పెళ్లి కోసం ఏర్పాటు చేసిన డీజె సౌండ్ సిస్టమ్ అతిధ్వని కారణంగా పెళ్లి కూతురు మృత్యువాతపడ్డ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పచ్చని పందిట్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న కొద్ది క్షణాల్లోనే ఈ విషాద సంఘటన చోటుచుసుకుంది. పెళ్లిబాజలు మోగిన ఇంట్లో చావు బాజలు మొగించాల్కి వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

సూర్యాపేట పట్టణంలోని శంకర్‌విలాస్‌ సెంటర్‌ లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహకుడు హనుమయ్య కుమార్తె గాయత్రి(23)కి వరంగల్‌ జిల్లా నెల్లికుదురుకు చెందిన వేణుతో శనివారం వివాహం జరిగింది. వివాహంలో  బందుమిత్రుల ఆశీర్వాదాలు తీసుకుని ఆనందంగా గడిపిన వధూవరులు సాయంత్రం స్థానిక వేంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఈ పూజల అనంతరం బంధువులు, స్నేహితులంతా కలిసి డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి భారీ గా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ శబ్దాలకు పెళ్లికూతురు గాయత్రి ఒక్కసారిగి కుప్పకూలింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. అప్పటికే  ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.