విశేష వార్తలు నాలుగో వన్డేలో టీం ఇండియా పరాజయం బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ మిస్ అధిష్టానం ఆదేశిస్తే ఉపఎన్నికలో పోటీకి రెడీ అంటున్న కొమటిరెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాసిన సీఎం చంద్రబాబు టాస్ గులిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ జట్టు నేడు బెజవాడ కనకదుర్గమ్మ నిజరూప దర్శనం
నాలుగో వన్డేలో టీం ఇండియా పరాజయం

ఎట్టకేలకు బెంగళూరు వన్డే లో ఆస్ట్రేలియా భోణి కొట్టింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాల్గో వన్డేలో టీం ఇండియాపై మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. టీం ఇండియా యివరి వరకు పోరాడి కేవలం 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బారత జట్టుకు చివరి వరకు పోరాడి 313 పరుగులు చేయగల్గింది.
టీమిండియా బ్యాటింగ్ లో రహానె (53), రోహిత్ శర్మ (65), విరాట్ కోహ్లీ (21), పాండ్యా (41), జాదవ్ (67), ఎంకే పాండే (33), ధోనీ (13), పటేల్ (5), మహ్మద్ షమీ 6 పరుగులతో, ఉమేష్ యాదవ్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న 7 లక్షల మంది భక్తులు

దసరా ఉత్సవాల్లో బాగంగా ఈ ఎనిమిదవ రోజుల్లో 7లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
మూలా నక్షత్రం రోజైన నిన్న రాత్రి 12.10వరకు దర్శనానికి భక్తులకు అనుమతించారు.
ఈ రోజు 2లక్షల 42 వేలమంది భక్తులు అమ్మ దర్శనం చేసుకున్నారు.
లడ్డుల అమ్మకం వల్ల 1 లక్ష 80 వేలు పులిహోర ప్యాకెట్ ల వల్ల రు. 80 వేలు లభించాయి.
25వేల మందికి ఉచిత అన్నదానం జరిగింది.
పదకొండు వేల మంది పైగా వృద్దులు వికలాంగులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
ఉత్సవాల సందర్భంగా సుమారు ఎనిమిదివేల మంది వైద్య సహాయం పోందారు
మూలా నక్షత్రం సందర్భంగా అన్ని క్యూలైన్ లు ఉచితంగానే అనుమతించటం జరిగింది
రాత్రి సమయంలో భక్తులు రావటంతో 100రూ క్యూలైన్ కూడా ఫ్రీగా పంపటం జరిగింది
మొత్తంగా లడ్డు ప్రసాదాలు సుమారు 7లక్షలు అమ్ముడుపోయాయి.
పాపం బతుకమ్మ గిన్నిస్ రికార్డ్

తెలంగాణ టూరిజం శాఖ బతుకమ్మ ఉత్సవాల ద్వారా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పాలని ఈ ఏడాది విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ వర్షం తెలంగాణ టూరిజం శాఖ వారి ఆశల మీద నీళ్లు చల్లింది. వర్షం పడడం వలనే గిన్నిస్ రికార్డ్ నెలకొల్పలేక పోయామన్నారు టూరిజం శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం. అట్టెంప్ట్ మాత్రమే ఫెయిల్ అయ్యిందని, రానున్న రోజుల్లో కచ్చితంగా రికార్డ్ నెలకొల్పి తీరుతామని ఆయన శపథం చేశారు. వీలయితే నవంబర్ లో మరో సారి బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ నెలకొల్పుతామని ప్రకటించారు.
అమరవీరుల సంస్మరణ ప్రచార రథాన్ని ప్రారంభించిన డిజిపి

