పోలీసులకే హాయ్ చెబుతున్న చెడ్డి గ్యాంగ్ (వీడియో)

CCTV Footages Of Cheddi Gang Hulchul In Hyderabad City
Highlights

  • మరో సారి నగరంలో బైట పడ్డ చెడ్డి గ్యాంగ్ ఆగడాలు
  • మల్కాజ్ గిరి లో సిసి కెమెరాకు చిక్కిన దృశ్యాలు 

సికింద్రాబాద్ లో మరో సారి చెడ్డీ గ్యాంగ్  ఆగడాలు బైటపడ్డాయి. మల్కాజ్‌గిరి గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలో గల గోపాల్‌నగర్‌లో చెడ్డి గ్యాంగ్ ఓ ఇంట్లో దొంగతనానికి విశ్వ ప్రయత్నం చేసింది. డాక్టర్ రామ్మోహన్ ఇంటి పరిసరాల్లోకి చొరబడ్డ ఓ దొంగ ఇంట్లోకి  ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పటకీ వీలు కాకపోవడంతో వెనుదిరిగాడు. అయితే అతడు బాల్కనిలో నిల్చుని సిసి కెమెరాను గమనించినప్పటికి ఏ మాత్రం భయం లేకుండా హాయ్ చెబుతూ ఫోజులిచ్చాడు. ఇలా ఈ దొంగ కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా ఏ మాత్రం భేరుకులేకుండా ఉండటం రికార్డయ్యింది. ఇలా విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడుతూ చెడ్డీ గ్యాంగ్ పోలీసులకు సవాల్ విసురుతోంది. 
 

సిసి కెమెరా దృశ్యాలు

 

loader