పోలీసులంటే దురుసుగా ప్రవర్తిస్తూ అసలు సామాన్యులకు మర్యాదే ఇవ్వరని అపవాదు ఉంది. కానీ ఈ కింది వీడియోలో కనిపిస్తున్న ఓ సిటీ కమీషనర్ మాత్రం ఓ స్కూల్ పిల్లాడికి సెల్యూట్ చేసి పోలీసులంటే ఇలా మర్యాదగా ఉండాలని సంకేతాలను పంపాడు.  ఈ ఒక్క సెల్యూట్‌తో సోషల్ మీడియా ఆయన ఆదర్శ పోలీస్ అన్న బిరుదును పొందాడు.  

బెంగళూరులో ఓ పిల్లాడు స్కూల్ కి వెళుతుండగా  సిటీ పోలీస్ కమిషనర్ టీ సునీల్ కుమార్ కనిపించాడు. దీంతో ఆ పిల్లాడు ఆయనకు సెల్యూట్ చేశాడు. దీంతో కమీషనర్ కూడా పిల్లాడికి సెల్యూట్ చేశాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందరు పోలీసులు ఆ పోలీస్ బాస్ లా ఉంటే ఎంత బాగుంటుందని నెటిజన్లు కమీషనర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

 

వీడియో