పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉండికూడా సింప్లీ జీవితాన్ని గడుపుతున్న మమతా బెనర్జీని చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ సీఎంతో మీటింగ్ సందర్భంగా కూడా మమత సాధారణ చెక్క కుర్చీలనే ఏర్పాటు చేసి అందులోనే కూర్చోబెట్టి ఎలాంటి ఆర్భాటం లేకుండా చూశారని కోమటిరెడ్డి కొనియాడారు. అంతే కాకుండా ఆమె ఎప్పుడూ సాధారణ స్లిప్పర్స్  వేసుకుంటారని, ఏసి లేని మారుతి కారును వాడతారని గుర్తుచేశారు. కానీ మన సీఎం కేసీఆర్ వందల కోట్లతో ప్రగతిభవన్, గజ్వెల్ లో ఫార్మ్ హౌస్, విలాసవంతమైన క్యాంప్ ఆపీస్ నిర్మించుకుని అధికార దర్పాన్ని చూపిస్తున్నారని విమర్శించారు. థర్డ్ ప్రంట్ ఏర్పాటు చేయడం కాదు మొదట మమతా బెనర్జీని చూసి కేసీఆర్ బుద్దితెచ్చుకోవాలని కోమటిరెడ్డి విమర్శించారు.

వీడియో