బాహుబ‌లి అక్క‌డ అంతా క్లీన్ చేస్తున్నాడు

Bahubali cleaning in railway station
Highlights

  • వినూత్న ప్రచారంలో రైల్వే శాఖ
  • బాహుబలి పోస్టర్ తో స్వచ్చ భారత్ ఫోటో.

 

 

బాహుబ‌లి సినిమా కేవ‌లం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించింది. ఇండియా రికార్డుల‌ను తిర‌గ‌రాసింది బాహుబ‌లి. రిలీజ్ అయి 4 నెల‌ల అయినా ఇప్ప‌టికి బాహుబ‌లి ప్ర‌స్తావ‌న మాత్రం త‌గ్గ‌డం లేదు. బాహుబ‌లి సినిమా ఇండియ‌న్ సినిమా స్థాయిని ఆమాంతం పెంచిన సినిమా. ఇండియాలో బాహుబ‌లి సినిమా గురించి తెలివ‌న‌ని వారు లేరంటే అది అతిశ‌యోక్తి కాదు.


ఇండియాలో అందిరికి బాగా తెలిసిన క్యారెక్ట‌ర్ బాహుబ‌లి కావ‌డంతో రైల్వే శాఖ ప్ర‌చారానికి వాడుకుంది. బాహుబ‌లి కూడా ఇండియా క్లినింగ్ కి స‌హాయం చేస్తున్నాడు, మ‌రీ మీరు... అనే కప్ష‌న్ తో ఈ పోస్ట‌ర్ ను రైల్వే శాఖ ప్ర‌చారం కొన‌సాగిస్తుంది. ఈ ఫోటోలో కోతీ నుండి ఆధిమాన‌వుడి మొద‌లుకొని నేటి మాన‌వ‌డి వ‌ర‌కు, చివ‌రికి బాహుబ‌లి కూడా అని అర్థం వ‌చ్చేలా ఈ ప్ర‌చార క్యాంపేన్‌ను నిర్వ‌హిస్తున్నారు.


బాహుబ‌లి ప్ర‌చార పోస్టర్ల ప‌క్క‌ల మ‌రి కొన్ని పోస్టర్ల‌ను కూడా అనుసందానించారు. అందులో మీరు స్వాతంత్య్ర ఉద్య‌మం చేయ్య‌మ‌న లేదు, చెత్త‌ను డ‌స్ట్‌బిన్ లో వేసి మీరు కూడా ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ అవ్వండి, క్లీన్ ఆండ్ గ్రీన్ భార‌త్ అని ట్యాగ్ లైన్ పెట్టారు.  
 

loader