ముద్రగడను వీరవరం దగ్గర  అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలంగాణ ఉధ్యానవన మహాత్సవాలను ప్రారంభించిన వ్యవసాయ మంత్రి పోచారం  బ్యాడ్మింటన్ వరల్డ్ చాంఫియన్ షిప్ లో ఫైనల్ కి చేరిన పీవి సింధు మూడో వన్డేలో టాస్ గెలిచి, భ్యాటింగ్ ఎంచుకున్న లంక జట్టు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మంత్రి పరిటాల సునీత

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని మంత్రి పరిటాల సునీత దర్శించుకున్నారు. అక్టోబర్ 1 వ తేదీన ఆమె కొడుకు పరిటాల శ్రీరామ్ వివాహం జరగనున్న సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వదూ వరుల పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ...గతంతో పోలిస్తే ఇప్పుడు ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని,రానున్న కాలంలో కొత్తగా ఏర్పడిన ఆలయ కమిటీ ఆద్వర్యంలో ఆలయ అభివృద్ధిని పరుగులెత్తిస్తామని పరిటాల సునీత తెలిపారు.

పోలీసుల అదుపులో ముద్రగడ 

కాపులకు రిజర్వేషన్ల కోసం పాదయాత్ర చేపడుతున్న ముద్రగడను వీరవరం దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పాద యాత్ర చేపడుతున్నందున ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఏపీ డీజిపి సాంబశివరావు తెలిపారు. ముద్రగడ యాత్రను అడ్డుకోలేక పోయిన స్థానిక పోలీసులపైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీజిపి తెలిపారు. పాదయాత్రలో హింస చెలరేగే అవకాశం వుండటంతో కిర్లంపూడిలో భారీగా పోలీసులను మొహరించినట్లు డీజిపి తెలిపారు.

అరుణ్ జైట్లీ తెలంగాణ పర్యటన

ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని బీడీఎల్‌ పరిశ్రమను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో భానూరు టౌన్‌షిప్‌లో మైదానానికి చేరుకున్న ఆయన అక్కడినుంచి నేరుగా బీడిఎల్ పరిశ్రమకు చేరుకున్నారు. అక్కడ అస్త్ర మిస్సైల్‌, సోలార్‌ 5మెగావాట్ల సబ్‌స్టేషన్‌ను జైట్లీ ప్రారంభించారు. అక్కడి నుంచి ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చేరుకున్న మంత్రి...యుద్ధ ట్యాంకుల తయారీని పరిశీలించారు.

వరంగల్ బీజేపిలో భారీ చేరికలు,, 

వరంగల్ జిల్లా బీజేపి అధ్యక్షురాలు రావు పద్మ ఆద్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాలకి చెందిన దాదాపు 300 యువకులు బీజేపీలో చేరారు. వీరందరికి భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పద్మ. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జాతీయ కార్యదర్శి బద్ధం మహిపాల్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గుండామీది శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ఇంచార్జీ పురుషోత్తం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, సంగాని జగదీశ్వర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాందాటి వినోద్, బీజేపీ జిల్లా కార్యదర్శి పులిశేరి ఉపేందర్, దీక్షిత్ పటేల్, హరీష్ లతో పాటు బీజేవైఎం రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో విద్యార్థి అనుమానాస్పద మృతి

 "తెలంగాణ ఉధ్యానవన మహాత్సవం -2017" 

నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఉధ్యానవన మహాత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు సేంద్రీయ పద్దతుల్లో తాజా కూరగాయాలను పండించుకోవాలని సూచించారు. ఇళ్ళలోనే కూరగాయలు పండించడానికి అవసరమైన అధునాతన, సాంకేతిక పద్దతులను రాష్ట్ర ఉధ్యానశాఖ అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే ప్రజలు ఆరోగ్యమైన, తాజా ఆహారం తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.
తెలంగాణ ఉధ్యాన శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మహాత్సవం ఈ నెల 31 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

రైలు కిందపడి ఇద్దరు ప్రాణ స్నేహితుల ఆత్మహత్య

నల్లగొండ జిల్లాలో ఇద్దరు యువకులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. త్రిపురారం మండలం బాబుసాయిపేట కి చెందిన చరణ్, నాగరాజు..మిర్యాలగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న అర్ధరాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని రైల్వే పోలీసులు తెలిపారు. ప్రాణస్నేహితులైన వీరిద్దరు బెట్టింగ్ లకు బాగా అలవాటుపడ్డారని, ఆర్దిక ఇబ్బందుల నేపద్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వరల్డ్ చాంఫియన్ షిప్ కు అడుగుదూరంలో సింధు

బ్యాడ్మింటన్ వరల్డ్ చాంఫియన్ షిప్ సెమిఫైనల్లో గెలిచి పీవి సింధు చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్ లో చైనా క్రీడాకారిణి చెన్‌ యూఫీ పై 21-13, 21-10 తేడాతో గెలిచి మొదటి సారి ఫైనల్ కి చేరింది. ఈ విజయంతో రజతాన్ని ఖాయం చేసుకున్న సింధు, స్వర్ణ పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇదే జోరును కొనసాగించి షైనల్లో సైతం విజయం సాధించడానికి అన్ని ఎత్తుగడలను సిధ్దం చేసుకున్నట్లు సింధు తెలిపింది.

