దీపాలు ఆర్పడం మన సాంప్రదాయం కాదు లక్షల బ్యాక్టీరియా ఉంటుందట
పుట్టిన రోజు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కేక్. మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్న పాపాయి దగ్గర నుంచి షష్టి పూర్తి చేసుకునే తాతయ్య వరకు బర్త్ డే రాగానే కేకులు కట్ చేయడం ప్రస్తుతం సాంప్రదాయంగా మారింది. కేకుని ఊరికే కట్ చేస్తారా అంటే లేదు.. ముందుగా దానిపై క్యాండిల్స్ వెలిగించి.. వాటిని ఆర్పి మరీ కేక్ కట్ చేస్తారు.. ఆ తర్వాత కేకును ఆరగిస్తారు.
అయితే.. ఈ సారి కేక్ కట్ చేసేటప్పడు.. ఆ కేక్ పై క్యాండిల్స్ మాత్రం వెలిగించకండేం.. ‘ దీపాలు ఆర్పడం మన సాంప్రదాయం కాదు.. అందుకే వద్దు అంటున్నారు’ అని మీరు అనుకుంటే పొరపాటే. క్యాండిల్స్ వూదొద్దు అనడానికి సాంకేతిక పరంగానే కారణాలు ఉన్నాయి.
కేకుపై క్యాండిల్ ని వెలిగించి మనం నోటితో వూదుతాం. అయితే.. మన నోటిలో కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటుందట. క్యాండిల్ ని వూదినప్పడు.. ఆ క్రిములు.. క్యాండిల్ ఆర్పినప్పుడు వచ్చే పొగతో కలిసి మరిన్ని క్రిములుగా మారి కేకుపైకి చేరతాయట. దాదాపు 1400 శాతానికి పైగా బ్యాక్టీరియా తయారై కేకు మీదకు చేరుతుందట.
ఆ కేకును మనం తినప్పుడు ఆ క్రిములన్నీ మన కడుపులోకి చేరతాయి. దీంతో అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించనప్పటికీ.. బలహీనంగా అవ్వడం.. ఇన్ ఫెక్షన్ లకు గురవ్వడం లాంటివి జరుగుతాయట. సౌత్ కరోలినాలోని క్లెమ్సన్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు. కొన్ని సంవత్సరాల పాటు వీరు చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
