ఎన్నికల ప్రచారంలో బాగంగా  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ కర్ణాటకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా కర్ణాటకకు చేరుకున్న రాహుల్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి చిక్ మంగళూరులోని శృంగేరి శారదా పీఠంలోని శారదాంబ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయానికి రాహుల్ దక్షిణాది సాంప్రదాయ వస్త్రదారనైన ధోతీ, పైన శాలువా ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాహుల్ వేద పాఠశాల విద్యార్థులను కలిసి వారితో కాసేపు ఇంటేరాక్ట్ అయ్యారు. ఈ  కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. 

వీడియో