Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

  • అధునీకరణ దిశగా నెహ్రూ  జూ పార్క్
  • సర్వాపురం  వాగులో  కొట్టుకొనిపోయి వాగు మధ్యలో చెట్టు పట్టుకుని సహాయం కోసం వేచి చూస్తున్న కానిస్టేబుల్  నాగేశ్వరరావు 
  • విజయవాడ  పోలీసుల ఆద్వర్యంలో  మహిళల  ఆత్మరక్షణ పై అవగాహన  సదస్సు
  •  పదోన్నతుల  గురించి  సీఎస్ ఎస్పీ సింగ్ ను కలిసిన 1991 బ్యాచ్ సబ్ ఇన్స్‌పెక్ట‌ర్‌ల‌ు  
asianet telugu express news  Andhra Pradesh and Telangana

మారనున్న నెహ్రూ జూ పార్క్ రూపురేఖలు

asianet telugu express news  Andhra Pradesh and Telangana

హైదరాబాద్ లో మినీ ఫారెస్ట్ గా పిలుచుకునే  జూ పార్కును అధునీకరించడానికి అటవీ శాఖ ముందుకు వచ్చింది. అరణ్య భవన్ లో జరిగిన  జూపార్క్ సలహా మండలి సమావేశంలో జూ పార్కులో నెలకొల్పాల్సిన సదుపాయాలపై వారు పలు తీర్మానాలు చేశారు. జంతువుల ఎన్ క్లోజర్లు, వాటికి రాత్రుల్లో బస చేయడానికి ఏర్పాటు, అలాగే సందర్శకులకు కూడా అధునాతన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అలాగే పార్కు పక్కన గల  మీరాలం చెరువులో వుండే కాలుష్య ప్రభావం జూ పార్క్ తో పాటు,జంతువులపై పడుతున్నందున చెరువు ట్రీట్ మెంట్ పై కూడా సమావేశంలో చర్చ జరిగింది. జంతువుల దత్తతను మరింతగా ప్రోత్సాహించి, ఐటీ కంపెనీలను కూడా వీటిలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.
 

సాగునీటి ప్రాజెక్టులకు న్యాయం కావాలి 

జలసౌధ లో  నిర్మాణంలోవున్న సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకిగా వున్న కోర్టు కేసులపై నీటిపారుదల శాఖ మంత్రి హరిష్ కావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లా సెక్రెటరీ, ప్రభుత్వ లాయర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో ఆయన సమాలోచనలు జరిపారు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ కేసులను మూయించి, సాగునీటి ప్రజెక్టులకు అడ్డంకులు తొలగించాలని వారికి మంత్రి సూచించారు.
 

మాజీ మావోయిస్టు నేత అరెస్టు

మాజీ మావోయిస్టు నేత శ్రీరాముల శ్రీనివాస్ అలియాస్ సుదర్శన్ ను సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని  నాగారం గ్రామంలో వున్న సుదర్శన్ ను ఇంటి నుండి  లాక్కుపోయారు. అడ్డుకోబోయిన  తనను కూడా దురుసుగా పక్కకు నెట్టేసిన పోలీసులు  బలవంతంగా తన భర్తను అదుపులోకి తీసుకున్నారని ఆమె ఆందోళనగా తెలిపింది.  
 

వాగులో చిక్కుకున్న పోలీస్

వరంగల్ రూరల్ : నల్లబెల్లి మండలంలోని పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు అనే కానిస్టేబుల్ సర్వాపురం పక్క వాగులో  కొట్టుకొనిపోయి వాగు మధ్యలో చెట్టు పట్టుకుని సహాయం కోసం వేచి చూస్తున్నాడు.
 

టాయ్‌లెట్ -ఎక్ ప్రేమ్‌కథ పార్ట్ 2

asianet telugu express news  Andhra Pradesh and Telangana

అక్షయ్ కుమార్ హీరోగా సామాజిక కథాంశాంతో  తెరకెక్కిన టాయ్‌లెట్ -ఎక్ ప్రేమ్‌కథ సినిమా మీరు చూసే వుంటారు.అయితే ఈ సినిమా పార్ట్ 2 లో తొలి సీన్ ఇక్క‌డ‌ే అయి ఉండొచ్చన్న సందేశంతో అక్షయ్ బార్య ట్వింకిల్ కన్నా ట్విట్టలో పెట్టిన  పోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స‌ముద్రం ఒడ్డున బ‌హిర్భూమికి కూర్చున్న వ్య‌క్తిని త‌న కెమెరాలో బంధించిన ట్వింకిల్  ఆ ఫోటోని సోష‌ల్ మీడియాలో పెట్టింది. అదిపుడు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది.
 

ఇలా కూడా దీవిస్తారా, బాబోయ్

మనం రెండు చేతులను ఆప్యాయంగా తలపై పెట్టి దీవించడం చూస్తుంటాం. అలా కాకుండా కొందరు స్వామీజీలు అభయమిస్తున్నట్లు దీవించడం చూస్తుంటాం. కాని పై వీడియోలోని దీవెనలు ఏ రకానికి చెందినవో మీరే చెప్పాలి.
 

బాణసంచా కర్మాగారంలో పేలుళ్లు

ఒడిషా : కుర్దా జిల్లా సిక్కో లోని ఒక బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో  ఐదుగురు  అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాణసంచా తయారిలో వాడే మందుగుండు పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా విచారించి తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.  
 

గర్బవతిగా వున్న భార్య కడుపుపై తన్నిన భర్త

asianet telugu express news  Andhra Pradesh and Telangana

విజయనగరం జిల్లాలో ఒక కానిస్టేబుల్ కట్టుకున్న భార్యపైనే అమానుషంగా దాడి చేసాడు.కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేష్ అనే ప్రబుద్దుడు 5 నెలల గర్భిణిగా వున్న తన బార్య సునీతను కడుపుపై తన్నాడు. అతడు గతకొంత కాలంగా భార్యను అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నాడు. అతడి పోరు తట్టుకోలేక అబార్షన్ చేసుకొనని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది సునీత. అయితే బార్యను కాపురానికి పంపించాలని  పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టిన వెంకటేశ్ అందరూ చూస్తుండగానే బార్య కడుపుపై తన్నాడు. వెంటనే ఆమెను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు కుటుంభసభ్యులు.  

విక్రమ్ గౌడ్ కి బెయిల్ మంజూరు

asianet telugu express news  Andhra Pradesh and Telangana

బూటకపు కాల్పుల కేసులో ప్రదాన సూత్రదారి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతడి పాస్ పోర్టును  సరండర్  చేసుకోవాలని పోలీసులకు సూచించారు న్యాయమూర్తి. అలాగే ప్రతి ఆధివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని  విక్రమ్ గౌడ్ ను ఆదేశించారు. 
 

సచివాలయానికి చేరిన పదోన్నతుల పంచాయితి

asianet telugu express news  Andhra Pradesh and Telangana

1991 బ్యాచ్ సబ్ ఇన్స్‌పెక్ట‌ర్‌ల‌ పదోన్నతుల అంశం సచివాలయానికి చేరింది. తమకు డీఎస్పీలుగా ప్రమోషన్లు కల్పించాలని ఈ బ్యాచ్ కి చెందిన 150 మంది అధికారులు తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్ ను కలిసారు. ప్రభుత్వాలు మారతున్నాయే తప్ప, తమకు ప్రమోషన్లు రావడంలేదని వారు ఆవేదన చెందారు. పదోన్నతులు కల్పించని పక్షంలో సామూహిక సెలవులకు దిగుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
 

మహిళలు ఆత్మరక్షణ పొదండిలా

విద్యార్థినులు ఆపత్సమయంలో మార్షల్స్ఆర్ట్స్ నైపుణ్యం ప్రదర్శించి ఎలా బయటపడాలో విజయవాడ  పోలీసులు ప్రదర్శన ఇచ్చి చూపించారు. సిదార్ధ వైద్య కళాశాలలో మహిళలకు  ఆత్మరక్షణ పై అవగాహన కల్పించేందుకు ఒక సదస్సు ఈ రోజు జరిగింది. ఆత్మరక్షణలో మార్షల్ ఆర్ట్స్ ఎలా పనికొస్తాయో చూడండి మరి...
 

స్కూళ్ల అధిక ఫీజు వసూళ్లపై షోకాజ్ నోటీసులు

asianet telugu express news  Andhra Pradesh and Telangana

అదనపు ఫీజులు వసూలు చేస్తున్నందుకు 449 పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అదనంగా వసూలు చేసిన ఫీజును తల్లిదండ్రులకు తిరిగి చెల్లించనట్లయితే, పాఠశాలలను స్వాధీనం చేసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ పాఠశాలల ఖాతాలను పరిశీలించాలని విద్యాశాఖ అధికారులను ఢిల్లీ సర్కారు  ఆదేశించింది. అదనంగా వసూలు చేసిన ఫీజును రెండు వారాలలోగా తిరిగి చెల్లించాలని ఆదేశించిన డిల్లీ సర్కారు, ఈ విషయంపై విచారణకు మాజీ న్యాయమూర్తి అనిల్ దవే నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.
 

హీరోయిన్ ను వేధించిన వర్ధమాన నటుడికి జైలుశిక్ష

asianet telugu express news  Andhra Pradesh and Telangana

 సినీ హీరోయిన్ పై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ‘అప్పుడు ఇప్పుడు‘’ హీరో సృజన్, డైరెక్టర్ చలపతిలకు విజయవాడ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. హీరోయిన్ ఫిర్యాదు మేరకు వారిని విజయవాడ పడమటలంక పోలీసులు అదుపులోకి తీసుకుని, నాల్గవ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విదించారు.
 

