ఊపందుకున్న హైదరాబాద్ గణేశ నిమజ్జనం

asianet telugu express news  Andhra Pradesh and Telangana
Highlights

నేటి విశేషాలు

  • ఇలాంటోళ్లొస్తారు, జాగ్రత్త గా ఉండండి
  • ఆంధ్రా మాజీ స్పీకర్ ఇంట్లో దొంగలు పడ్డారు
  • సరిహద్దు సమస్యలపై చర్చించిన ఇండో చైనా అధినేతలు
  • ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటిఆర్
  • సెక్రటేరియట్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
  • ఇంకా ఎన్నో... ...

గణేశ నిమజ్జనం... జనంతో క్రిక్కిరిసి పోతున్న నెక్లెస్ రోడ్

 

మంగళ వారం గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్  ట్యాంక్‌బండ్ పరిసరాలు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. చారిత్రాత్మక గణేష్ నిమజ్జనం తిలకిచేందుకు వేలసంఖ్యలో నెక్లెస్ రోడ్డకు తరలి వస్తున్నారు. తెలంగాణా రాజధాని  నగరం నలుమూలల నుంచి భారీగాసంఖ్యలో విగ్రహాలు, భక్తులు, ప్రజలు వస్తున్నారు. పలు ప్రాంతాలలో ట్రాఫిక్  స్తంభించింది. ముఖ్యంగా  ఖైరతాబాద్ మహాగణపతి శోభా కయాత్ర చూసేందుకు ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యాక మిగిలిన గణేశులను నిమజ్జనం జరుగుతూ ఉంది. బాలాపూర్ గణేశ్ విగ్రహం నిమజ్జనం సాయంత్రం 5.50 కి పూర్తయింది.  హైదరాబాద్ నగరం లో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్నిహోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి సీపీ మహేందర్ రెడ్డి జిహెచ్ ఎంసి  కమీషనర్ జనార్దన్ రెడ్డి హెలికాఫ్టర్ నుండి వీక్షించారు. నగరం లోని ఇతర వినాయక విగ్రహాలను కూడా  తెలవారే లోపే నిమజ్జనం చేయాలని గణేష్ ఉత్సవ కమిటీ కి అదేశించామని హోం మంత్రి తెలిపారు.ఓల్డ్ సిటీ నుండి బయలుదేరిన నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగుతోంది.

 

ఇలాంటోళ్లొస్తారు, జాగ్రత్త గా ఉండండి

దొంగ వేషాలని వూరకే అనేలేదు, మనవాళ్లు. పాత గుంటూరు ప్రాంతంలోని సత్యనారాయణ గుడి వీధిలో  దొంగవేషాలోళ్లొచ్చి ఘరానా దోపిడీ చేసుకుని వెళ్లారు,. చీర ఫాల్స్ కొనుగోలు చేస్తామంటూ ఒకామె, ఒకాయన, మొగుడు పెళ్లామని చెబుతూ ఒక ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో సువర్ణలక్ష్మి అనే మహిళ ఒక్కతే ఉంది. ఇది కనిపెట్టే వాళ్లు ఇంట్లో ప్రవేశించారు. ఆమెను బెదిరించి పదిహేను తులాల బంగారు నగలను అపహరించారు. మహిళా తన ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని ఉంది. పురుషుడు మాస్కు ధరించినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. దోపిడీ అనంతరం దుండగులిద్దరూ బైక్‌పై పారిపోయేందుకు యత్నించారు. వారిని సువర్ణలక్ష్మి అడ్డుకుంది. ఈ పెనుగులాటలో సువర్ణలక్ష్మికి గాయాలయ్యాయి. క్లూస్ టీమ్ కీలక ఆధారాలు సేకరించింది. దుండగులు ఇంట్లోకి రావడం, పారిపోవడం సమీపంలోని సిసి కెమెరాల్లో రికార్డయింది. బాధితురాలు సువర్ణలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దొంగ వేషాలని వూరకే అనేలేదు, మనవాళ్లు. పాత గుంటూరు ప్రాంతంలోని సత్యనారాయణ గుడి వీధిలో  దొంగవేషాలోళ్లొచ్చి ఘరానా దోపిడీ చేసుకుని వెళ్లారు,. చీర ఫాల్స్ కొనుగోలు చేస్తామంటూ ఒకామె, ఒకాయన, మొగుడు పెళ్లామని చెబుతూ ఒక ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో సువర్ణలక్ష్మి అనే మహిళ ఒక్కతే ఉంది. ఇది కనిపెట్టే వాళ్లు ఇంట్లో ప్రవేశించారు. ఆమెను బెదిరించి పదిహేను తులాల బంగారు నగలను అపహరించారు. మహిళా తన ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని ఉంది. పురుషుడు మాస్కు ధరించినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. దోపిడీ అనంతరం దుండగులిద్దరూ బైక్‌పై పారిపోయేందుకు యత్నించారు. వారిని సువర్ణలక్ష్మి అడ్డుకుంది. ఈ పెనుగులాటలో సువర్ణలక్ష్మికి గాయాలయ్యాయి. క్లూస్ టీమ్ కీలక ఆధారాలు సేకరించింది. దుండగులు ఇంట్లోకి రావడం, పారిపోవడం సమీపంలోని సిసి కెమెరాల్లో రికార్డయింది. బాధితురాలు సువర్ణలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 

