బిజెపి సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి ఇవాళ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆగ్రహంతో ఊగిపోయారు. కాన్పూర్ జిల్లా కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ లైట్ ప్యానెల్స్ ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు రిబ్బన్ కట్ చేయడానికి కత్తెర కూడా ఉంచలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన రిబ్బన్ ను చేతితో తెంచేసి ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారుల ఏర్పాట్లపై అసంతృప్తితో ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు.  

వీడియో