విశేష వార్తలు కంచ ఐలయ్యకు మద్దతుగా కుప్పంలో ర్యాలీ తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతీయ విద్యా శిక్షణ కాలేజి మంజూరు పయ్యావుల కేశవపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి నవరాత్రి ఉత్సవాల్లో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న 15,25,000 భక్తులు కేరళలో జన సంరక్షణ యాత్ర, పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఎపి సమాచార కమీషనర్ నియామకానికి నోటిపికేషన్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రధాన సమాచార కమిషనర్, ముగ్గురు రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పదవులు పొందాలనుకునే వారు తగిన దృవపత్రాలను సమర్పించవచ్చని, వాటిని పరిశీలించి కమిషనర్లు ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. 

వాల్మీకి జయంతి వేడుకలకు కడియం శ్రీహరికి ఆహ్వానం

హైదరాబాద్ : ఈ నెల 5వ తేదీన బషీర్ బాగ్ భారతీయ విద్యాభవన్ లో జరపనున్నవాల్మికి జయంతి ఉత్సవానికి హాజరుకావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మంత్రి కడియం శ్రీహరిని ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రిక అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం, ఉత్సవాల కోసం ఈ ఏడాది 16 లక్షల రూపాయలను విడుదల చేయడంపై వారు మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
అలాగే బోయలను ఎస్టీలలో చేర్పించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిగారు చొరవ తీసుకోవాలని కోరారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, వాల్మీకి జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ లు మినగ గోపి బోయ, మండ్ల వేణుగోపాల్ నాయుడు, గొంది వెంకటరమణ తదితరులున్నారు.

సినీ నటి సంజన హాట్ డ్యాన్స్ (వైరల్ వీడియో)

కంచ ఐలయ్య కు మద్దతుగా కుప్పంలో ర్యాలీ 

ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు మద్దతుగా ఏపి ముఖ్యమంత్రి ప్రాతినిధ్య నియోజకవర్గం కుప్పo లో భారతీయ అoబేద్కర్ సేన ర్యాలి నిర్వహించింది. అయితే ఈ ర్యాలీని అడ్డుకోడానికి పోలీసుల ప్రయత్నించడంతో పోలీసులకు,అంబెద్కర్ సేన నేతలకు మద్య వాగ్వివాదo జరిగింది. ఈ ఉద్రిక్తతల మద్యే ర్యాలీని కొనసాగించిన వారు తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని వినతి పత్రo సమర్పిoచారు.

గుడ్ న్యూస్ టు తెలంగాణ

హైదరాబాద్: రాష్ట్రానికి ప్రాంతీయ విద్యా శిక్షణ (రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్) కాలేజీ రాబోతున్నది. దీనికి కనీసం 50 ఎకరాల స్థలం అవసరమంటూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి లేఖ రాసింది. అనువైన స్థలం కోసం రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. వరంగల్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు స్థలాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ తెలిపారు.

పయ్యావుల కేశవ్ ను ఉతికారేసిన రేవంత్ రెడ్డి (వీడియో)

సొంత పార్టీకి చెందిన నేతలపై టీడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసిఆర్, ఎపి తెలుగుదేశం నేత పయ్యావుల కేశవలు సమావేశమవడాన్ని తప్పుపట్టారు. తెలంగాణ ద్రోహి అయిన పయ్యావులకు అపాయింట్మెంట్ ఇచ్చిన సీఎం, తెలంగాణ ఉద్యమనేత కోదండరాంకు గత 40 నెలలుగా ఒక్కసారైనా ఇచ్చిండా అని ప్రశ్నించాడు రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్న సీఎంను ఎలా గెలిపిస్తారో మీరే ఆలోచించాలంటూ సింగరేణి ఎన్నికల ప్రచార సభలో కార్మికులనుద్దేశించి ప్రసంగించారు.

నవరాత్రి ఉత్సవాల్లో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న 15,25,000 భక్తులు

 విజమవాడ కనకదుర్గ ఆలయ ఈవో సూర్యకుమారి ఇచ్చిన సమాచారం ప్రకారం... 

దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారిని 15,25,000 భక్తులు దర్శించుకున్నట్లు ఆమె తెలిపారు.

గతేడాది కంటే ఈ సంవత్సరం 2లక్షల 25వేల మంది భక్తులు పెరిగారు

దసరా ముగిసిన తర్వాత రెండు రోజులు కూడా రద్దీ కొనసాగింది

లక్షా 95వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు.

ఢిల్లీ ఏపీ భవన్లోనూ దుర్గగుడి తరుపున దసరా ఉత్సవాలు నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. 

పోలీసులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతోనే ఉత్సవాలు నిర్వహించగలిగినట్లు, ఈ ఉత్సవాల తర్వాత దుర్గగుడి ప్రతిష్ట మరింతగా పెరిగిందన్నారు.

కేరళలో జన సంరక్షణ యాత్ర, పాల్గొన్న యూపీ సీఎం

కేరళ లో జరుగుతున్న బీజేపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలకు నిరసనగా చేపట్టిన జన రక్షణ యాత్ర ఉద్రిక్తంగా మారింది. ఈ యాత్రను నిన్న అమిత్ షా ప్రారంభించగా, నేడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఆయితే కన్నూరు వద్ద యోగి యాత్రను అడ్డుకోడానికి కేరళ పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.