గోదావరి నదిలో దూకి కుటుంబం ఆత్మహత్య

గోదావరి నదిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలో చోటుచేసుకుంది. సిద్దాంతం గ్రామానికి చెందిన బొబ్బిలి శివనాగరాజు, అతడి బార్య వరలక్ష్మి, కుమార్తెలు అమృత,చంద్రికలు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తమ ఆత్మహత్యలకు ఎవరూ కారణం కారంటూ సూసైడ్ లేటర్ రాసిపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

 

భువనగిరి జిల్లాలో హోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఆలేరు సమీపంలో హైదరాబాద్ కు వెళ్లే ప్రధాన రహదారిపై ఓ ఆర్టీసి బస్సు ఆటోను ఢీ కొట్టడం ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో  ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సింగరేణి లో సీఎం హామీలు నెరవేరనున్నాయి

సింగరేణి ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సింగరేణి బోర్డు ఆమోదం లభించింది.  మెడికల్ అన్ పిట్ తో ఉద్యోగం వద్దరుకునే వారికి రూ.25 లక్షలు, జీవన భృతి కావాలనుకుంటే రూ.25 వేలు ఇవ్వనున్నట్లు సింగరేణి సీఎండి శ్రీధర్ తెలిపారు. అలాగే ఉద్యోగుల తల్లిదండ్రులకు కార్పోరేట్ వైద్యం, మహిళా ఉద్యోగినులకు చైల్డ్ కేర్ లీవ్ లు ఇవ్వడానికి బోర్డు ఆమోదం లభించింది. అలాగే అంబేద్కర్ జయంతిన వేతనంతో కూడిన సెలవును ఇవ్వడానికి సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. 

నియోజకవర్గ ప్రజలతో ముఖాముఖి - జగ్గారెడ్డి

కేసీఆర్ మోసపు హామీలపై తన నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు మాజీ కాంగ్రెస్ విఫ్, సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రకటించారు. ఇందులో బాగంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 2 వ తేదీ నుంచి మొత్తం మూడు నెలల పాటు ఈ  ముఖాముఖీ కార్యక్రమం ఉండనుందన్నారు.కేసీఆర్ సర్కార్ ను నిలదీసేందుకు జనంలో చైతన్యం తీసుకొస్తానని జగ్గారెడ్డి వివరించారు. 
గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన అబద్దపు హామీలకు మోసపోయి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ ఎన్నికల దగ్గరపడుతున్నా వారు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ మోసాన్నిరాష్ట్ర ప్రజలను తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. 

మంచిర్యాల సిఐ బాలరాజు సస్పెండ్ 

"మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ లో సిఐ బాలరాజుపై వేటు పడింది. ఓ మహిళను వేదించిన కేసులో అతడ్ని సస్పెండ్ చేస్తూ  డిఐజి రవివర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తన భర్త అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన అప్సర భాను అనే వివాహితను లైంగిక వేధింపులకు గూరిచేసినట్లు బాలరాజుపై అభియోగాలున్నాయి. బాధిత మహిళ పిర్యాదు ఆధారంగా రామగుండం పోలీసు కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ ఆద్వర్యంలో విచారణ జరిగింది. ఈ విచారణ నివేదిక ఆధారంగా సిఐ బాలరాజును సస్పెండ్ చేస్తూ డి ఐ జి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

 

తెలంగాణ నిరుద్యోగులకు మరో శభవార్త. పోలీస్ శాఖలో ఖాళీగా వున్న 3897 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల్లో 907  సివిల్ కానిస్టేబుల్ పోస్టులు కాగా మిగిలిన 2990 ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుల్ కు చెందిన పోస్టులు ఉన్నాయి.  
 

కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారుచేసిన రేవంత్ 
 

కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేపే  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇవాళ తన అభిమానులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సభలో ఈ కీలక ప్రకటన చేశారు. దీంతో అతడు కాంగ్రెస్ లో అప్పుడు చేరతాడు, ఇప్పుడు చేరతాడు అంటూ జరుగుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. రాజకీయ పునరేకీకరణ కోసమే కాంగ్రెస్ లో చరుతున్నట్లు రేవంత్ తెలిపాడు.  

