తెలంగాణ సర్కారు రాష్ట్రంలో శాంతిభద్రతలను విస్మరించి మాఫియా సంస్థలతో కుమ్మక్కయ్యిందని  బీజేపి శాసనసభా పక్షనేత కిషన్ రెడ్డి ద్వజమెత్తారు. భూ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్ మాఫియా ఇలా ప్రతి విషయంలోను టీఆర్ఎస్ నాయకులు మాఫియాగా మారి ప్రజాధనాన్ని దండుకుంటున్నారని విమర్శించారు.  ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ కిషన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ కు బహిరంగ లేఖ రాసారు. అందులో ఈ కింద పేర్కొన్న అంశాలపై అసెంబ్లీలో చర్చించాల్సిందిగా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
1. ప్రభుత్వ చేపడుతున్నభూ రికార్డుల ప్రక్షాలనలో జరుగుతున్న అవినీతి,అక్రమాలు
 2. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దళితుల దాడులపైన, ముఖ్యంగా నేరెళ్ల దళితులపై జరిగిన దాడులు
3. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటి వల్ల కలిగే దుష్పరిణామాలపై
4. తెలంగాణ ప్రభుత్వ చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లపై
5. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, అలాగే విద్యార్థుల ఆత్మహత్యలు, భోదనా రుసుములో జరుగుతున్న జాప్యం
6. బిసి సభ్ ప్లాన్ చట్టబద్దత, బిసి ఫెడరేషన్ ఏర్పాటు
7. ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులపై
8. బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై చర్చకు అనుమతించాలని కిషన్ రెడ్డి కోరారు.
  మాఫియా సంస్థలతో కేసిఆర్ సర్కారు కుమ్మక్కు : బిజెపి కిషన్ రెడ్డి