మాజీ స్పీకర్ ఇంట్లో దొంగలు పడ్డారు

తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎ.వి.సూర్యనారాయణరాజు ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. దొంగలు ముసుగులు ధరించి ఇంట్లో చొరబడ్డారు.  సూర్యనారాయణరాజు కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించారు. మూడు లక్షల విలువైన బంగారు నగలు, రూ.75 వేల నగదును అపహరించారు.  సూర్యనారాయణరాజు మంగళవారం జరిగిన ఈ ఘటన గురించి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎ.వి.సూర్యనారాయణరాజు ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. దొంగలు ముసుగులు ధరించి ఇంట్లో చొరబడ్డారు.  సూర్యనారాయణరాజు కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించారు. మూడు లక్షల విలువైన బంగారు నగలు, రూ.75 వేల నగదును అపహరించారు.  సూర్యనారాయణరాజు మంగళవారం జరిగిన ఈ ఘటన గురించి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య యాత్ర...నెల్లూరులో  
 

తమకు న్యాయం చేయకపోతే అసెంబ్లీ వద్ద సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  తమకు జరిగిన  అన్యాయంపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ బాధితులు చేపడుతున్న చైతన్యయాత్ర ఈ రోజు నెల్లూరుకు చేరింది. నగరంలోని సిపిఐ కార్యాలయం నుంచి  ఆర్టీసి బస్టాండ్ వరకు భారీ ర్యాలి నిర్వహించారు. ఈ  చైతన్య యాత్రకు అగ్రి గోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర నాయకులు తిరుపతయ్య సారద్యం వహించారు.                          

ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

 ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ముగిసింది. పదకొండు రోజులుగా నగర ప్రజల విశేష పూజలందుకున్న లంభోదరుడు హుస్సేన్ సాగర్ జలాశయంలోకి చేరారు. ఈ  నిమజ్జనం దృష్యాలను చూడటానికి వచ్చిన భక్తులలో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. పొద్దున మొదలైన ఈ శోభాయాత్ర నిమజ్జనంతో ముగిసింది. 
 

దళితులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నవారిపై కఠిన చర్యలు  
 

కొందరు దళితులను రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మానుకొండూరులో జరిగిన మహంకాళి శ్రీనివాస్ ఆత్మహత్య ఆ కోవలోకి చెందిందేనని అన్నారు. ఇలా దళితులను రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని, అది మా పార్టీ వారైనా సరే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ధళిత వ్యతిరేక ప్రభుత్వమని తమ నాయకత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు వారి హయాంలో దళితులకు చేసిందేమిటో చెప్పాలని విమర్శించారు.   
 

చైనా అధ్యక్షుడితో ప్రధాని సమావేశం 

బ్రిక్స్ సదస్సులో భాగంగా చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఈ దేశ అద్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఇటీవల ఇండో చైనా సరిహద్దుల వెంబడి చెలరేగుతున్న ఉద్రిక్తతల విషయంలో ఇరు దేశాధినేతలు చర్చించారు. అలాగే డోక్లాం లో జరిగిన సైనిక ఘర్షణ  కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. 
ఈ సమావేశాన్ని ముగించుకున్న పీఎం మయన్మార్ పర్యటనకు బయల్దేరారు. ఈ దేశాంలు ఆయన మూడు రోజులు పర్యటించనున్నారు.
 

వినాయక విగ్రహాలకు జియోట్యాగింగ్

హైదరాబాద్‌: నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు సీపి మహెందర్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ మహా గణపతిని పక్కా ప్రణాళికతో తరలిస్తున్నట్లు, అందుకోసం భారీగా పోలీసులు బలగాలను ఉపయోగించామని  తెలిపారు. అందువల్లే షెడ్యూల్ ప్రకారం ట్యాంక్ బండ్ కి చేర్చగలిగామని అన్నారు. మిగతా చోట్ల కూడా విగ్రహాలకు జియెట్యాగింగ్ ఏర్పాటు చేశామని, దీనివల్ల శోభాయాత్ర కదలికపై అంచనా ఉంటుందన్నారు. బుదవారం ఉదయం కల్లా నిమజ్జన కార్యక్రమం ముగుస్తుందని సిపి తెలిపారు. 
 

ఆధునికత వైపు తెలంగాణ పాఠశాలలు

 

హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ఉపాధ్యాయులకు, విధ్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా ఆయన తెలంగాణలోని పాఠశాలకు ఆధునిక మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అందుకు నిదర్శనంగా నిలిచిన ఈ పాఠశాలను చూడండి అంటూ గజ్వెల్ లోని గవర్నమెంట్ స్కూల్ పోటోలను ట్విట్టర్ లో పెట్టారు. ఇలా ఆధునిక సదుపాయాలు కల్పించడమే తెలంగాణ  ప్రభుత్వం టీచర్స్ డేకు అందించే గొప్ప బహుమతి అని కేటీఆర్ ట్వీట్ చేశారు.  

 

ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయులు వీరే

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 9మంది ఎంపికయ్యారు. వీరు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులమీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోనున్నారు.  
1. గోరెంట్ల శ్రీనివాస్ రావు
2.  విమలకుమారి  
3.  చాగంటి శ్రీనివాసరావు  
4.  చిలుకూరి శ్రీనివాసరావు 
5.  ఎర్ర చక్రవర్తి 
6.  గొట్టేటి రవి
7. బోట్లకోటి శంకర్‌రావు
8. ధర్మరాజు 
9.  లోకానంద రెడ్డి 
 

తెలంగాణ ఉత్తమ ఉపాధ్యాయులు వీరే

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్ర  మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ ఎంపిక చేసింది. ఇందులో ఆరుగురు తెలంగాణ టీచర్లు  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకోనున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అవార్డులను వాళ్లకు అందించనున్నారు.
తెలంగాణ నుంచి అవార్డులు అందుకోనున్న ఉత్తమ ఉపాధ్యాయులు
1. వాల్గోట్ కిషన్ - నిర్మల్ జిల్లా
2. జనార్థన్ - నల్గొండ
3. ఎం. నారాయణ - నాగర్ కర్నూల్
4. ఎన్.విజయలక్ష్మి - నిజామాబాద్
5. గుండటి యోగిశ్వర్ - వరంగల్
6. పొత్త రామారావు - ఖమ్మం

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర

ఉదయమే ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సెక్రటేరియట్ వద్దకు చేరుకుంది. పదకొండు రోజులు భక్తుల పూజలు అందుకున్న ఈ మహాగణపతి  నిమజ్జనం కాసేపట్లో జరగనుంది. ట్యాంక్ బండ్ పై గల 4 వ నంబర్ క్రేన్ ద్వారా నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిమజ్జనాన్ని చూడటానికి భారీగా భక్తులు ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నారు.  
 

loader