మహా బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కవిత (వీడియో)

 

రెండు వేల నోటును రద్దు చేయాలి

 

నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన 2వేల కరెన్సీ నోటు వల్ల అవినీతి మరింత ఎక్కవయ్యే అవకాశం వుందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం రెండువేల నోటును రద్దు చేయాలని అభిప్రాయపడ్డాడు.ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఈ నోట్ల రద్దుపై కూడా స్పందించారు. ఆయితే నోట్ల రద్దు మంచి సంస్కరణగా పేర్కొన్న ఆయన రెండు వేల నోటును తీసుకురావడం అంత మంచి ఆలోచన కాదని అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్రం పునరాలోచించి రద్దు చేస్తే మంచిదని పేర్కొన్నారు.  

మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ కు సిబిఐ సమన్లు

బీహార్:  రైల్వే హోటల్ టెండర్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్‌యాదవ్‌తో పాటు అతడి తనయుడు తేజస్వి యాదవ్ లకు సిబిఐ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 3 న లాలూ ప్రసాద్ యాదవ్, అక్టోబర్ 4 న తేజస్వి యాదవ్ తమ ఎదుట హాజరు కావాలంటూ సిబిఐ సమన్లలో పేర్కొంది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నపుడు ఓ హోటల్ టెండర్ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు లాలూ పై అతడి తనయుడిపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. 
 

ఎల్ బి స్టేడియంలో ప్రారంభమైన మహా బతుకమ్మ

ఎల్ బి స్టేడియం లో మహా బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. స్టేడియానికి భారీగా చేరుకున్న మహిళలు బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. నగరంలోని మహిళలే కాకుండా వివిధ జిల్లాల నుంచి భారీగా మహిళలు ఈ కార్యక్రమానికి చేరుకున్నారు. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  

చింతూరు విద్యార్థులను పరామర్శించిన మంత్రి కామినేని శ్రీనివాస్ (వీడియో)

తూర్పు గోదావరి జిల్లా : కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో కాళ్లవాపు వ్యాధితో చికిత్స పొందుతున్న చింతూరు ఆదిమ గురుకుల కళాశాల విద్యార్ధులను వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. విద్యార్ధులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్న ఆయన, ఈ వ్యాధి సోకడానికి కారణాలను గుర్తించేందుకు ఒక కమిటీని నియమించాలని కలెక్టర్ కు సూచించారు. కాళ్లవాపు వ్యాధి రావడానికి పౌష్టికాహార లోపం కూడా ఒక కారణం కావచ్చని మంత్రి తెలిపారు.
 అనంతరం ఆయన కలెక్టర్ కార్యాలయంలో  జిల్లాలో నమోదవుతున్న జ్వరాలు, కాళ్లవాపులు వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 
 

బాపూజీ జయంతి వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి జోగు రామన్న

 

సెక్రటేరియట్ లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పోస్టర్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆద్వర్యంలో  బాపూజీ జయంతి ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో భాపూజి పాత్ర మరువలేనిదని, ఆయన ఆశయాలు,ఆకాంక్షలకు తగ్గట్లు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని తెలిపారు.  అందులోభాగంగా బీసీల కోసం ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నామని,రానున్న రోజుల్లో మరిన్ని పథకాలతో బిసిల అభ్యున్నతికి పాటుపడతామని మంత్రి హామీ ఇచ్చారు.
 
 

మహాలక్ష్మి అవతారంలో విజయవాడ కనకదుర్గమ్మ

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలిసిన అమ్మవారు భక్తులకు మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇస్తున్నారు.  ఈ అవతారంలో అమ్మవారు విశేష పూజలను అందుకుంటున్నారు. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఇంద్రకీలాద్రి జన పంద్రంగా మారింది.
 

నేడు ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఎల్బీ స్టేడియంలో ఇవాళ జరగనున్న మహా బతుకమ్మ సంబరాల నేపధ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.  బతుకమ్మ వేడుకల కోసం వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటుచేశారు. భారీ ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నందున బందోభస్తును కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

కంచ ఐలయ్యపై దాడిని ఖండిస్తున్నాం

దళిత, బడుగు బలహీన వర్గాల  హక్కులకోసం పోరాడుతున్న ప్రొఫెసర్ కంచ ఐలయ్య పై దాడి జరగడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీఫ్ సింగ్ సుర్జేవాలా అన్నారు. పరకాలలో ఆయన వాహనం పై రాళ్లు, చెప్పులతో దాడి చేసి అవమాన పర్చడం సిగ్గుచేటని, సామాజిక అసమానతలు తొలగించడానికి పాటుపడుతున్న వ్యక్తిపై ఈ విధంగా దాడి చేయడాన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆయన్ని బహిరంగంగా ఉరి తీయాలని రెచ్చగొట్టిన టిడిపి ఎంపి  టీజి వెంకటేశ్  ప్రవర్తన పై ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎందుకు స్పందించడంలేదని, వారు అగ్రకులాలకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్చను హరించివేస్తున్న శక్తులను అడ్డుకొని, మేధావులకు అండగా నిలబడతామని సుర్జేవాలా  స్పష్టం చేశారు.
 

రాష్ట్ర ఉత్సవంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి 

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 27 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారికంగా జయంతి వేడుకలు జరపనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జయంతి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మంత్రి జోగు రామన్న ఆద్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్ లో జరిగే  భాపూజి జయంతి ఉత్సవాలకు 8 లక్షలు..  తెలంగాణలోని ఒక్కో జిల్లాకు 20 వేల చొప్పున తెలంగాణ సర్కారు నిధులు మంజూరు చేసింది.
 

అనకాపల్లిలో ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన మంత్రి కామినేని శ్రీనివాస్

విశాఖపట్నం : అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల విశ్రాంతి భవనం నిర్మాణానికి వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ శంకుస్ధాపన చేసారు. దీంతో పాటు అంటు వ్యాధులతో చికిత్స కోసం వచ్చే వారికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని కూడా ఆయన ప్రారంభించారు.
అనంతరం మంత్రి ఆసుపత్రిలో వార్డులను పరిశీలించిన, రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే ప్రస్తుతం వైద్యసేవలు మెరుగుపడ్డాయని దీనిని ఇలాగే కొనసాగించాలని వైద్యులకు సూచించారు.