నితీష్ ఇంటిముందు ఆర్జేడీ కార్యకర్తల నిరసన

asianet telugu express news  Andhra Pradesh and Telangana

జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇంటి ముందు ఆర్జేడీ కార్యకర్తలు, శరత్ యాదవ్ మద్దతుదారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్డీఏలో చేరిన నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేసారు.  జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ ఆందోళనకు జేడీయూ వ్యూహరచన చేసింది. ఈ సందర్బంగా జేడీయూ నుంచి  తొలగించబడిన శరద్ యాదవ్ మాట్లాడుతూ... ప్రస్తుతం జరుగుతున్నది జేడీయూ సమావేశం కాదని  బీజేపీ సమావేశమని ఎద్దేవా చేశారు.
 

మేడ్చల్ లో కిడ్నాప్ కలకలం

మేడ్చల్  పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో మణిందర్ అనే   బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది.  కిడ్నాప్ చేసిన దుండగులు బాలుడి కుటుంబసభ్యులకు పోన్ చేసి బెదిరించారు. "పది లక్షలు ఇస్తేనే మీ పిల్లవాడు మీ ఇంటికి వస్తాడు'' అంటూ కిడ్నాపర్లు బెదిరించడంతో ఆందోళనకు  గురైన వారు పోలీసులను ఆశ్రయించారు.
 

జనగామ అభివృద్దికై సమీక్షా సమావేశం

asianet telugu express news  Andhra Pradesh and Telangana

జనగామ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి  పాల్గొన్నారు. ఆయనతో పాటు  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్ పర్సన్ పద్మ,  ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజయ్య లతో పాటు  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులు,  రావాల్సిన నిధులపై వారు చర్చిస్తున్నారు.
 

పేద వృద్దురాలికి అండే లేదు

asianet telugu express news  Andhra Pradesh and Telangana

పంది కాటు కి పేద వృద్ధురాలు  బీబిజాన్ గాయపడి 24 గంటలు  అయ్యింది. కానీ కావలి  లోని ఏ ఒక్క  రాజకీయ నాయకుడికి కాని, ఏ ఒక్క సేవా సంస్థకు కానీ ఇంత వరకు పరామర్శ  చేయడానికి  తీరిక లేకుండా  పోయింది. ఈ విషయం చెప్పేందుకే...మానవతా వాది గా సిగ్గు  పడుతున్నా. అదే స్థానంలో ప్రముఖుడు ఉంటే పరామర్శలు వెల్లువెత్తేవి?? మైనారిటీల కోసం పాటు పడుతామన్నామని నిత్యం    గోల చేసే మైనారిటీ  నేతలు కూడా ఈ మధ్యాహ్నం దాకా ఆమెను పట్టించుకోలేదు.

సచివాలయంలో ఆత్మహత్యాయత్నం

asianet telugu express news  Andhra Pradesh and Telangana

ఆంధ్ర ప్ర‌దేశ్ స‌చివాల‌యంలో నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్ఎంపీ డాక్ట‌ర్ రాజ‌గోపాల్ ఇవాళ మృతి చెందాడు. శుక్రవారం తన సమస్యలను సీఎం చంద్రబాబుకు చెప్పడానికి వచ్చిన భాదితుడు, రాత్రి వరకు కూడా సీఎం అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో ఆవేదన చెందాడు. దీంతో తనతో పాటే తెచ్చుకున్న పురుగుల మందు  తాగి సచివాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన సెక్యూరిటి సిబ్బంది ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ  ఇవాళ మరణించాడు. 
 

మహిళా రక్షణకు మరో ముందడుగు

asianet telugu express news  Andhra Pradesh and Telangana

హైద‌రాబాద్: మ‌హిళలకు రక్షణ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే షీ టీమ్ ల  ఏర్పటుతో మహిళలపై వేదింపులను తగ్గించే ప్రయత్నం చేసిన ప్రభుత్వ తాజాగా మ‌హిళా హెల్ప్ లైన్ నెంబ‌ర్ 181 ను ప్రారంభించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో పనిచేయనున్న ఈ హెల్ప్ లైన్ నెంబ‌ర్ ను మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్రారంభించారు. గృహ హింస‌, వ‌ర‌క‌ట్న వేధింపుల‌ు, ఉద్యోగినులపై వేదింపులపై ఈ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు సమాచారం అందించవచ్చని తుమ్మ‌ల తెలిపారు.

నంద్యాల పోలీసు బాసుపై వేటు

కర్నూల్ జిల్లా :  నంద్యాల ఉప ఎన్నితల నేపథ్యంలో పోలీసులపై వేటు మొదలయింది. నంద్యాల  సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గోపాలకృష్ణ ను ఎన్నికల కమిషన్ బదిలీకి నిర్ణయం తీసుకుంది. ఈసీ స్వయంగా  ఆదేశించడవతో బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ఇంచార్జ్ డీఎస్పీగా ఓఎస్డీ రవిప్రకాశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. .

తుడా చైర్మన్ కి అవమానం

asianet telugu express news  Andhra Pradesh and Telangana

తిరుపతి : తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో దిగిన సీఎం చంద్రబాబు ను కలవడానికి వెళ్లిన తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీన్ని తీవ్ర అవమానంగా పరిగనించిన ఆయన సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్త చేశారు.  సీఎం కాన్వాయ్ కి అడ్డంగా తన కారును నిలిపి నిరసన తెలియజేశారు. అక్కడకు చేరుకున్న సీనియర్ నేతలు ఆయన్ని బుజ్జగించి గెస్ట్ హౌస్ లోకి తీసుకువెళ్లినా ఆయన సీఎంను కలవకుండానే వెనుదిరిగారు. 

నంద్యాల ఎన్నికల్లో పోలీసుల తనిఖీలు 

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారన్న అనుమానంతో వైసీపి నేత దస్తగిరిరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.  బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని అతని ఇంట్లో రూ 47 లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ డబ్బును ఎన్నికల అధికారులకు అందించనున్నట్లు తనిఖీ చేసిన బనగానపల్లె ఎస్సై  హనుమంత్‌రెడ్డి తెలిపారు. 
 

మహిళా ఉద్యోగినులకు సింగరేణి యాజమాన్యం బాసట

asianet telugu express news  Andhra Pradesh and Telangana

 

సింగరేణిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు సింగరేణి యాజమాన్యం బాసటగా నిలిచింది.  వారికి మెటిర్నిటీ సెలవును 12 వారాల నుండి 26 వారాలకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.అలాగే సింగరేణిలో  అవుట్ సోర్సు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాలను అమలు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి సిఎండి ఎన్. శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.  

ప‌దిరోజుల్లోగా లోధా యాజమాన్యం వివ‌ర‌ణ ఇవ్వాలి - జీహెచ్ఎంసీ

asianet telugu express news  Andhra Pradesh and Telangana

 కూకట్ పల్లి  లోని లోధా నిర్మాణ సంస్థపై బెలేజ‌, మెరిడీయ‌న్ అపార్ట్‌మెంట్ నివాసితులు చేసిన ఆరోప‌ణ‌లపై ప‌దిరోజుల్లోగా  వివ‌ర‌ణ ఇవ్వాలని లోధా యాజ‌మ‌న్యానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి ఆదేశించారు. లోధా నిర్మాణ సంస్థ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించింద‌ని,ప్లాట్ల కొనుగోలు సమయంలో చేసుకున్న ఒప్పందాన్ని విస్మరించారని పేర్కొంటు అపార్టుమెంట్ వాసులు జీహెచ్ఎంసీకి పిర్యాదు చేశారు. దీంతో లోధా నిర్మాణ సంస్థ ప్ర‌తినిధులు, బెలేజ, మెరిడీయ‌న్ అపార్ట్‌మెంట్ వాసుల‌తో  జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఉమ్మ‌డి స‌మావేశాన్ని జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో నిర్వ‌హించారు.  ఈ నెల 29వ తేదీ లోపు ఆరోపణలపై వివరణలను త‌మ కార్యాల‌యానికి తెల‌పాల‌ని లోధా నిర్మాణ సంస్థ ప్ర‌తినిధుల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్  కోరారు.   

నంద్యాలలో  ఈసీ  తనిఖీలు 

asianet telugu express news  Andhra Pradesh and Telangana

విజయవాడ నుంచి భారీగా డబ్బు తరలిస్తున్నారన్న సమాచారంతో ఈసీ బృందాలు నంద్యాల పరిసరాల్లో  తనిఖీలు నిర్వహించారు.  విజయవాడ నుంచి వస్తున్న ఓ కంటైనర్ ను ఈసీ బృందం పట్టుకుంది. ఆర్టీసీ పేరుతో రిజిస్టర్ అయిన ఈ కంటైనర్ డ్రైవర్ ను ప్రశ్నించగా, ఇది సీఎం పాంట్రీ వాహనం అని ఈసీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఈ వాహనాన్ని చెక్ పోస్ట్ కు తరలించేందుకు  అధికారుల ప్రయత్నిస్తున్నారు. తనిఖిలు జరుగుతున్న గాజులపల్లెమెట్ట వద్దకు  భారీగా పోలీసులు చేరుకున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios