హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. తమ కళాశాలకే చెందిన ఇద్దరు విద్యార్థులను బౌన్సర్లతో చితక్కొంట్టించి దారుణానికి పాల్పడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఈ విద్యార్థులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. 

వివరాల్లోకి వెళితే  పోచంపల్లి సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజీ లో సోహెల్, గులాం ఇస్మాయిల్ అనే ఇద్దరు విద్యార్థులు చదువుతున్నారు. అయితే తమను కాలేజీలోని క్రమశిక్షణ ఫోర్స్ పేరుతో పనిచేస్తున్న బౌన్సర్లు అకారణంగా కాలేజీ రూమ్ లో పట్టుకుని చితకబాదారని ఆరోపిస్తూ వీరు పోలీసులను ఆశ్రయించారు. ఈ వదాడి విషయాన్ని బయటపెడితే తమ అంతు చూస్తామని కూడా బెదిరించారని విద్యార్థులు డబీర్ పురా పోలీసులకు తెలిపారు. తమపై దాడి చేసిర బౌన్సర్లు, చేయించిన కాలేజీ యాజమాన్యం పై  చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థులు పోలీసులను కోరారు.

 

వీడియో