మంత్రి ఉమకు తృటిలో తప్పిన ప్రమాదం

First Published 26, Dec 2017, 8:23 PM IST
close shave for AP minister devineni Uma in car accident
Highlights
  • మంత్రి దేవినేని కి తప్పిన పెను ప్రమాదం
  • కాన్యాయ్ లోని మరో ఢీ కొట్టడంతో ప్రమాదం

 మంత్రి దేవినేని ఉమ కారుకు సడెన్ బ్రేక్, తప్పిన పెను ప్రమాదం

 ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన అధికారిక పర్యటనలో భాగంగా బెంగళూరు నుంచి అనంతపురానికి వస్తుండగా  ప్రమాదం చోటు చేసుకుంది.

ఆయన కాన్వాయ్ అనంత పురం కు వస్తుండగా కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలని, కారు ఆపాలని  మంత్రి  తన డ్రైవర్ కు సూచించారు. దీంతో ఒక్కసారిగా అతడు కారును ఆపడంతో కాన్వాయ్ లోని మరో కారు వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది.

ఈ కాన్వాయ్ ప్రమాదంలో మంత్రి దేవినేని తో పాటు  డ్రైవర్, ఇతరులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. 

ఈ ప్రరమాదంపై మంత్రి స్పందిస్తూ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఎవరికీ ఏమీ కాలేదని చెప్పారు.
 
 

loader