పంజాబి వేషధారణలో కెనడా ప్రధాని కుటుంబం (వీడియో)

First Published 21, Feb 2018, 4:10 PM IST
canada prime minister Justin Trudeau punjabi style
Highlights
  • కుటుంబ సమేతంగా స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన కెనడా ప్రధాని

ఇండియా పర్యటనలో బాగంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇవాళ పంజాబ్ లో పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో అమృత్ సర్ కు చేరుకున్న ప్రధాని ట్రూడో కుటుంబం సంప్రదాయ పంజాబీ వేషధారణలో విమానాశ్రయంలో ఉన్నవారికి అభివాదం చేశారు.  విమానాశ్రయంలో హర్దీప్‌సింగ్ పూరీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ లు పంజాబ్ ప్రభుత్వం తరపున ట్రూడో కుటుంబానికి స్వాగతం పలికారు. అక్కడి నుండి ప్రధాని ట్రూడో ఫ్యామిలీతో కలిసి నేరుగా స్వర్ణ దేవాలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. వీరి రాకతో పంజాబ్ ప్రభుత్వం స్వర్ణ దేవాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, బందోబస్తు చేపట్టారు.

ఆ తర్వాత ట్రూడో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరింద్ సింగ్ తో భేటీ అయ్యారు.  అలాగే శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ తన భార్య, కేంద్రమంత్రి హరి సిమ్రత్ కౌర్ బాదల్‌తో కలిసి కెనడా ప్రధానిని కలిశారు.  

పంజాబీ వేషధారణలో కెనడా ప్రధాని ఫ్యామిలీ ఎలా ఉందో కింది వీడియోలో చూడండి 


 

loader