అక్టోబర్ 15 న పోలీస్ అమరవీరుల గౌరవార్థం అఖిల భారత ఇండియన్ పోలీసు అమరవీరుల సంస్మరణ పరుగును నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. అందుకోసం ప్రచారం కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రచార రథాన్న ఇండియన్ మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలిరాజ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే ఈ అమరవీరుల సంస్మరణ పరుగుకు సంభందించిన వెబ్ సైట్, ట్విట్టర్, పేస్ బుక్ అకౌంట్ లను కూడా వారు ప్రారంభించారు. ఈ సంధర్భంగా డిజిపి మాట్లాడుతూ... పోలీసుల అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకొని, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. శాంతిభద్రతలను కాపాడటానికి దేశవ్యాప్తంగా సుమారు 500 వరకు పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది చాలా బాధాకరమని డిజిపి ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపఎన్నికలో పోటీకి సై అంటున్న కొమటిరెడ్డి

నల్గొండ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ తరపున పోటీకి తాను సిధ్దంగా ఉన్నట్లు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఉప ఎన్నికను జరగాలనే తాను కోరుకుంటున్నట్లు, ఇదే జరిగితే నల్లగొండకు అభివృద్ది నిధులు వద్దన్నా వస్తాయని అన్నారు. కాంగ్రెస్ తరపున నేనే కాదు ఎవరు పోటీ చేసినా విజయం తద్యమని, ప్రజలు అంతలా ఈ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని కొమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
అలాగే ఆయన తలపెట్టిన నల్గొండ జిల్లాకు మెడికల్ కాలేజ్ సాధించడానికి చేపట్టాల్సిన దీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

ఈ ఏడాది విద్యుత్ చార్జీలు పెంచబోమని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఇవాళ ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. అయితే ఈ లేఖలో ఎక్కడ రాజధాని అమరావతి గురించిన ప్రస్తావనే తీసుకురాలేదు.
అయితే పోలవరం గురించి ప్రస్తావించి సీఎం...2019 నాటికి పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
100వ వన్డేలో 100 కొట్టిన వార్నర్

వందవ వన్డే ఆడుతున్న ఆసిస్ ఆటగాడు వార్నర్ శతకం భాదాడు. భారత్ పై సాధించిన ఆ సెంచరీ అతడి కెరిర్ లో పద్నాలుగవది. మొదటినుంచి ఆచి తూచి ఆడుతున్న వార్నర్ 103 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. మొత్తంగా ఆస్ట్రేలియా జట్టు వికెట్లేమి నష్టపోకుండా 197 పరుగులతో ఆడుతుంది.
క్రీజులో ఓపెనర్లు ఫించ్, వార్నర్ లు సంయమనంతో ఆడుతూ పరుగులు రాబడుతున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సీరిస్ కైవసం చేసుకున్న టీం ఇండియా ఈ మ్యాచ్ లో ప్రయోగాలు మొదలుపెట్టింది. బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా, కుల్‌దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో షమీ, ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ లకు చోటిచ్చారు. మొత్తంగా టీం ఇండియా సీరిస్ గెలిచిన ఊపులో ఉండగా, వరుస పరాబవాలతో ఆసీస్ జట్టు గెలుపుకోసం ఎదురుచూస్తోంది. బ్యాటింగ్ స్వర్గధామం లాంటి చిన్నస్వామి స్టేడియం లో పరుగుల వరద ఖాయం గా కనిపిస్తోంది.
సద్దుల బతుకమ్మకు సాగర్ ముస్తాబు (వీడియో)
నేడు సద్దుల బతుకమ్మకు భాగ్యనగరం అందాలు అద్దుకుంటోంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రంగురంగుల పూలతో బతుకమ్మ ఘాట్ తో పాటు ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు.

నేడు బెజవాడ దుర్గమ్మ నిజరూప దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు అమ్మవారు తన నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అంటే దుర్గా దేవి అలంకరణలోని అమ్మవారిని దర్శించుకోడానికి ఉదయం నుండే భక్తులు క్యులైన్ల లో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అమ్మవారి అసలు రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారని భావిస్తున్న ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.ఇంద్ర కీలాద్రి మొత్తం అమ్మ నామ స్మరణ తో మారు మోగుతోంది.దుర్గాదేవికి భక్తులు ప్రత్యేక పూజలు ఆచరించి మోక్కులు చెల్లించుకుంటారు.
