విశేష వార్తలు ప్రభుత్వం పై విరుచుకుపడ్డ వీహెచ్ పూర్తి సామర్థ్యానికి చేరుకున్న శ్రీశైలం జలాశయం కాపు రిజర్వేషన్లపై మరోసారి ఉద్యమానికి సిద్దమన్న ముద్రగడ కోదండరాం ను కలిసిన వీహెచ్ తెలంగాణ లో పెట్టుబడులకు ఆస్ట్రేలియా కంపెనీల సుముఖత ఇబ్రహీం పట్నం వద్ద రోడ్డు ప్రమాదం
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు కోర్టు సమన్లు

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 13 న కోర్టుకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2015 లో ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం మంగళగిరి బంద్ ను చేపట్టిన క్రమంలో ఆయనతో పాటు మరో 15 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు విచారణ సంధర్భంగా కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.
గోదావరి నదిలో పడి ఇద్దరు యువకుల గల్లంతు
ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో ప్రమాదవశాత్తు మునిగి ముగ్గురు యువకులు యృత్యవాతపడ్డారు.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతానికి యుగ్గురు యువకులు సరదాగా నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. అయితే నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారు మునిగిపోతుండటంతో అక్కడున్నవారు అనిల్ అనీల్ అనే యువకుడిని కాపాడగలిగారు. మరో ఇద్దరు యువకులు వేణు,మహేష్ లు నీటిలో మునిగిపోయారు. వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలిస్తున్నారు.
పిడుగుపాటుకు ఇద్దరు బలి
కృష్ణా జిల్లా మైలవరం సమీపంలోని వెల్లటూరు గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. గ్రామానికి చెందిన నిమ్మగడ్డ జమలయ్య (50), ఎలికే ఎర్రబ్బాయ్ (45) లు పొలం పనుల్లో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరికి అత్యంత దగ్గరగా పిడుగు పడటంతో ఆ వేడికి వారి శరీరాలు కాలిపోయాయి.దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
హోం మంత్రి నాయిని పై విహెచ్ హాట్ కామెంట్స్

తెలంగాణ హోం మినిస్టర్ ఒక అమాయక, నిస్సహాయ మంత్రి అని, అసలు హోం శాఖ లో ఏం జరుగుతుందో కూడా అతడికి తెలీదంటూ కాంగ్రెస్ నేత వీహెచ్ నాయిని పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయిని లాంటి ఉత్సవ విగ్రహ మంత్రిని నేను ఎక్కడ చూడలేదని, సీఎం ని అడిగి తాను హోమ్ మినిస్టరో, కాదో క్లారిటీకి రావాలని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం కావాలనే కోదండరాం అమరవీరుల స్ఫూర్తి యాత్ర ను పోలీసుల సాయంతో అడ్డుకుంటోందని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ని ఇంత దౌర్జన్యంగా అరెస్టులు చేయడం తగదన్నారు. కోదండరాం దగ్గర దమ్ముంది, అందుకే అతడిని అణిచివేయలని చూస్తున్నారని అన్నారు. టీజేఏసి కి, దాని చైర్మన్ కోదండరాం కి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఆయనపై ఈగ వాలినా ఉరుకొమని ప్రభుత్వానికి హెచ్చరించారు.
కేసీఆర్ చాలా టూ మచ్ చేస్తున్నాడని, పోలీసులతో నియంత రాజ్యం నడిపిస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను తాగుబోతు ల రాష్ట్రంగా మారుస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పదకొండేళ్ల తర్వాత మళ్లీ శ్రీశైలం ప్రాజెక్టు ఇలా

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది కళకళలాడుతోంది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో పదకొండు సంవత్సరాల తర్వాత శ్రీశైలం డ్యాం మొత్తం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు పరుగు తీస్తోంది. గేట్లన్ని ఎత్తడంతో కిందకు జారుతున్న జలాలను చూడటానికి పర్యాటకులు కూడా భారీగా శ్రీశైలానికి చేరుకుంటున్నారు.
రిజర్వేషన్ల పై నిర్ణయానికి డిసెంబర్ ఆరు డెడ్ లైన్

కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం డిసెంబర్ 6 లోపు నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో మరోసారి ఉద్యమం చేపడాతామని కాపు ఉద్యమ నేత ముధ్రగడ పధ్మనాభం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.తామేమి గొంతెమ్మ కోర్కెలె కోరడం లేదని, ఎన్నికల సంధర్భంగా చంద్రబాబు ఇచ్చిన హమీలనే నెరవేర్చబంటున్నామని అన్నారు. తానిచ్చిన హామీలను విస్మరించడం వల్లే కాపులు రోడ్డెక్కారని అన్నారు.
దీనిపై నిర్ణయానికి డిసెంబర్ 6 వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని, ఆ లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.తామేమీ బిసి,ఎస్సీ,ఎస్టీ లో ఉన్న 49% లో రిజర్వేషన్ కావాలని అడగటం లేదని, మిగిలిన 51% లో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ముద్రగడ తెలిపారు.
హైదరాబాద్ లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