టాస్ గెలిచి, భ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

 కాసేపట్లో పల్లెకెలె లో ప్రారంభం కానున్న మూడో వన్డేలో ఆతిథ్య శ్రీలంక టాస్ గెలిచి భ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్నటికే రెండు వన్డేల్లో పరాజయం పాలైన శ్రీలంక ఈ వన్డేలో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని భావిస్తుండగా, మ్యాచ్ ను గెలిచి ఐదు వన్డేల సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు మిగిలి వుండగానే ఖయం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తోంది.

కిర్లంపూడిలో మళ్లీ అలజడి

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. ఆయన మళ్లీ పాదయాత్రకు పూనుకోగా, రాజానగరం వద్ద పోలీసులు యాత్రను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆయన అనుచరులు, కాపు నేతలకు, పోలీసులకు మద్య తోపులాట జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కాపు ఉద్యమకారులు కిర్లంపూడికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం 

సిద్దిపేట జిల్లా కొండపాక శివారులో రాజీవ్ రహదారి పై ఆగివున్న లారీని స్విఫ్ట్ కారు డీ కొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కరీంనగర్ జిల్లా గన్నేరువరం కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. 

పోలీసులూ...ఇకపై సెలవులు కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాల్సిందే

పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఇకపై సెలవుల కోసం ఉన్నతాధికారుల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన భాద లేకుండా చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై వారు సెలవు కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విదానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇటీవలే ప్రారంభించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పోలీస్‌ సిబ్బందికి ఆన్‌లైన్‌లో సెలవు మంజూరు చేసే విధానం దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా అమల్లోకి రావడం విశేషం.

శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ పట్టుబడిన బంగారం

దుబాయ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుభాయ్ నుంచి ఇండియాకు వచ్చిన పార్శిల్లను తనిఖీ చేస్తుండగా 1.233 కేజీ ల బంగారాన్ని గుర్తించారు. కస్టమ్స్ అధికారుల కు అనుమానం రాకుండా బంగారానికి కాపర్ పూత పూసి... కార్టూన్ బాక్స్ లో ప్యాక్ చేసి తరలించారు. పట్టుబడిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నడి రోడ్డుపైనే బైక్ రేసింగ్ (వీడియో)

హైదరాబాద్ : నడిరోడ్డుపై, అదీ అత్యంత రద్దీగా వుండే ప్రాంతంలో బైక్ రేసింగ్ కు పాల్పడిన ఆకతాయిలు, ఆక్సిడెంట్ చేసిన ఘటన దిల్ షుక్ నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే మలక్ పేట్ నుంచి దిల్ షుక్ నగర్ కు వెళ్లే ప్రదాన రహదారిపై కొందరు విద్యార్థులు బైక్ రేసింగ్ పేరుతో బైక్ లపై వెళుతూ మరో ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టారు. మితిమీరిన వేగంతో ఢీ కొట్టడం తో ఆ వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి రేసింగ్ లో పాల్గొన్న యువకులు మాత్రం సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బాదితుడిని హాస్పిటల్ కి తరలించి, రేస్ కి పాల్సడిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.

జర్నలిస్టు దారుణ హత్య

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనికి చెందిన ఆరుకొల్ల శ్రీనివాస్ అలియాస్ బుగ్గల శ్రీను దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ ప్రస్తుతం మన తెలంగాణ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ తన నివాసంలో ఉండగా దుండగులు కత్తులతో చొరబడి పొడిచి చంపారు. హంతకులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. శ్రీనివాస్ పై దాడి చేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన భార్య పై కూడా దాడికి పాల్పడ్డారు దుండగులు. అయితే పాత కక్షలే శ్రీనివాస్ హత్యకు కారణంగా పలువురు చెబుతున్నారు. గతంలో గోదావరిఖని 1టౌన్ కానిస్టేబుల్ ఎర్రగొల్ల శ్రీనివాస్ హత్య కేసులో జర్నలిస్టు రమేష్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

99 టివి సిబ్బందిపై దాడి

హైదరాబాద్ లో 99 టివి రీపోర్టర్ రాజేష్... కెమెరా మాన్ నరేష్, డ్రైవర్ సూరి లపై మద్యం మత్తులో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ దాడిలో రిపోర్టర్ రాజేష్ కి స్వల్ప గాయాలయ్యా.యి. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో టి.ఆర్.యస్.ఎల్పీ సమావేశం కవర్ చేసుకొని తిరిగి వస్తుండగా 6.40 నిమిషాల కు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కింద ఘటన జరిగింది. అయితే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ ఉండగా 99 టివి వాహనం అక్కడ ఆగింది. దీంతో తాగుబోతులు వచ్చి అకస్మాత్తుగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.