళంలో కి తొక్కాలా ? అంటూ అటు ప్రభుత్వంపై ఇటు కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు నరేందర్ రెడ్డి.
అలాగే నెల రోజుల క్రితం కేటీఆర్ వరంగల్ లో పర్యటించినపుడు అధికారులు పనికిరాని వాళ్లని  అన్నాడు. ఇప్పుడేమో అతడే అధికారులు బాగా పని చేస్తున్నారని పొగుడుతున్నావు. అంటే నెల రోజుల్లోనే అధికారులు పని తీరు మారిందా. అదికారులు ఎప్పుడూ బాగానే పని చేస్తున్నారని, కేటీఆరె పూటకో మాట మాట్లాడుతున్నాడు. కేటీఆర్ మాటల్లోని ఈ అహంకారానికి  సీఎం కుమారుడుననే బావనే కారణమని నరేందర్ అన్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios