Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వాహనశ్రేణిలో ప్రమాదం

విశేష వార్తలు

  • ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వాహనశ్రేణిలో ప్రమాదం
  • బతుకమ్మ చీరల కొనుగోలులో భారీ కుంభకోణం - రేవంత్ రెడ్డి
  • ఎన్‌టిటిపిఎస్‌ లో బొగ్గు సంక్షోభం, పడిపోయిన విద్యుత్ ఉత్పత్తి
  • జీవో 39 కి వ్యతిరేకంగా అఖిలపక్ష నేతల మౌనదీక్ష, పలువురు నేతల అరెస్ట్
  • వికారాబాద్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి మహేందర్ రెడ్డి 
  • జగిత్యాల, భువనగిరి జిల్లాల్లో నాసిరకం బతుకమ్మ చీరల పంపిణిపై మహిళల నిరసన 

 

 

asianet telugu express news  Andhra Pradesh and Telangana

ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వాహనశ్రేణిలో ప్రమాదం

asianet telugu express news  Andhra Pradesh and Telangana

పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్ లో వాహనం ప్రమాదానికి గురైంది. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి దేవరుప్పల మండలం కడవెండి నుంచి మాదాపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనానికి డిసిసి చైర్మన్ దరావత్ మోహన్‌గాంధీ నాయక్ ప్రయాణిస్తున్న కారు డీకొనడంతో ఎస్కార్ట్ కారు రోడ్డుపక్కన వున్నచెరువులో పడింది. దీంతో ఎస్కార్ట్ వాహన డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు.  
 

వెయిట్ లిప్టర్ దీక్షితకు 15 లక్షల చెక్కును అందించిన మంత్రి పద్మారావు 

asianet telugu express news  Andhra Pradesh and Telangana

ఆస్ట్రేలియా లోని  గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగం లో బంగారు పథకం సాధించిన  దీక్షిత కు ముఖ్యమంత్రి  15 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబందించిన ఈరోజు మంత్రి పద్మారావు ఆయన చాంబర్ లో ధీక్షితకు 15 లక్షల చెక్కును మరియు కోచ్ మాణిక్యాల రావు కు 3 లక్షల చెక్కు ను అందజేశారు. ఈ కార్యక్రమం లో స్పొర్ట్స్ సెక్రెటరీ వెంకటేశం, స్పొర్ట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎం‌డి దినకర్ బాబు, ఓఎస్డి  రాజేశ్వర్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు. 
 

బతుకమ్మ చీరల కొనుగోలులో భారీ కుంభకోణం

asianet telugu express news  Andhra Pradesh and Telangana

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల కొనుగోలులో భారీ కుంభకోణానికి పాల్పడినట్లు టీడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  ఆరోపించారు. ఈ చీరలు రూ.50 కి మించవని, అలాంటిది వీటి కోసం 200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్లు విమర్శించారు. సూరత్ నుంచి కేజీల లెక్కన నాసిరకం చీరలు తెచ్చి టీఆరెస్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ఆడపడుచులను, అటు నేతన్నలను అవమానించారని అన్నారు. ఈ చీరల గురించిన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వాన్ని అడిగితే ఉలుకూ పలుకు లేకుండా దాటవేస్తున్నారని అన్నారు. ఈ నాసిరకం చీరల పంపిణీతో తెలంగాణ ఆడపడుచులను అవమానించిన ప్రభుత్వానికి వారే బుద్దిచెబుతారని హెచ్చరించారు. 
 

ఎన్‌టిటిపిఎస్‌ లో బొగ్గు సంక్షోభం,భారీగా తగ్గిన విద్యుత్ ఉత్పత్తి

asianet telugu express news  Andhra Pradesh and Telangana

ఇబ్రహీంపట్నం ఎన్‌టిటిపిఎస్‌ లో బొగ్గు కొరత ఏర్పడింది. బొగ్గు లేక మూడు విద్యుదుత్పత్తి యూనిట్లను నిలిపివేసినట్లు ఎన్‌టిటిపిఎస్‌ అధికారులు తెలిపారు.
మొత్తంగా 1760 మెగావాట్ల విద్యుదుత్పత్తికి గాను బొగ్గు కొరత వల్ల ప్రస్తుతం 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉత్పాదన అవుతోంది. బొగ్గు సరపరా ఇంకా తగ్గితే మిగతా యూనిట్లలో కూడా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఉన్నాయని ఎన్‌టిటిపిఎస్‌ అధికారులు తెలిపారు .

జీవో 39 కి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో మౌనదీక్ష 

తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీస్ వద్ద మౌనదీక్షకు దిగిన అఖిలపక్ష సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.రాష్ట్రంలో రైతు సమన్వయ సమితిల ఏర్పాటు కోసం తీసుకువచ్చిన జీవో 39 ను రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష నాయకులతో పాటు టీ జేఏసి చైర్మన్ కోదండరామ్ కూడా ఈ మౌన దీక్షలో పాల్గొన్నారు. టీడిపి తెలంగాణ అద్యక్షుడు రమణ,వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలతో పాటు టీ జేఏసి చైర్మన్ కోదండరామ్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

బాన్సువాడలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి

asianet telugu express news  Andhra Pradesh and Telangana

తెలంగాణ వ్యాప్తంగా సుమారు రూ. 250 కోట్లు ఖర్చుపెట్టి కోటి నాలుగు లక్షల మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి  పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ  బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో, అలాగే రుధ్రూర్ మండల కేంద్రంలో మహిళలకు మంత్రి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరల పంపిణీ చేస్తున్నట్లు, ఇందుకోసం 500 కు పైగా డిజైన్ల చీరలు అందుబాటులో ఉంచామని అన్నారు. మహిళలందరికి పెద్దన్నగా మారి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు చీరలను ఇస్తున్నారని ప్రశంసించారు. 18 ఏళ్ళు నిండి, తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి చీరలు అందించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించామని మంత్రి పోచారం గుర్తు చేశారు.  

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి మహేందర్ రెడ్డి

asianet telugu express news  Andhra Pradesh and Telangana

వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించించారు. పేద ఆడపడుచులు కూడా  బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. అందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 15 లక్షల 31 వేల మంది మహిళలకు 1,240 కేంద్రాల ద్వారా చీరలను పంపిణీ చేయనున్నట్లు మహేందర్ రెడ్డి వివరించారు.  ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య,స్థానిక ఎంఎల్ఏ సంజీవరావు లు పాల్గొన్నారు. 
 

నాసిరకం బతుకమ్మ చీరల పంపిణీపై ఆడపడుచుల ఆగ్రహం

asianet telugu express news  Andhra Pradesh and Telangana

ఈ రోజు మెదలైన బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం నిరసనల మద్య కొనసాగుతోంది. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఇస్తున్న బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ చల్ గల్ గ్రామస్థులు నిరసన చేపట్టారు.చీరలను తగలబెట్టి న మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలోను ఈ చీరల పంపిణి కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. జిల్లా కేంద్రంలో పంచుతున్న చీరల నాణ్యత విషయంతో ఆగ్రహించిన మహిళలు బతుకమ్మ చీరలను తగలబెట్టి ఈ మంటల చుట్టూ బతుకమ్మ ఆడుతున్నారు. ఇలా రాష్ట్రంలోని పలు చోట్ల బతుకమ్మ చీరలు నాణ్యతగా లేవని ఆడపడుచులు నిరసన తెలుపుతున్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios