Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

విశేష వార్తలు

  • మహిళా ప్రజాప్రతినిధి పై ఎస్సై లైంగిక దాడి
  • ముస్లింలపై త్రిపుర గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
  • గోదావరి ఖనిలో భారీ అగ్ని ప్రమాదం
  • ఈ నెల 23 న భేటీ కానున్న తెలంగాణ కేబినెట్
  • హైదరాబాద్ లో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన కేటీఆర్
asianet telugu express news  Andhra Pradesh and Telangana

 

మహిళా ప్రజాప్రతినిధి పై ఎస్సై లైంగిక వేధింపులు

asianet telugu express news  Andhra Pradesh and Telangana

నెల్లూరు జిల్లా సైదాపురం లో మహిళా ప్రజాప్రతినిధిపైనే ఓ కీచక ఎస్సై లైంగిక దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే గత నాలుగు నెలలుగా సైదాపురం గ్రామ మహిళా సర్పంచ్ పై స్థానిక ఎస్సై ఏడుకొండలు లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడు. పోన్ లో ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ, తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని సదరు మహిళా ఎస్సై జిల్లా ఎస్పీకి పిర్యాధు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
తనను ప్రేమించమని వేదిస్తూ, ఇంటికి వచ్చి మరీ వేదించడంతో ఇక తట్టుకోలేక ఎస్పీకి పిర్యాధు చేశానని సదరు మహిళ మీడియా ఎదుట వాపోయింది. 
 

''రేవంత్ రాకతో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది''

asianet telugu express news  Andhra Pradesh and Telangana

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి లాంటి బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అన్నారు. రేవంత్ ఒక్కరే కాదు ఇంకా చాలామంది నాయకులు కాంగ్రెస్ లోకి రావడానికి అదిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. రేవంత్ లాంటి బలమైన కేడర్ కల్గిన నేతల వల్ల పార్టీకూడా బలపడుతుందని అన్నారు. రేవంత్ రాకను కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారన్న పుకార్లను కోట్టిపారేసారు. రేవంత్ రాకతో పదవుల గండం ఉంటుందనుకున్నవారు తప్ప మిగతావారంతా దీనికి స్వాగతిస్తున్నారని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. 

బాలికపై సామూహిక అత్యాచారం

asianet telugu express news  Andhra Pradesh and Telangana

కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతంలో దారుణం జరిగింది. బుద్దవరం ప్రాంతంలోని ఓ  స్వచ్చంద సంస్థ లో తలదాచుకుంటున్న చిన్నారి బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక బందువులు పోలీసులకు పిర్యాధు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ  ఘటనపై  పూర్తి వివరాలు అందాల్సిఉంది. 

సదర్ ఉత్సవాల సంధర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

asianet telugu express news  Andhra Pradesh and Telangana

హైదరాబాద్ లో సదర్ ఉత్సవాల సంధర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిపి మహేందర్ రెడ్డి తెలిపారు.  నారాయ ణగూడ, వైఎంసీఏ ప్రాంతాల్లో ఈ నెల 21 వ తేదీన రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. అయితే ఈ రూట్ల లో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లీంచనున్నట్లు ఆయన తెలిపారు.  
 ట్రాఫిక్ మళ్లింపు  కింది విధంగా ఉండనుంది. 

కాచిగూడ ఎక్స్‌రోడ్స్ నుంచి నారాయణగూడ, YMCA వైపు వెళ్లే వాహనాలను, కాచిగూడ టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు.
 విఠల్‌వాడి ఎక్స్ రోడ్స్ నుంచి YMCA చౌరస్తా వైపు వెళ్లే వాహనాలను, రాం కోఠి ఎక్స్ రోడ్స్ నుంచి మళ్లిస్తారు.
 రాజమెహల్లా వైపు నుంచి వచ్చే వాహనాలను రాంకోఠి ఎక్స్‌రోడ్సులోని సాబూ షాప్ పాయింట్ దగ్గర మళ్లిస్తారు.
 రెడ్డికాలేజీ వైపు నుంచి వచ్చే వాహనాలను, బర్కత్‌పురా వైపు మళ్లిస్తారు.

''అజా వల్ల ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది''
 

asianet telugu express news  Andhra Pradesh and Telangana

ముస్లీం లు రోజు నమాజు సమయంలో వినిపించే అజా పై త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ లౌడ్ స్పీకర్ల ద్వారా విసిపించే ఈ అజా వల్ల ధ్వని కాలుష్యం ఏర్పడుతోందని ట్విటర్ లో ట్వీట్ చేశాడు. దీపావళి టపాసులు వల్ల ధ్వని కాలుష్యం ఏర్పడుతోందన్న వారికి ఈ అజా ద్వని కాలుష్యం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మత పరమైన కుట్రలో బాగంగానే బాణసంచా పై డిల్లీలో నిషేదం విధించారని ఆయన విమర్శించారు.
అయితే ఇంతకు ముందు కూడా బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ ఈ అజా గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా త్రిపుర గవర్నర్ కూడా ఆ ఖాతాలో చేరిపోయారు.   