జనావాసాలపై విరిగిపడిన హెలికాప్టర్ డోర్

హైదరాబాద్ :  హెలికాప్టర్ డోర్ విరిగి జనావాసాల మద్య పడిన సంఘటన సికింద్రాబాద్ లోని లాలాగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆకాశం లోంచి ఏదో వస్తువు బస్తీలోని ఓ ఇంటిపై పడటంతో యాదవబస్తీ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అందరూ గుమిగూడి ఈ ఇంటిపైకి వెళ్లి చూడగా అది హెలికాప్టర్ తలుపుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఈ డోర్ ని స్వాధీనం చేసుకున్నారు. అది శిక్షణ హెలికాప్టర్ కు చెందిన డోర్ గా పోలీసులు గుర్తించారు. పెద్ద శబ్దం తొ అది ఆకాశం నుండి పడటం వల్ల కాలనీ వాసులు భయపడ్డారని అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.
 

రేవంత్ ఆత్మీయ సభకు ఉత్తమ్ 

టిడిపిని వీడిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మీయులతో ఏర్పాటు చేసిన  మాట ముచ్చట సభకు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న నేపథ్యంలో రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సభకు హాజరైనారు.

మమత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చీవాట్లు

సంక్షేమ పథకాలకు ఆదార్ అనుసందానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. వివరాల్లోకి వెళితే అన్ని సంక్షేమ పథకాలకు ఆదార్ ను అనుసందానం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్ ప్రభుత్వ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు కేంద్ర నిర్ణయంపై ఓ రాష్ట్రం సవాల్ చేయడం ఏమిటని  ప్రశ్నించింది. కేంద్ర నిర్ణయాలను పాటించాల్సిన బాద్యత అన్ని రాష్ట్రాలపై ఉంటుందని సూచించింది. అంతేకాకుండా రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రం పై ఉంటుందని తెలిపింది. బెంగాల్ ప్రభుత్వ పిటిషన్ పై నాలుగు వారాల్లో స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి దర్మాసనం నోటీసులు జారీ చేసింది. 
 

విమానం పేల్చివేస్తామంటూ ఉగ్రవాదుల బెదిరింపు లేఖ

ఉగ్రవాదుల బెదిరింపులతో జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానాన్ని అత్యవసరంగా దారిమళ్లించారు. ముంబై నుండి డిల్లీకి వెళుతున్న విమానంలో హైజాకర్లు, పేలుడు పదార్థాలు ఉన్నట్లు సిబ్బందికి ఓ లెటర్ దొరికింది. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 115 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు విమాన సిబ్బంది వున్నారు. వీరంతా క్షేమంగా ఉన్నారు.
 

''ఉగ్రవాద సంస్థలతో దేశానికి ముప్పు పొంచి ఉంది'' 

ఐసిస్ , ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలతో దేశానికి ముప్పు పొంచి ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. అయితే ఎప్పటికప్పుడు వారిని అడ్డుకుని మన ఇంటెలిజెన్స్ అధికారులు చక్కని పనితీరు కనబరుస్తున్నారని హోం మంత్రి ప్రశంసించారు.  
ఇవాళ హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పెరేడ్ లో ఆయన పాల్గొన్నారు. 69వ బ్యాచ్ లో శిక్షణ పూర్తి చేసుకున్న136 మంది ఐపీఎస్ నుండి ఆయన గౌరవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హోమంత్రి వారు ఎంత చక్కగా శిక్షణ పొందారో ఈ పరేడ్ ను చూస్తేనే అర్థమవుతుందని ప్రశంసించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోడానికి తమ సర్వీస్ ను ఉపయోగించాలని నూతన ఐపీఎస్ లను సూచించారు.
 

గుంటూరులో రౌడీషీటర్ దారుణ హత్య (వీడియో)

గుంటూరు పట్టణంలో దారుణ హత్య జరగింది. మాజీ ఎమ్మేల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరుడు తాడిశెట్టి మురళికి ప్రధాన అనుచరుడైన బసవల భారతివాసు అనే  రౌడీ షీటర్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. స్కార్పియోలో వచ్చిన ఐదుగురు అగంతకులు ఈ హత్యలో పాల్గొన్నట్లు సిసి టివి పుటేజిలో స్పష్టంగా రికార్డయ్యింది.
ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.