ప్రగతి భవన్ వద్ద బిజెపి హల్ చల్

ప్రగతి భవన్ వద్ద బిజెపి హల్ చల్

ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ బిజెపి పార్టీ ఇవాళ చలో ప్రగతిభవన్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశప్రధానికి పట్టుకుని ఓ సీఎం స్థాయి వ్యక్తి వాడు,వీడు వంటి అసభ్యకర పదజాలంతో దూషించడం ఏంటంటూ జిజెపి కార్యకర్తలు ఇప్పటికే వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సీఎం స్పందించడంగానీ, విరమిస్తున్నట్లు ప్రకటించడం గానీ చేయకపోడంతో  బిజెపి పార్టీ తరపున చలో ప్రగతిభవన్ పేరిట కేసీఆర్ అధికారిక నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రగతిభవన్ వద్దకు భారీగా చేరుకున్న కమళం నేతలు ముట్టడికి ప్రయత్నించారు.

అంతకు ముందే తెలంగాణ పోలీసులు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావులను గృహనిర్భందం చేశారు. అలాగే ప్రగతి భవన్ కు వెళ్లే దారుల్లో భారీగా పోలీసులను మొహరించి కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అయినా ఈ నిర్భందాల నుండి తప్పించుకుని కొందరు బిజెపి నాయకులు ప్రగతి భవన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రగతి భవన్ లోపటికి వెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను నిలువరించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 మళ్లీ ఈ నివాసం వద్ద బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీస్ బందోబస్తు కొనసాగిస్తున్నారు. దీంతో సీఎం అధికారిక నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   


 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Home Page

Next page