గోదావరిఖనిలో భారీ అగ్నిప్రమాదం

asianet telugu express news  Andhra Pradesh and Telangana

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీ లోని ఓ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాయికృప ఎలక్ట్రానిక్ కు సంభందించిన గోధాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగిసిపడుతున్న మంటలకు గోదాంలోని పర్నీచన్, సామాగ్రి కాలిబూడిదయ్యంది. ఈ గోడౌన్ లో కోటి రూపాయలకు పైగా విలువచేసే ఎలక్ట్రానికి సామాగ్రి ఉన్నట్లు యాజమాన్యం తెలిపింది.
ఈ అగ్నిస్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే వీరు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికి మంటలు అదుపు కావడం లేదు.
 

ఈ నెల 23 న తెలంగాణ కేబినెట్ బేటీ

asianet telugu express news  Andhra Pradesh and Telangana

ఈ నెల 23 న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో సమావేశాలు సజావుగా నడవడానికి అనుసరించాల్సిర వ్యూహాలపై చర్చించనున్నారు.  ఈ విషయంపై ఇటీవలే ప్రగతి భవన్లో కొందరు మంత్రులతో సీఎం సమావేశమైన సంగతి తెలిసిందే. మరోసారి మంత్రులందరితో చర్చించి, అసెంబ్లీ ఎజెండాను ప్రకటించడానికి ఈ కేబినెట్  సమావేశం జరగనుందని సమాచారం. ప్రభుత్వం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.  

చార్మినార్ నుంచి ప్రారంభమైన రాజీవ్ గాంధీ సద్బావన యాత్ర

asianet telugu express news  Andhra Pradesh and Telangana

హైదరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవ యాత్ర చారిత్రక చార్మినార్ ప్రాంతంనుండి ప్రారంభమయ్యంది. ఈ యాత్రను తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జి కుంతియా, మాజీ ఎంపి హజారుద్దిన్, జానా రెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క లతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అధికంగా పాల్గొన్నారు. 

సనత్ నగర్ లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన కేటీఆర్

asianet telugu express news  Andhra Pradesh and Telangana

 

 హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. మొదట అమీర్ పేట లోని సత్యం థియేటర్ వద్ద రూ, 1.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత నిరుపేదలకు వైద్య సదుపాయాన్ని అందించాలనే సదుద్దేశంతో నిర్మించిన 50 పడకల సామర్థ్యం గల ప్రభుత్వ ఆసుపత్రి ని ప్రారంభించారు.  అక్కడినుంచి నేరుగా ఎస్ ఆర్ నగర్ కు చేరుకున్నమంత్రి జీహెచ్ఎంసి నిధులతో  నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. 
మొత్తంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో రూ. 70 కోట్ల విలువైన పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో కేటీఆర్ తో పాటు మంత్రులు పద్మారావు . లక్ష్మా రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు మైనంపాటి హన్మంతరావు,శంబీపూర్ రాజు,జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. 

చదువుల ఒత్తిడికి మరో విద్యార్థిని బలి

asianet telugu express news  Andhra Pradesh and Telangana

చదువులో వెనుకబడుతున్నానని మనస్తాపంతో ఓ బిటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్ బి నగర్ లో చోటుచేసుకుంది. ఎల్ బి నగర్ పోలీసుల కథనం ప్రకారం ఎన్ఆర్ నగర్ సమీపంలో చిత్రా లే అవుట్ లో కుటుంబంతో కలిసి నివాసముంటున్న జూషా అనే యువతి అబిడ్స్ లోని మెథడిస్ట్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. అయితే ఈ యువతి చదువులో వెనుకబడుతున్నాని ఎప్పుడూ డిప్రెషన్ లో ఉండేది.  ఇలా గత కొంత కాలంగా డిప్రెషన్ తో గడుపుతున్న యువతి దాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

అప్పుల బాధతో రియల్టర్ ఆత్మహత్య

asianet telugu express news  Andhra Pradesh and Telangana


 

అప్పుల బాధతో ఓ రియల్టర్ ఉరివేసుకుని  ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హబ్సిగూడలో చోటుచేసుకుంది. కుషాయిగూడ స్ట్రీట్ నంబర్ 8 లోని రవీందర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అయితే వ్యాపార కోసం తీసుకున్న అప్పులు ఎక్కువవడం, అప్పులిచ్చిన వారి నుండి ఒత్తిడి  పెరగడంతో రవీందర్ తట్టుకోలేక పోయాడు. దీంతో ఇంట్లో కుటుంబసభ్యులు ఎవరు లేని సమయంలో సీలింగ్ ప్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు.  
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. 

పదకొండేళ్ల బాలికపై అత్యాచారయత్నం

asianet telugu express news  Andhra Pradesh and Telangana

హైదరాబాద్ లోని కుషాయిగూడలో దారుణం జరిగింది.  అశోక మణిపురి కాలనీకి చెందిన ఓ పదకొండేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. స్థానిక పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్న ఈ బాలికను దుండగుడు మాయమాటలు చెప్పి కాప్రా చెరువు వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా బాలిక అరవడంతో స్థానికులు పోగయ్యారు.దీంతో నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios