54 మంది ఐఏఎస్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.  అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్ల పై సచివాలయంలో విగ్రహ కమిటీ సమావేశం గువాహటి రైల్వే స్టేషన్‌లో భారీ మందు పాతరను గుర్తించిన  రైల్వే సిబ్బంది  సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, పోచారంలు  

స్టూడెంట్ ను బలవంతంగా ఎత్తుకెళ్ళిన ట్యూషన్ మాస్టర్ 

ఎస్సార్ నగర్ లోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్ బాలికను, కళాశాల వద్ద నుంచి బలవంతంగా ఎత్తుకెళ్ళి, వివాహం చేసుకొని అత్యాచారం చేసిన ట్యూషన్ మాస్టర్ భవానీ శంకర్. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి. ట్యూషన్ మాస్టర్ పై పోక్సో చట్టం తో పాటు రేప్ కేసు నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు.

ఎస్పీ ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని మల్కన్ గిరి జిల్లా ఎస్పీ ఎదుడ ఓ మహిళా మావొయిస్టు లొంగిపోయింది. బొయ్ పరిగూడ డివిజన్ ఏరియా కమిటీ మహిళా మావొయిస్టు సోమె సొది అలియాస్ నంది 2009 నుంచీ మావొయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొందని ఎస్పీ తెలిపారు. శుక్రవారం మీడియా ఎదుట సోదిని హాజరుపరిచారు. ఆమె విప్లవం పట్ల ఆకర్షితురాలై డివిజన్ లో చేరిందని.. ఏడేళ్ల తర్వాత.. ఆరోగ్యం బాగోకపోవడం.. దళం పై విరక్తి కలగడంతో జనజీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చిందని ఆయన వివరించారు. ఈమెపై పదమూడు కేసులు, రివార్డు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు.

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సమావేశం

హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం హామీ మేరకు నెలకొల్పనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్ల పై సచివాలయంలో విగ్రహ కమిటీ సమావేశమైంది. మంత్రి జగదీష్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. విగ్రహ ఏర్పాటుకు గల అడ్డంకులు, దీనికయ్యే ఖర్చు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది.ఈ సమావేశానికి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ,వేముల వీరేశం లతో పాటు అధికారులు యస్.సి అభివృద్ధి శాఖ ప్రధానకార్యదర్శి అజయ్ మిశ్రా,రోడ్లు భవనాల అధికారి గణపతి రెడ్డి, డైరక్టర్ కరుణాకర్, ఆర్కిటెక్ట్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ కామాంధుడి అరెస్టు 

కామంతో కల్లు మూసుకుపోయి సహోద్యోగినిపై వికృత చేష్టలకు దిగిన డిల్లీ సెక్యూరిటీ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్‌లో సెక్యూరిటీ మేనేజర్‌గా పనిచేస్తన్న నిందితుడు తన కింది స్థాయి ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించడం సీసీ టీవీలో రికార్డు కావడం పోలీసుల దృష్టికి వెళ్లింది. మహిళ చీర లాగేందుకు ప్రయత్నించినట్లు అతనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే హోటల్ యాజమాన్యం కూడా ఆ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించింది.

ఐఏఎస్ లకు షోకాజ్ నోటీసులు

ఉత్తరాఖండ్ ప్రభుత్వం 54 మంది ఐఏఎస్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరులకాని అధికారులపై సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సీరియస్ గా ఉన్నారు. మొత్తం 87 మంది ఐఏఎస్ లకు గాను 54 మంది గైర్హాజరయ్యారు. షోకాజ్ నోటీసులు అందుకున్న అధికారులు వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అలాగే జిల్లా స్థాయిలో అధికారులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లాల్లో పంద్రాగస్టు వేడుకలకు హాజరు కాని అధికారుల వివరాలు తెలియజేయాలని జిల్లాల కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ ఎస్ రామస్వామి నోటీసులు జారీ చేశారు. 

పాతబస్తీ బాలికను కాపాడతాం

ఒమన్ షేక్ చేతిలో మోసపోయిన 16 ఏళ్ల బాలికను 4 రోజుల్లో ఇండియాకు తీసుకువస్తామని డీసిపి సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో ఇద్దరు బ్రోకర్లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.బాలిక తండ్రిని కూడా అరెస్టు చేయనున్నామని ఆయన అన్నారు. భాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒమన్ షేక్ గా చెప్పుకుంటున్న వ్యక్తి అక్కడ బిచ్చగాడని, బాలికను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని తమ దృష్టికి వచ్చినట్లు డిసిపి స్పష్టం చేశారు.

వైసీపిది అరాచక ప్రచారం

నంద్యాలలో వైసీపి అరాచకాలకు పాల్పడుతోందని టీడిపి ఎంపి లు కేశినేని నాని, కొన కళ్ళ నారాయణ ఈసీ కి పిర్యాదు చేశారు. వైసీపి అభ్యర్ధికి మద్దతుగా వస్తున్న వార్తలను పెయిడ్ న్యూస్ గా పరిగణించాలని వారు ఉప ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ఢిల్లీ పర్యటన లో వుండటంతో వారు ఉప ఎన్నికల అధికారి అనూప్ సింగ్ ను కలిసారు. జగన్ ప్రసంగాలపై పిర్యాధు చేసిన వారు, ప్రసంగ ప్రతులను ఈసీ అందజేశారు.

రైల్వేస్టేషన్లో మందుపాతర

అసోం రాజధాని గువాహటి రైల్వే స్టేషన్‌లో భారీ మందు పాతరను గుర్తించారు రైల్వే సిబ్బంది . రైల్వే పార్శిళ్లను గమనిస్తుండగా గోనె సంచిలో టైమర్ ను అమర్చిన 10 కేజీల మందుపాతర బయటపడింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబ్ స్వాడ్ బాంబును నిర్వీర్యం చేయడంతో ఫెను ప్రమాదం తప్పింది.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఉత్త‌రాఖండ్‌లో ప్రమాదం

ఉత్త‌రాఖండ్‌లో క్లోరిన్ వాయువు లీకైన ఘ‌ట‌న‌లో 20 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఉత్త‌రాఖండ్ జ‌ల సంస్థాన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గ్యాస్ లీక్ కావ‌డం వ‌ల్ల బాధితులు స్వేచ్ఛ‌గా గాలి పీల్చుకోలేపోయారు. వాయువు లీకైన ప్రాంతం నుంచి మొత్తం స్టాఫ్‌ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ తెలిపారు. తానే స్వ‌యంగా ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్న‌ట్లు చెప్పారు

విజయవాడ వ్యాపారికి కుచ్చుటోపి

విజయవాడలో మద్యం తయారీ సంస్థ అమ్మకం పేరిట ఓ వ్యాపారికి కొందరు వ్యక్తులు కుచ్చుటోపి పెట్టారు. విజయవాడ కు చెందిన ఇంటూరి సాంబయ్య అనే వ్యాపారికి ఒరిస్సాలో గల శ్రీ శక్తి డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను అమ్ముతామంటూ నమ్మబలికారు నిందితులు. సంస్థ డైరెక్టర్ లుగా చెప్పుకున్న ఉమా మహేశ్వరరావు, అచ్యుతరామయ్య ఆయన నుంచి రూ. 5.25 కోట్లు వసూలు చేసారు.తర్వాత ఎంతకీ వారి నుంచి స్పందన రాకపోవడంతో మోసపోయినని తెలుసుకున్న ఆ వ్యాపారి డీజీపీని పిర్యాదుచేశారు. ఈ భారీ మోసంపై సీఐడీ విచారణకు ఆదేశించిన డీజీపీ సాంబశివరావు తెలిపారు.

డిల్లీ విమానాశ్రయంలో భారీ డ్రగ్స్

డిల్లీ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. విదేశాలనుంచి తరలిస్తున్న రూ 40 కోట్ల విలువ చేసే కొకైన్ ను పోలీసులు పట్టుకున్నారు. వీటిని తీసుకువచ్చిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం తదుపరి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

వరదలతో జలమయమైన కజిరంగ పార్కు 

అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి వరదలు సంభవించడంతో మనుషులే కాదు, జంతువులు ప్రాణాలు వదులుతున్నాయి. కజిరంగ జాతీయ పార్కులో వరద నీరు చేరి సుమారు 140 జంతువులు చనిపోయినట్లు ఫారెస్ట్ ఆఫీస‌ర్ రోహిణి భ‌ల్ల‌వ్ తెలిపారు. బ్రహ్మపుత్ర నది ఉప్పొంగడంతో దాదాపు 80 శాతం పార్కు నీట మునిగినట్లు ఆయన తెలిపారు. దేశంలో అరుదుగా వున్నఅరు రైనోలతో పాటు. జింకలు, ఏనుగులు లు రకరకాల జంతువులు మరణిస్తున్నట్లు ఫారెస్ట్ ఆపీసర్ తెలిపారు.

పాలమూరుకు మొదటి శత్రువు జూపల్లే

పాలమూరు జిల్లా అభివృద్ది కుంటుపడడానికి స్థానిక మంత్రి జూపల్లి కృష్ణరావే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ద్వజమెత్తారు. ప్రభుత్వంలో మంత్రిగా వుండి కూడా పాలమూరుకు ఒక్క పైసా కూడా జూపల్లి అధనంగా తెచ్చింది లేదని విమర్శించారు. జిల్లాకు మొదటి శత్రువు జూపల్లేనని వంశీ విమర్శించారు.
అలాగే డిండి నుంచి నీటిని తీసుకపోవడానికి మేము వ్యతిరేకం కాదని, ఎలా తీసుకెలతారో క్లారిటీ ఇవ్వాలని తాము కోరుతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చెప్పినట్లే డిండి కి నీళ్ళు తీసుకపోవాలని ఆయన డిమాండ్ చేశారు.అలా కాకుండ జీఓ ను మార్చి పాలమూరు ప్రజలకు అన్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ నెల 21 తేది వరకు హైదరాబాద్ లోనే ఉంటానని, దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని జూపల్లికి సవాల్ విసిరారు.

తమిళనాడు తాజా రాజకీయాలపై భేటి

బెంగళూరు జైల్లో వున్న శశికళతో ఆమె మేనల్లుడు దినకరన్ భేటీ అయ్యాడు. తమిళనాడు లో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయాలపై వారు చర్చించినట్లు సమాచారం. అలాగే పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను దినకరణ్ శశికళకు వివరించాడు. తాజాగా పళని, పన్నీరు వర్గాల మద్య జరిగిన ఒప్పందంపై చర్చించినట్లు సమాచారం. 

జైల్లో విక్రమ్ గౌడ్ కి అస్వస్థత

కాల్పుల ఘటనలో చంచల్ గూడ జైల్లో శిక్షను అనుభవిస్తున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను జైల్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి విక్రమ్ ఆరోగ్యం బాగానే వుందని, ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని జైలు సిబ్బంది తెలిపారు.

అభివృద్ది వైపు పయనిస్తున్న సిరిసిల్ల జిల్లా 

రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగలపల్లి మండలం లో పలు అభివృద్ది పనులను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావులు ప్రారంభించారు. మండలంలోని సర్ధాపూర్ గ్రామంలో 5000టన్నుల సామర్థ్యంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ గోదాంను, రూ. 9.6 కోట్ల నిధులతో నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాలను వారు ప్రారంభించారు. మంత్రులతో పాటు స్థానిక ఎంపీ వినోద్ కుమార్, టీఎస్ సీవోబి చైర్మన్ రవీందర్ రావు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, టీఆరెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 

భారీగా నష్టపోయిన ఇన్ఫోసిస్ షేర్లు

ఐటీ దిగ్గజంఇన్ఫోసిస్‌లో తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆ సంస్థ షేర్లు బారీగా నష్టపోయాయి. ఈ ఐటీ కంపెనీ స్టాక్ మార్కెట్ ప్రారంభమైన గంట సేపట్లోనే రూ.16 వేల కోట్లు నష్టపోయింది. సీఈవో గా విశాల్ సిక్కా రాజీనామా విషయం తెలియగానే ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లో ఇన్పీ షేర్లు పతనమయ్యాయి. షేర్ వాల్యూ రూ. 977 నుంచి రూ. 944 కు పడిపోయింది.

నంద్యాలలో ధన ప్రవాహం

నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచుతున్న 23 మంది వైసీపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టైన వారంతా కడప, పులివెందుల, నెల్లూరు వాసులుగా పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ 4.25 లక్షలను స్వాదీనం చేసుకున్నపోలీసులు, వారిని నంద్యాల వన్ టౌన్ పోలిస్టేషన్ కు తరలించారు.

