యాదాద్రి జిల్లా మోత్కుర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.  బిజిలాపురం గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు భార్గవి అనే అమ్మాయిని ప్రేమిచాడు. అయితే ఆమె పెళ్లి చేసుకోమని అడిగేసరికి తప్పించుకోడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె గట్టిగా నిలదీయడంతో కోపోద్రిక్తుడైన నరేష్ ప్రియురాలు భార్గవిని హతమార్చాడు. అనంతరం ఆ శవాన్ని పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్లుగా ఉండిపోయాడు. 

అయితే గత మూడు రోజులుగా భార్గవి కనిపించకపోడంతో తండ్రి లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నరేష్ ను అనుమానించి విచారించగా అసలు విషయాన్ని బైటపెట్టాడు. దీంతో ఆమెను పూడ్చిపెట్టిన స్థలాన్ని గుర్తించిన పోలీసులు శవాన్ని బైటికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

వీడియో