విశేష వార్తలు కేసీఆర్ కు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఆటో సంఘాలు మొదలైన తెలంగాణ కేబినెట్ సమావేశం కార్యకర్తలో రేవంత్ సమావేశం శ్రీధర్ రెడ్డి పై కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టిన టిపిసిసి ప్రెసిడెంట్ నిలోఫర్ హాస్పిటల్ నుంచి చిన్నారి కిడ్నాప్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారి

విద్యార్థులపై కర్కశత్వం ప్రదర్శించిన స్కూల్ యాజమాన్యం (వీడియో)

హైదరాబాద్ లో ఫీజుల కోసం విద్యార్థులను శారీరకంగా హింసించిన ఓ ప్రైవేట్ పాఠశాల బాగోతం వెలుగుచూసింది. మాదాపూర్ లోని శ్రీ నగర్ కాలనీలోని ఎంజీఎం స్కూల్ యాజమాన్యం దారుణానికి ఒడిగట్టింది. ఫీజు కట్టలేదని విద్యార్థులను పరీక్ష కు అనుమతించక పోవడమే కాకుండా, ఎండలో నిలబెట్టి హిసించింది. దీంతో నలుగురు విద్యార్థినులు ఎండ వేడికి తట్టుకోలేక సృహ తప్పి పడిపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు భారతరత్న

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత రత్న అవార్డును ప్రధానం చేయాలని ఆటో డ్రైవర్స్ జేఏసి కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి మత ఘర్షనలు లేకుండా ప్రశాంతంగా ఉందని అన్నారు. ఇంత ప్రశాంతంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న కేసీఆర్ కు ఈ నెల 25 న రవీంద్ భారతిలో సన్మానించి, ఆయనకు శాంతి దూత అవార్డును ప్రకటించనున్నట్లు తెలిపారు. 

గుజరాత్ లో సమాజ్ వాది పార్టీ మద్దతు కాంగ్రెస్ కే 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వనున్నట్లు సమాజ్ వాది పార్టీ అద్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. అయితే తమకు పట్టున్న ఐదు స్థానాల్లో సొంతంగా పోటీచేసి మిగతా చోట్ల కాంగ్రెస్ కు మద్దతిస్తామని తెలిపారు. ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన ఆయన, ఎట్టి పరిస్థితుల్లో బీజేపి గెలుపును అడ్డుకుంటామని దీమా వ్యక్తం చేశారు.

సినిమా హాళ్లలో జాతీయగీతాలాపన పై పున:సమీక్ష

సినిమా థియేటర్ లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేసిన అంశాన్నిపున:సమీక్షించుకునేందుకు సుప్రీం కోర్టు సంసిద్దం వ్యక్తం చేసింది. థియేటర్లతో జాతీయ గీతాలాపన సంధర్భంగా లేచి నిలబడని వారంతా దేశద్రోహులు కారని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి ఒక్కరు దేశ భక్తిని భుజాలపై మోయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. దీనిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నాక సమీక్ష జరపనుంది. 

ఆర్కే నగర్ నుంచి దినకరన్ పోటీ

ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో పోటీ చేస్తానని అన్నాడీఎంకే బహిషృత నేత టిటివి దినకరణ్ ప్రకటించారు.ఈ ఎన్నికల్లో తనకు పోటీగా ఎవరు నిలబడినా గెలుపు మాత్రం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ కు ఉపఎన్నిక అనివార్యంగా మారింది. ఎలక్షన్ కమీషన్ గుజరాత్ ఎన్నికలతో పాటు ఆర్కేనగర్ కు కూడా ఉపఎన్నిక నిర్వహించాలనుకుంటోందన్న ఊహాగానాల నేపథ్యంలో దినకరన్ చేసిన ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. 

ఎర్రగడ్డ లో నడిరోడ్డుపై వివాహితపై కత్తితో దాడి

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో దారుణం జరిగింది. ఎర్రగడ్డ రైతుబజార్ వద్ద నడిరోడ్డు పై ఓ వివాహితను యువకుడు కత్తితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు.
కొంత కాలంగా ఈ వివాహితకు ప్రేమ పేరుతో ఈ యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు తాళలేక గతంలో రెండు సార్లు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో భాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న యువకుడు ఆమె హత్యకు పథక రచన చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

మొదలైన తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ కేబినెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశమయ్యంది. 65 అంశాలతో కూడిన భారీ ఎంజెండా పై ఈ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలో ప్రారంభంకానున్న శీతాకాల సమావేశాలు, ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, అనుసరించిన వ్యూహాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టనున్న పంచాయతీరాజ్ చట్టం, ప్రైవేట్ యూనివర్సటీలు, ఉద్యోగ నియామకాలకు సంభందించిన విషయాలపై చర్చించే అవకాశం ఉంది.

''కాబోయే సీఎం రేవంత్ రెడ్డి'' (వీడియో)

రేవంత్ రెడ్డి కాబోయే సీఎం.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు కొడంగల్ నియోజవర్గంలోని ఆయన అభిమానులు. ఆదివారం నాడు కొడంగల్ లో జరిగిన కార్యకర్తల సభలో రేవంత్ మాట్లాడుతుండగా కొందరు కార్యకర్తలు ఇలా నినాదాలు చేశారు. రేవంత్ అభిమానులు,కార్యకర్తల జోష్ ఒక్కసారి పై వీడియోలో చూడండి.

నల్సార్ యూనివర్సిటీలో యదేచ్చగా గంజాయి సరఫరా

తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు డ్రగ్స్ నిషేదానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతుంది. ఏకంగా కొందరు కాలేజీ విద్యార్థులే తమ తోటి విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యవహారం షామీర్ పేటలో చోటుచేసుకుంది. నల్సార్ యూనివర్సిటీ కి చెందిన ఇద్దరు విద్యార్థులు గంజాయి సప్లై చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరు ఇదే కాలేజీకి చెందిన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అరవింద్ తివారి, యువరాజ్ మెహ్రా లుగా పోలీసులు గుర్తించారు.

మీర్ పేట్ లో ఆర్టిసి ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్ మీర్ పెట్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ ఎన్ రెడ్డి నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో అదే కాలనీ కి చెందిన సుధాకర్ (49) అనే వ్యక్తి తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బస్ భవన్ లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

భువనగిరి జిల్లాలో 400 సబ్సిడీ గొర్రెల మృతి (వీడియో)

యాదాద్రి భువనగిరి జిల్లా : రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెంలో రైలు డీకొని సుమారు 400 గొర్రెలు మృతిచెందాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా సబ్సిడీపై వచ్చిన గొర్రెలు రైలు ప్రమాదంలో మృతి చెందడంతో లబ్ధిదారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొమ్మాయిగూడెంకు వద్ద రైల్వే ట్రాక్ పై ఆంత పెద్ద సంఖ్యలో చనిపోయిన గొర్రెలను చూసి భాధితులే కాదు స్థానికులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీధర్ బాబు అనుచరుల అరెస్ట్ 

మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు సంబంధించిన కేసులో అతని అనుచరులు సుదర్శన్, భార్గవ్ లను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు లో హాజరుపర్చగా, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వీరిద్దరిని చంచల్ గూడ జైల్ కు తరలించారు.