గోరఖ్ పూర్ చిన్నారులను చంపింది ప్రభుత్వమే

ఉత్తరప్రదేశ్ : గోరఖ్ పూర్ లో ఇటీవల ఆక్సిజన్ అందక చనిపోయిన చిన్నారుల కుటుంబాలను ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధి పరామర్శించారు. ఘటన జరిగిన బాబా రాఘవ్ దాస్ హాస్పిటల్ ను సందర్శించారు రాహుల్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వ వైపల్యం వల్లే చిన్నారులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేసారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలమడుతుందని ఆయన తెలిపారు.

వ్యభిచారం గృహంపై దాడులు

విజయవాడ ముత్యాలపాడులో వ్యభిచారానికి పాల్పడుతున్న ఓ కార్పోరేటర్ ఇంటిపై టాస్క్ పోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారానికి పాల్పడుతున్న పలువురు విటులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ సమాచారం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు.

కిర్లంపూడిలో మళ్లీ ఉద్రిక్తత

తూర్పుగోదావరి : ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాదయాత్ర కు సిద్దమైన ముద్రగడ పద్మనాభాన్ని అడ్డుకున్నారు పోలీసులు. అనుమతి లేకుండా పాదయాత్ర చేపట్టడానికి ప్రయత్నించడంతో ఆయనను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో మళ్లీ భారీగా పోలీసు బలగాలను కిర్లంపూడిలో మొహరిస్తున్నారు .

ఇన్సోసిస్ కు విశాల్ సిక్కా గుడ్ బై

ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సీఈవో పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల సీఈవో మరియు ఎండీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిక్కా రాజీనామాను అంగీకరించిన సంస్థ తాత్కాలిక సీఈవోగా యూబీ ప్రవీణ్ రావును నియమించింది. బోర్డు సమావేశంలో శాశ్వత ఎండీ మరియు సీఈవో ను నియమించనున్నట్లు కంపెసీ ప్రకటించింది.

టీడిఆర్ పాలిటెక్నిక్ కాలేజిలో పడగవిప్పిన ర్యాగింగ్ భూతం 

బీబీనగర్ లోని టీడిఆర్ పాలిటెక్నిక్ కాలేజీ లో ర్యాగింగ్ భూతం మళ్లీ పడగవిప్పింది. కాలేజీ బస్సు లో డిప్లొమా చదువుతున్న గిరిదర్ అనే జూనియర్ విద్యార్థినిసపమీర్. నర్సింహ, నర్సింహ గౌడ్ అనే ముగ్గురు సీనియర్లు చితకబాదారు. బస్ లో కాలేజి సిబ్బంది వున్నా ర్యాగింగ్ ను అడ్డుకోలేకపోమారు. తీవ్రంగా గాయపడ్డ గిరిధర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు చేసాడు. పోలీసులు గాయాలపాలైన విద్యార్థిని హాస్పిటల్ కి తరలించారు.

ఢిల్లీ యువతిపై అత్యాచారం

హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఓ టూరిస్ట్ అమ్మాయిపై అత్యాచారం జరిగింది.డిల్లీకి చెందిన 18 ఏళ్ల యువతి 5 రోజుల క్రితం నగరానికి వచ్చి బంజారాహిల్స్ లో ఓ ప్రైవేటు అతిథిగృహంలోని లో అద్దెకు దిగింది. ఒంటరిగా రూం లో ఉంటున్న అమ్మాయిని గమనించిన నలుగురు యువకులు ఆమె గదిలోకి వెళ్లి బెదిరించి రేప్ చేశారు. యువతిని తీవ్రంగా కొట్టారు. ఈ షాక్ నుంచి తేరుకున్న యువతి వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నారు.

మూడవ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం 

వనపర్తి జిల్లా : శ్రీ రంగాపూర్ మండలం శేరుపల్లి గ్రామం లో 3 వ తరగతి చదువుతున్న ఆనంద్ అనే బాలుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.స్కూల్లో టీచర్ మందలించడంతో మనస్థాపానికి గురైన బాలుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాలున్నిమహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ లు చెబుతున్నారు.