ఉన్నతచదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలంగాణ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముద్దసాని రాజవంశీ రెడ్డి 2016 లో అమెరికాకు వెళ్లాడు. పీజి చదువడానికి వెళ్లిన వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన కొడుకు విగత జీవుడుగా తిరిగి వస్తుండటంతో వంశీ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ మృతదేహం భువనగిరికి చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
కొమరవెల్లి మల్లన్న ఆలయ ప్రాంగణంలో నిరాహారదీక్ష (వీడియో)

సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న దేవాలయ ప్రాంగణంలో యాదవ హక్కుల పోరాట సమితి ఆద్వర్యంలో ఆమరణదీక్ష ప్రారంభమయ్యింది. యాదవ కులస్తుల ఆరాద్య దైవమైన కొమరవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్, డైరెక్టర్ పదవులు యాదవులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు. ఈ డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, అందువల్లే నిరాహారదీక్షకు దిగినట్లు పోరాట సమితి సభ్యులు తెలిపారు. యాదవుల్లో ఈ పదవులకు అన్ని అర్హతలు కలిగినవారు చాలా మంది ఉన్నారని, వారికే ఈ పదవులు కేటాయించి ఆలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు.
పంజాబ్ లో తగ్గని కాంగ్రెస్ జోరు

పంజాబ్ లోని గురుదాస్ పూర్ పార్లమెంట్ ఉఫఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. బాలీవుడ్ నటుడు, స్థానిక ఎంపీ వినోద్ ఖన్నా మృతిచెందడంతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ 1.5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఎన్నికల్లో బిజేపి రెండో స్థానంలో ఉండగా, ఆప్ మోడో స్థానానికి పరిమితమైంది.
ఎట్టకేలకు కోదండరాంను కలిసిన వీహెచ్

అధికారం చేజారుతుందేమోనని కేసీఆర్ కు భయం పట్టుకుందని, అందుకోసమే వ్యక్తిగత దూషనలకు దిగడం, అరెస్టులు చేయించడం చేస్తున్నారని కాంగ్రెస్ నేత వి హన్మంతరావు విమర్శించారు. శనివారం పోలీసుల నిర్భందంలో ఉండి విడుదలైన జేఏసి చైర్మన్ కోదండరాం ను ఇవాళ ఆయన పరామర్శించారు. తార్నాకలోని కోదండరాం ఇంటికి చేరుకున్న వీహెచ్ అరెస్ట్ ఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నించేవారి గొంతునొక్కుతూ, ఇలా అరెస్ట్ లు చేయింయడం భాదాకరమన్నారు వీహెచ్.
తెలంగాణ ద్వితీయ శ్రేణి నగరాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులు

తెలంగాణ లోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ, ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియా కంపెనీల ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆస్ట్రేలియా లోని ప్రముఖ సంస్థలను తెరాస ఎన్ఆఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల మరియు తెరాస ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల లు కలవడం జరిగింది. వారు నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని, అందుకోసం లిఖిత పూర్వకంగా లేఖలు కూడా ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. అలాగే నవంబర్ లో హైదరాబాద్ లో జరిగే బిజినెస్ సమ్మిట్ కు వారిని ఆహ్వానించామని, అప్పుడు మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోడానికి వీలుంటుందని మహేష్,నాగెందర్ లు తెలిపారు.
అనంతరం ఆస్ట్రేలియా రెవిన్యూ మినిస్టర్ కెల్లీ ఓడ్విన్ తో సమావేశమైన వారు తెలంగాణ ప్రభుత్వం విదేశీ కంపెనీల స్థాపన కు ఇస్తున్న ప్రోత్సాహాలను వివరించారు.
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఓ వ్యక్తి మృతి(వీడియో)

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళుతున్న లారీ ముందు వెళ్తున్న బైక్ ను డీ కొట్టడంతో కిషోర్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. అతడి భార్య సుజాతకు తీవ్రగాయాలవగా వారి నాలుగు సంవత్సరాల పాప కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చదువుల ఒత్తిడితో ఇంట్లోంచి వెళ్లిపోయిన యువతి

నారాయణ కాలేజీల్లో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆ కాలేజీలను మూసి వేయించాలని కోరుతూ అదే కాలేజీకి చెందిన ఓ విద్యార్థిని లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే మేడిపల్లి పరిధిలో ఇంటర్ చదువుతున్న సాయి ప్రజ్వల అనే విద్యార్థిని ఇంట్లోంచి వెళ్లిపోయింది. చదువుల ఒత్తిడి తట్టుకోలేకే ఇంట్లోంచి వెళ్లిపోతున్నాని ఓ లెటర్ రాసిపెట్టింది. ఆ లెటర్ లో ఇంకా అనేక విషయాలు పేర్కొంది. నారాయణ కాలేజీ లో విద్యార్థులను చదువు గురించి తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని,ఆత్మహత్య లకు కారణం అవుతున్నారని, వాటినుంచి విద్యార్థులను కాపాడాలని పేర్కొంది.
