హైదరాబాద్ పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య

రెండు రోజుల హైదరాబాద్ పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికారు. నల్సార్ యూనివర్సిటీలో నేటి నుంచి జరగనున్న  78వ అంతర్జాతీయ న్యాయ సదస్సును వెంకయ్య ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ తో పాటు తెలంగాణ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొంటారు.

టాస్ గెలిచిన లంక జట్టు

భారత్ తో ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న చివరి వన్డేలో లంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే నాలుగు వన్డేలను గెలిచి సీరీస్ కైవసం చేసుకున్న టీం ఇండియా ఆ మ్యాచ్ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుండగా, చివరి వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని శ్రీలంక పట్టుదలతో ఉంది.  
 

కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

 

మార్పుల తర్వాత   కేబినెట్ మంత్రులు శాఖలవారిగా

 

1.రాజ్‌నాథ్ సింగ్ - కేంద్ర హోంశాఖ

2.సుష్మా స్వరాజ్ - విదేశాంగ శాఖ

3.అరుణ్ జైట్లీ - ఆర్థిక శాఖ

4.నితిన్ గడ్కరీకి - రోడ్డు రవాణా, హైవేస్, షిప్పింగ్ - అదనంగా జల వనరులు, గంగా ప్రక్షాళన

5.సురేశ్ ప్రభు - కామర్స్ అండ్ ఇండస్ట్రీస్

6.సదానంద గౌడ - అర్థ గణాంకాల శాఖ

7.ఉమా భారతి - త్రాగు నీరు, పారిశుద్ధ్యం

8.రాంవిలాశ్ పాశ్వాన్ - కన్యూమర్ ఎఫైర్స్, ఆహారం మరియు ప్రజా పంపిణీ

9.మేనకా గాంధీ - స్త్రీ శిశు సంక్షేమ శాఖ

10.అనంత్ కుమార్ - ఎరువులు, రసాయనాలు, పార్లమెంటరీ వ్యవహారాలు

11.రవిశంకర్ ప్రసాద్ - న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ

12.జేపీ నడ్డా - వైద్యారోగ్య శాఖ

13.అశోక్ గజపతి రాజు - పౌర విమానయాన శాఖ

14.అనంత్ గీతే - భారీ పరిశ్రమల శాఖ

15.హర్‌సిమ్రత్ కౌర్ - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్

16.నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, మైన్స్

17.చౌదరి బీరేంద్ర సింగ్ - ఉక్క శాఖ

18.జువల్ ఓరం - గిరిజన శాఖ

19.రాధామోహన్ సింగ్ - వ్యవసాయ శాఖ

20.థావర్ చంద్ గెహ్లాట్ - సామాజిక న్యాయశాఖ

21.స్మృతి ఇరానీ - సమాచార ప్రసారాలు, జౌళి శాఖ

22.హర్షవర్దన్ - సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖలు

23.ప్రకాశ్ జవడేకర్ - మానవ వనరుల అభివృద్ధి

24.ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజ వనరులు, స్కిల్ డెవలప్మెంట్

25.పీయూష్ గోయల్ - రైల్వే మరియు బొగ్గు శాఖ

26.నిర్మలా సీతారామన్ - రక్షణ శాఖ

27.ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాలు
 

షాద్ నగర్ లో రైతు సమన్వయ సమితి ల ఏర్పాటు

రంగారెడ్డి జిల్లా : భూ సమస్య ప్రక్షాళన, రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితిల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని రవాణ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ లో రైతు సమన్వయ సమితి లను ఆయన ప్రారంభించారు.ఈ సందర్బంగా  మంత్రి మాట్లాడుతూ... ఉమ్మడి  రంగారెడ్డి జిల్లాలో 3 లక్షల 64 వేల రైతుల భూముల సర్వే పూర్తి చేశామని తెలిపారు.  పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా 5 లక్షల ఎకరాకు నీరందించి ఉమ్మడి  రంగారెడ్డి జిల్లా ను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ, 9 గంటల విద్యుత్ సరఫరా, కొరత లేని ఎరువులు,విత్తనాల సరఫరా, మిషన్ కాకతీయ పథకాల ద్వారా రైతులను ఆదుకోడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లు పాల్గొన్నారు.  

