‘కామసూత్ర’ ప్రారంభించిన జాక్విలిన్

Bollywood beauty Jacqueline started Kamasutra hotels in Sri Lanka
Highlights

  • మంచిపొజిషన్లో ఉన్నపుడే సెలబ్రిటీలు సైడ్ బిజినెస్ లు మొదలుపెట్టటం అందరూ చూస్తున్నదే.

మంచిపొజిషన్లో ఉన్నపుడే సెలబ్రిటీలు సైడ్ బిజినెస్ లు మొదలుపెట్టటం అందరూ చూస్తున్నదే. ఎందుకంటే, తమ కెరీర్ ఎల్లకాలమూ ఒకే స్ధాయిలో ఉండదు కాబట్టే సెలబ్రెటీలు ముందు జాగ్రత్త పడుతుంటారు. అందులో వారిని తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. ఇదంతా ఎందుకంటే, తాజాగా బాలీవుడ్ బామ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా అటువంటి వ్యాపారమే మొదలుపెట్టింది.

కాకపోతే సెలబ్రిటీలు మొదలుపెడుతున్న బిజినెస్లో ఎక్కువగా హోటల్ రంగంలోకి ప్రవేశిస్తుండటం విశేషమే. ఎందుకలా అంటే, భోజనం చేయకుండా ఎవరూ ఉండలేరు. అదికూడా రుచికరమైన భోజనం చేయాలని అనుకోని వారు ఎవరైనా ఉంటారా? అందుకనే ఎవరు ఎక్కడ హోటళ్ళు, రెస్టారెంట్లు పెట్టినా బిజినెస్ కు దాదాపు లోటుండదు. భోజనానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత అటువంటిది. ఆ విషయాలు గ్రహించిన వారు కాబట్టే సెలబ్రిటీలు కూడా ఎక్కువగా హోటల్ రంగంపైనే దృష్టి పెడుతుంటారు.

ఇక ప్రస్తుతినికి వస్తే, బాలీవుడ్ హీరోయిన్‌ జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్ కూడా తాజాగా చైన్ హోట‌ల్స్ బిజినెస్ ను శ్రీలంకలో మొద‌లెట్టింది. జాక్విలిన్ శ్రీలంకకు చెందిన బామే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే శ్రీలంక టాప్ సెల‌బ్రిటీ షెఫ్ ద‌ర్శ‌న్ మునిదిస‌తో క‌లిసి ఈ హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా ఆ హోటల్స్‌కు జాక్వ‌లిన్ పెట్టిన పేరు ఏంటో తెలుసా? ఇపుడా హోటల పేరే హాట్ టాపిక్‌గా మారింది. ఈ హోటల్స్‌కు జాక్విలన్ పెట్టిన పేరు `కామ‌సూత్ర‌` అని. శ్రీలంక‌లో ఇపుడీ హోటల్ సంచ‌ల‌నంగా మారింది. బహుశా పాపులారిటీ  కోస‌మే జాక్వ‌లిన్ ఆ పేరు ఎంచుకుందోమో ?

 

loader