ఇకనుంచి విజయవాడ థియేటర్ల లో బయటినుంచి తిను బండారాలు 

మల్టీ ఫ్లెక్స్ థియేటర్ లలో తినుబండారాలను, మంచినీటి బాటిళ్లను బయట నుండి తీసుకెళ్లి చక్కగా సినిమాచూడొచ్చంటా. అవునండీ మీరు వింటున్నది నిజమే. కానీ ఈ సదుపాయం విజయవాడ లో మాత్రమే. అది కూడా ఈ రోజు నుంచే అమలు.
వివరాల్లోకి వెళితే విజయవాడలో మల్టీప్లెక్సుల్లో అధిక ధరలకు తిను బండారాలు, వాటర్ బాటిల్స్ అందిస్తున్నారని వినియోగదారులు కలెక్టర్ కు ఫిర్యాధు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ లక్ష్మీ కాంతం నగరం లోని మల్టీఫ్లెక్స్ ధియేటర్ ల లో ఎమ్ ఆర్ పి ధరలకే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అమ్మకాలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే బయటినుంచి వీటిని తీసుకువచ్చేందుకు కూడా అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఎవరైనా అడ్డుకుంటే 1100 కి డయల్ చేయమని సూచించారు.
అయితే,వాటర్ బాటిల్స్ ని థియేటర్ లోకి తీసుకెల్లడానికి థియేటర్ యజమానులు ఓప్పుకోవడం లేదు. వీటిని అనుమతించగం వల్ల యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలు థియేటర్ లోకి తీసుకెళ్లె ప్రమాదం ఉందని, అందువల్ల తాము ఈ ఆదేశాలను అమలు చేయమంటున్నారు.

కాళేశ్వరం కమీషన్ల కోసమే శ్రీధర్ బాబుపై కేసు 

కాళేశ్వరం అక్రమాలపైన శ్రీధర్ బాబు పోరాటాలు చేస్తుండడంతో కమిషన్లు రాకుండా పోతాయనే భయంతోనే టీఆర్ఎస్ నాయకులు ఆయన్ను కేసుల్లో ఇరికించారని టీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామిక పోరాటాలు చేస్తున్న వారిపైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. అందులో భాగంగానేమే శ్రీదరబాబుపైన కేసు నమోదు చేశారని విమర్శించారు. ఒక్క శ్రీధర్ బాబు పైనే కాదు పోరాటాలు చేస్తున్న కోదండరాం, కాంగ్రెస్ పార్టీ, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులపై కూడా కేసులు పెట్టి అణచివేత ధోరణులకు ప్రభుత్వం పాల్పడుతోంది.
టీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా చేస్తున్న అక్రమాలపైన కేసులు పెట్టని ఈ పాలకులు కాంగ్రెస్ నాయకులపైన కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇలాంటి ఆగడాలకు కాంగ్రెస్ నాయకులు భయపడేది లేదని, పోరాటాలు ఆపేది లేదని ప్రభుత్వానికి హెచ్చరించారు.

''శ్రీధర్ బాబు పై కుట్రపన్నుతున్న పుట్ట మధు'' (వీడియో)

మాజీ మంత్రి శ్రీధర్ బాబు ను అక్రమంగా కేసులో ఇరికించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పుట్ట మధు హస్తం ఉందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు నందు ఆరోపించాడు. మండల స్థాయి కార్యకర్తను కేసులో ఇరికించాడానికి మంత్రి స్థాయి వ్యక్తికి సంభందముందనడం హాస్యాస్పదంగా ఉందన్నాడు.
ఇందుకు సంభందించి వారు బయటపెట్టిన ఫోన్ కాల్ సంభాషణలు అధికార పార్టీ సృష్టించినవేనని, ఇలా వాయిస్ ను సృష్టించే ఆప్స్ ఎన్నో వున్నాయని నందు వివరించాడు. ఈ విషయం మంథని ఎమ్మెల్యే మధుకు కు తెలువది కావచ్చు, కాని ప్రజలకు తెలుసని అన్నారు.

గాంధీలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు మోసం

గాంధీ హాస్పిటల్ లో అటెండర్ ఇంఛార్జిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఘరానా మోసం బయటపడింది. గాంధీలో అటెండర్ ఉద్యోగాలు ఇస్తామని అటెండర్ ఇంఛార్జి రవి నిరుద్యోగులనుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. నిరుద్యోగ యువత నుంచి సుమారు 20 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు బావిస్తున్నారు. భాదితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిద్దిపేట పోలీసులు నిందితుడు రవిని అరెస్ట్ చేశారు.

ఎంపి కూతురినంటూ బంజారాహిల్స్ లో ఓ యువతి హల్ చల్ 

ఎంపీ కూతురినంటూ ఓ యువతి బంజారాహిల్స్‌లోని సిటీసెంటర్‌ మాల్‌లో హల్ చల్ చేసింది. వివరాల్లోకి వెళితే ఏపీ అసెంబ్లీలో టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయం కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్‌ తన భార్య భాను తో కలిసి బంజారాహిల్స్‌ సిటీసెంటర్‌ మాల్‌లో షాపింగ్ కు వెళ్లారు. అయితే అక్కడ వారిపై ఓ మహిళ అకారణంగా దాడికి దిగడమే కాదు, తాను ఎంపి కూతురునని తన గన్ మెన్ లతో కాల్పిచ్చి చంపెస్తానని బెదిరింపులకు దిగింది. 
ఈ దాడిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సిటీసెంటర్‌ మాల్‌లో సీసీ పుటేజీలు పరిశీలించి యువతి కోసం గాలింపు చేపట్టారు. 

నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాఫ్ 

నిలోఫర్ ఆస్పత్రిలో ఓ శిశువు కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆస్పత్రిలోకి ఆయాగా ప్రవేశించిన ఓ మహిళ ఆస్పత్రి సిబ్బంది, తల్లిదండ్రుల కళ్లుగప్పి శిశువు ని ఎత్తుకెళ్లింది. వివరాల్లోకి వెళితే మూడు రోజులు క్రితం పేట్ల బురుజు ఆస్పత్రి లో ఉప్పుగూడకు చెందిన నిర్మల అనే మహిళ ఆడ శిశువు కి జన్మ నిచ్చింది.అయితే శిశువు అనారోగ్యం కారణంగా పెట్ల బురుజు నుంచి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అయితే పాపను సంరక్షణను చూడటానికి హాస్పిటల్లో వున్న నిర్మల తల్లి కల్పన తో తాను ఆయా అంటూ ఓ గుర్తు తెలియని మహిళ పరిచయం చేసుకుంది. దీన్ని నమ్మిన కల్పన టీ తాగి వస్తానని, అప్పటివరకు పాపను చూస్తూ ఉండాలని సదరు మహిళకు చెప్పింది. ఇదే అదునుగా బావించిన ఆ మహిళ పాపను తీసుకుని పరారయ్యింది. 
దీంతో భాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్పిటల్లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పాప ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారు 

సుర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రం లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఓ రిబాండ్ ఖైదీ పరారయ్యాడు. పాత కేసుల నేపధ్యంలో కోర్టులో హాజరుపరిచేందుకు పాల వెంకటేశ్వర రావు అనే ఖైదీని అనంతపురం జైలు నుంచి సూర్యాపేట కు తీసుకువచ్చారు.అయితే రాత్రి సమయంలో జైల్లో సిబ్బంది నిద్రపోయిన పమయంలో ఖైదీ అత్యంత చాకచక్యంగా పారిపోయాడు. అతడు పారిపోవడాన్ని గమనించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

విజయవాడలో తెల్లవారుజామున దొంగల భీభత్సం

విజయవాడ: గుణదలలో లో ఇద్దరు దొంగలు కలకలం సృష్టించారు. పోలీసుల కథనం ప్రకారం ఈ తెల్లవారుజామున ఓ దుండగులు గుణదల లోని ఓ ఇంట్లోకి చొరబడ్డారు.ఇంట్లోకి అపరిచితుడు రావడాన్ని గమనించిన మహిళ భయంతో కేకలు వేయడంతో దుండగుడు పారిపోయాడు.
ఇంటి బయట మరో యువకుడు తెలుపు హోండా యాక్టివా పై కాపుకామడాన్ని ఇంటి సభ్యులు గమనించారు. అయితే వారిని పట్టుకోడానికి వెంబడించగా బైక్ పై పారిపోయారు. ఈ యువకులకు 25-26 సంవత్సరాల వయస్సు ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

చదువుల ఒత్తిడికి మరో విద్యార్థి బలి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఉదయ మెమోరియల్ స్కూల్ విద్యార్థిని సంధ్య ఆత్మహత్య చేసుకుంది. సంద్య ఉదమ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది.అయితే రోజూ స్పెషల్ క్లాస్ లు, ఆదివారం కూడా సెలవివ్వకుండా తరగతులు కొనసాగించడంతో తమ కూతురు తీవ్ర ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆరోపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.