మంచి చెడులతో కూడిన మంత్రివర్గం

ఇవాళ జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ నుంచి మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను తొలగించడం మంచి పద్దతి కాదని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.  అలాగే మరోవైపు మంత్రివర్గంలోకి బ్యూరోక్రాప్ట్ లను తీసుకోవడాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. వారి అనుభవాన్ని  ఉపయోగించాలనుకోవడం మంచి ఆలోచనగా ఆయన అభివర్ణించారు. ఇక తెలంగాణ లో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, కోచ్ ప్యాక్టరీని ఏర్పాటుచేస్తామన్న హామీని నెరవేర్చడం కేంద్ర మంత్రుల భాద్యత అని కేటీఆర్ ట్వీట్ చేశాడు.  
 

ఏడాదిలోగా మేడిగడ్డ, సుందిళ్ల ను పూర్తి చేస్తాం

క‌రీంన‌గ‌ర్: తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన నిర్మించడానికి కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ రైతులకు మేలు చేకూర్చే మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులను ఏడాది లోగా నిర్మిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. అందుకు అనుగునంగా ఈ ప్రాజెక్టుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, సీఎం కార్యాలయానికి అనుసంధానం చేసి పరిశీలిస్తున్నామని తెలిపారు. రైతులకు ఆరుగాలాలు నీరు అందించి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పాటునందించడమే ఆర్థిక మంత్రిగా తన లక్ష్యమని ఈటెల స్పష్టం చేశారు.   
 

చైనా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

కేంద్ర మంత్రివర్గ విస్తరణ ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు బయలుదేరారు. రెండు రోజులు చైనాలో ప్రర్యటించనున్న ఆయన ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. అలాగే  ఇటీవల చైనా భారత్ సరిహద్దుల్లో జరుగుతున్న వివాధాలపై చైనాతో సంప్రదింపులు జరపనున్నారు. బ్రిక్స్ సదస్సు అనంతరం  ప్రధాని ఎల్లుండి మయన్మార్ లో పర్యటించనున్నారు.
 

రైల్వే మంత్రిగా పీయూష్ గోయల్

కేంద్ర మంత్రి వర్గంలో పదోన్నతి పొందిన పీయూష్ గోయల్ కు రైల్వే శాఖను అప్పగించారు. ఇప్పటికే రైల్వే శాఖ భాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సురేశ్ ప్రభు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.  ఇప్పటి వరకు సహాయసహకారాలు అందించిన రైల్వే ఉద్యోగులకు ధన్యవాదాలు  అంటూ ఆయన వీడ్కోలు ట్వీట్ చేశాడు.
అయితే విద్యుత్ , బొగ్గు శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన పీయూష్ , రైల్వే ను కూడా గాడిన పెట్టగలడని నమ్మకంతో ప్రదాని నరేంద్ర మోడీ  ఈ శాఖను  అప్పగించినట్లు తెలుస్తోంది.

మరో సారి అణుపరీక్ష నిర్వహించిన వివాదాస్పద అధ్యక్షుడు

ఉత్తర కొరియా అద్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరో సారి వార్తల్లో నిలిచాడు. అమెరికా హెచ్చరికలను  లెక్కచేయకుండా మరోసారి అణుపరీక్షలు నిర్వహించి వివాదానికి తెర లేపాడు. ఉత్తర కొరియా ప్రభుత్వం అణుపరీక్ష నిర్వహించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా లోని సునిగ్జిబేగమ్ ప్రాంతంలో అభివృధ్ది పర్చిన హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు దక్షిణ కొరియా కూడా దృవీకరించింది.  దీని ప్రభావంతో సమీప ప్రాంతాల్లో భూమి కంపించిందని దక్షిణ కొరియా పేర్కొంది.
 

నలుగురు మంత్రులకు కేబినెట్ హోదా

కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పుచేర్పులు జరిగాయి. నలుగురు  సహాయ మంత్రులకు కేబినెట్ హోధా కల్పించిన కేంద్రం మరో తొమ్మిదిమందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రమోషన్ పొందిన వారిలో నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్. ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్తార్ అభ్భా స్ నఖ్వీలు ఉన్నారు. వారు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్తగా మంత్రివర్గంలో చేరిన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో ప్రారంభమైంది. కొత్త గా నియమింపబడిన మంత్రులతో   రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయిస్తున్నారు. కొత్తగా మంత్రివర్గంలో అశ్వినీకుమార్ చౌబే, గజేంద్రసింగ్ షెకావత్, శివప్రతాప్‌శుక్లా, హర్దీప్‌సింగ్ పూరీ, సత్యపాల్ సింగ్, రాజ్‌కుమార్‌సింగ్, అల్ఫోన్స్ కన్నంతనమ్ , వీరేంద్ర కుమార్, అనంత్‌కుమార్ హెగ్డే లు చేరనున్నారు.