Asianet News TeluguAsianet News Telugu

పంతం నెగ్గించుకున్న ర‌విశాస్త్రి

బౌలింగ్ కోచ్ గా అరుణ్ భరత్

2019 ప్రపంచ కప్ వరకు  ఒప్పందం

రవిశాస్త్రి ప్లాన్ ఫలించింది.

BCCI decide india bowling coach

హెడ్ కోచ్ ర‌విశాస్త్రి నియామ‌కం త‌రువాత బౌలింగ్ కోచ్‌గా ఎవ‌రిని ఎన్నుకుంటారు అనే విష‌యంలో ఉన్న సందిగ్థ‌త ను బిసిసిఐ తెర‌దించింది. మొద‌ట జ‌హిర్ ఖాన్ అని గంగూలీ, స‌చిన్ ల‌క్ష్మ‌న్‌ల‌తో కూడిన‌ క‌మీటి ప్ర‌క‌టించింది. అయితే చివ‌రికి భారత జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ప్రకటించారు. ఇదే విష‌యాన్ని విలేకరుల సమావేశంలో బిసిసిఐ ఉమ్మడి కార్యదర్శి రవి శాస్త్రి ఆధ్వర్యంలోని జట్టు కొత్త సహాయక సిబ్బంది మీడియాకు తెలియజేశారు.

భ‌ర‌త్ అరుణ్‌కి భార‌త్ బౌలింగ్ కోచ్‌గా  2019 క్రికెట్ ప్రపంచ కప్ ముగిసే వరకు అరుణ్ జట్టుతో పూర్తి సమయం కేటాయిస్తార‌ని బిసిసిఐ తెలిపింది. సంజ‌య్‌ బంగర్ భారత జట్టు సహాయక శిక్షకుడిగా కొనసాగుతున్నాడు.

రవి శాస్త్రిని టీమ్ ఇండియా ప్రధాన శిక్షకుడిగా నియమించిన తరువాత, ప‌లు ర‌కాల ఊహాగానాలు షికారు చేశాయి. ర‌విశాస్త్రి న‌మ్మ‌క‌స్తుడైనా 55 ఏళ్ల మాజీ క్రికెటర్ భ‌ర‌త్‌ అరుణ్ బౌలింగ్ కోచ్ గా నియ‌మించారు.  గ‌తంలో భ‌ర‌త్ అరుణ్‌కి జాతీయ జట్టుకు స‌హాకుడిగా ప‌ని చెసిన అనభ‌వం కార‌ణంగానే అత‌డిని బౌలింగ్ కోచ్‌గా సెల‌క్ట్ చేసినట్లు తెలిపారు. 

ప్ర‌స్తుతం సంజయ్ బంగార్ బ్యాంటింగ్‌కి, ఆర్ శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌లుగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios