విశేష వార్తలు కాంగ్రెస్ దరువు ఎల్లన్న పాట చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై క్యాంపెయిన్  కాంగ్రెస్ పార్టీ నాయకులకు హరిష్ రావు సవాల్  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్మోహన్ రెడ్డి బీహార్ లో కార్తీక పౌర్ణమి వేడుకల్లో తొక్కిసలాట 

బ్యాంకు ఉద్యోగి ఘరానా మోసం (వీడియో)

 మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్ పరిధిలో అమాయకులను మోసం చేసి డబ్బులు వసూలుచేసిన ఓ బ్యాంకు ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే కొన్నిరోజుల క్రితం నెరేడ్మెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి బ్యాంక్ కు అనుసంధానంగా ఒక ఔట్లెట్ ను ప్రారంభించాడు. దాని ద్వారా కొంతమంది కస్టమర్ల దగ్గర నుండి డిపాజిట్ డబ్బులు కలెక్ట్ చేసేవాడు. ఆ డబ్బును బ్యాంక్ లో జమ చేయకుండా వాటిని సొంత అవసరాలకు మల్లించుకునేవాడు. అంతేకాకుండా కస్టమర్ల దగ్గర చేబదులు కూడా తీసుకుని వాడుకునేవాడు. ఈ విధంగా కస్టమర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి కొద్ది రోజుల క్రితం పరారయ్యాడు. దీంతో అతని చేతిలో మోసపోయినవారు న్యాయం చేయాలని బ్యాంక్ అధికారులను నిలదీయడంతో బ్యాంక్ అధికారులు మరియు భాధితులు కలిసి నేరెడ్మెట్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు..అప్పటినుండి అతని కోసం గాలిస్తున్న పోలీసులు ఈరోజు అతని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

కాంగ్రెస్ దరువు ఎల్లన్న దుమ్మురేపే పాట (వీడియో)

డిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఓయూ జేఏసి నేతలకు యూనివర్సిటీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సంధర్భంగా జేఏసి నేత, ప్రజా గాయకుడు దరువు ఎల్లన్న టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉర్రూతలూగించే పాట పాడారు. తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ ఎలా దోచుకుంటుందో ఈ పాటలో తెలియజేశారు ఎల్లన్న.

ఇబ్రహీంపట్నంలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం

రాజకీయ ప్రయోజనాలకోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్, తెలంగాణ ప్రయోజనాల కోసం చేరానని చెప్పడం విడ్డూరంగా ఉందని టీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు అరవింద్ అన్నారు. ఇవాళ టీఆర్ఎస్వీ ఆద్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని అంబెద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ కు రాజకీయ లబ్ది తప్ప వేరే ఏం పట్టవని. ప్రజలకు ఆయన వల్ల ఒరిగే ప్రయోజనమేమీ తేదని అన్నారు. ఇకనుంచైనా సీఎం కేసీఆర్ పై విమర్శలు మానకుంటే తగిన బుద్ది చెబుతామని టీఆర్ఎస్వీ నాయకులు హెచ్చరించారు.

ఇక్కడ రాహుల్ ఏం చేస్తున్నాడో చూడండి

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి బోజనంపై తనకున్న అభిరుచిని చాటుకున్నారు. తాను తిన్న హొటల్ లో బొజన పదార్ధాలు రుచిగా ఉండడంతో తింటునే వంటగదిలోకి వెళ్లి వంటచేసిన వారిని మెచ్చుకున్నాడు. అభినందించడమే కాదు వారితో గ్రూప్ పోటో దిగి వారిని ఆశ్యర్యంలో ముంచెత్తాడు. ఆ పోటోలు చూడండి.

నవంబర్ 20 న రాహుల్ వరంగల్ పర్యటన

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 20వ తేదీన వరంగల్‌లో జరిగే సభలో రాహుల్ పాల్గొననున్నారు. ఈమేరకు ఢిల్లీలోని రాహూల్ గాంధీ కార్యాలయం ఆయన పర్యటన వివరాలను ఖరారు చేసింది. ఇప్పటికే రేవంత్‌రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు పెద్దఎత్తున కాంగ్రెస్‌లో చేరారు. మరికొంత మంది రాహుల్ సమక్షంలో వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటు వలసలు, అటు రాహుల్ సభ రెండింటితో కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత జోష్‌ను నింపాలని టీ పీసీసీ ప్రయత్నిస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా కొత్తూరు లో విషాదం చోటుచేసుకుంది. కొత్తూరు సమీపంలోని జేపీ దర్గా వద్ద జరిగిన రోడ్డుప్రమాదం లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంగా వచ్చిన టిప్పర్ - బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఫరూఖ్‌నగర్ మండలం కొండన్నగూడ వాసులుగా స్థానికులు గుర్తించారు.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్గ్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

చిన్నారులపై లైంగిక వేధింపులను నియంత్రిద్దాం - తెలంగాణ పోలీస్

చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అకృత్యాలను నివారించడానికి తెలంగాణ పోలీస్ శాఖ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. స్టాఫ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూసింగ్ పేరుతో చిన్నారులపై జరుగుతున్న వేధింపులపై అవగాహన కల్పించడానికి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెక్లెస్ రోడ్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయని నర్సింహరెడ్డి, సినీ సెలబ్రీటీలు అక్కినూని అమల, రాశీ ఖన్నా,సునీత,బోయపాటి శ్రీను,సురేష్ బాబు, పోలీస్ ఉన్నతాధికారులు డీజిపి అనురాగ్ శర్మ, ఐజీ సౌమ్యా మిశ్ర తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ కు హరిష్ రావు సవాల్ 

ఉద్యమ సమయంలో తాము ప్రాజెక్టులను అడ్డుక్కున్నామని కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని హరిష్ రావు అన్నారు. ప్రాజెక్టులను టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుందని నిరూపిస్తే రాజీనమాకు సిద్దమని కాంగ్రెస్ సవాల్ విసిరారు. ఈ ఆరోపణ చేసిన షబ్బీర్ అలీ దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని ప్రకటించారు. ఈ మూడేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రజెక్టులకు.ఎన్ని విధాలుగా అడ్డుపడిందో తాను నిరూపించడానికి సిద్దంగా వున్నానని హరిష్ రావు ప్రకటించారు. 

కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి, నలుగురి మృతి

కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి జరిగింది. బీహార్ గంగా నదిలో కార్తీక స్నానాల కోసం బారీగా చేరుకున్న భక్తుల మద్య తొక్కిసలాట జరిగి నలుగురు మృతి చెందారు. ఇది బెగుసరాయ్ లోని సిమారియా ఘాట్ వద్ద జరిగింది. ఈ ఘటనలో పది మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు, సహాయక సిబ్బంది ఢటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

శ్రీవారిని దర్శంచుకున్న జగన్మోహన్ రెడ్డి

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు ముందు శ్రీవారి ఆశిస్సులు పొందాలని తిరుమలకు చేరుకున్న జగన్ నైవేద్య సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకులు మండపానికి చేరుకున్న జగన్‌ను వేద పండితుల ఆశిస్సులు తీసుకున్నాడు.
అక్కడి నుంచి శారదా పీఠం అతిథి గృహానికి చేరుకున్న జగన్ అక్కడే వున్న స్వరూపానంద సరస్వతి ని కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. తర్వాత జగన్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర జయప్రదం కావాలని శ్రీవారి మరియు స్వామీజి ఆశిస్సులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలందరు కూడా ఈ ప్రజా సంకల్ప యాత్రను జయప్రదం చేయాలని కోరారు.