నారీ ప్ర‌తిభా పుర‌స్కార్ అవార్డును అందుకున్న నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌  రేపు రెండొందల నోటును విడుదలచేయనున్న ఆర్బీఐ శిల్పా చక్రపాణి రెడ్డిపై  కాల్పులు జరిపిన అభిరుచి మధు వ్యక్తిగత గోప్యత ను ప్రాథమిక హక్కుగా తేల్చిన సుప్రీంకోర్టు తెలంగాణలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు భారీ వర్షాలు  కురిసే అవకాశం

ఎన్నికల సన్నద్దత

త్వరలో మూడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకోసం బీజేపి కసరత్తు మొదలుపెట్టింది. ఈ మూడు రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లకు ఇంచార్జీలను  నియమించారు బీజేపి చీఫ్ అమిత్ షా. గుజరాత్ కు అరుణ్ జైట్లీ, కర్ణాటకకు ప్రకాశ్ జవదేకర్, హిమాచల్ ప్రదేశ్ కు తావర్ చంద్ గెహ్లాట్ లను నియమించారు. ఈ మూడు రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో వున్న బీజేపీ మొదటి అడుగు వేసింది.

ఎంపి క‌విత‌కు ప్ర‌తిష్టాత్మ‌క నారీ ప్ర‌తిభా పుర‌స్కార్‌ అవార్డు

ప్ర‌తిష్టాత్మ‌క నారీ ప్ర‌తిభా పుర‌స్కార్ అవార్డును అందుకున్నారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. యువ‌త‌, మ‌హిళ‌ల సాధికార‌త కోసం కృషి చేసినందుకు గాను ఎంపి క‌విత‌ను  మైక్రో, స్మాల్‌, మీడియం ఎంట‌ర్‌ప్రైజెస్ (ఎంఎస్ ఎంఇ) మంత్రిత్వ శాఖ, విమెన్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ అసోసియేష‌న్ (డ‌బ్ల్యూఇఎ) సంయుక్తంగా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ పుర‌స్కారానికి ఎంపిక చేశాయి. గురువారం హైద‌రాబాద్‌లో వీ ఇండియా ఛైర్మ‌న్ డాక్ట‌ర్ టి. వ‌సంత  ల‌క్ష్మి ఎంఎస్ ఎంఇ త‌ర‌పున ఎంపి క‌విత‌కు అవార్డుతో పాటు ప్ర‌శంసాప‌త్రాన్ని అంద‌జేసి, శాలువా క‌ప్పి స‌న్మానించారు.  డిల్లీలో జ‌రిగిన అవార్డుల ప్ర‌ధానోత్స‌వానికి నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వ‌ద్ద జ‌రిగిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ స‌భ ఏర్పాట్ల‌లో బిజీగా ఉన్న‌ నేప‌థ్యంలో ఎంపి క‌విత హాజ‌రుకాలేక పోయారు. ఈ నేప‌థ్యంలో ఎంఎస్ఎంఇ మంత్రి కల్రాజ్ మిశ్రా ఆదేశాల‌తో వ‌సంత ల‌క్ష్మి హైద‌రాబాద్‌కు వ‌చ్చి...అవార్డును అంద‌జేశారు. మొద‌టిసారి ప్ర‌వేశ‌పెట్టిన నారీ ప్ర‌తిభా పుర‌స్కార్ -2017 అవార్డును ఎంపి కల్వకుంట్ల కవిత తో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన కల్పకం ఏచూరి, ఆషాప్రకాశ, స్మృతి నాగపాల్, ప్రియా భార్గవ, షిర్లే అబ్రహం అవార్డును అందు కున్నారు. వీరితో పాటు తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షి టీమ్స్ భాద్యత లు చూస్తున్న ఐపీఎస్ స్వాతి లక్రా కూడా అవార్డు అందుకోవడం తెలంగాణకు గర్వకారణం.

లేడీ డాన్ ఆత్యహత్యాయత్నం

ఎర్ర చందనం అక్రమ రవాణ కేసులో చిత్తూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న లేడీ డాన్ సంగీత చటర్జీ ఆత్మ హత్య యత్నానికి పాల్పడింది. ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు తెలియరాలేదు. ఆమెను చికిత్స అందిస్తున్న వైద్యులు, పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

ఫీజుల కోసం  విద్యార్థులకు వేదింపులు   

హైదరాబాద్ : రామంతపూర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో బోయినపల్లి ప్రణీత్ అనే 9 వ తరగతి   విద్యార్థి పాఠశాల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఏకంగా ధర్నాకు దిగాడు. ఫీజు విషయంలో తనను యాజమాన్యం వేదింపులకు గురిచేస్తోందని తెలిపాడు ప్రణీత్. తాను 50 వేల రూపాయల ఫీజు  చెల్లించిన కూడా యాజమాన్యం తనకు పై తరగతులకు పంపడంలేదని అందుకే ప్రిన్సిపాల్ కార్యాలయం ముందు ధర్నా కు దిగినట్లు తెలిపాడు.   ఇకనైనా వేదింపులు ఆపి తనకు 9 వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరాడు.
 

మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు,, 

పోలీసులంటే కఠినంగానే కాదు, వారిలో మానవత్వాన్ని కలిగిన వారు ఉంటారని చాటిచెప్పారు ఈ ఆబ్కారీ పోలీసులు.జూబ్లీహిల్స్ రోడ్  నంబర్ 45 లో ఓ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన భాదితుడిని చూసి కూడా ఎవరు తమకు పట్టదన్నట్లు వెళ్లిపోసాగారు. అదే సమయంలో అటువైపు      వెలుతున్న ఆబ్కారీ  సీఐ కనకదుర్గ, ఎస్సై భాదితుడిని ఆటోలో తీసుకెళ్లి హస్పిటల్ లో చేర్పించారు.  

దమ్మున్న పీఎం మోదీ

దేశంలో దమ్మున్న నిర్ణయాలు తీసుకునే నాయకుడు ఎవరైనా వున్నారంటే ఆయన నరేంద్ర మోదీనే అని  జాతీయ బీసి సంఘం అద్యక్షుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రధానిని ప్రశంసించారు. ఒకే సమావేశంలోనే   ఓబీసీ ల వర్గీకరణకోసం కమిషన్  ఏర్పాటుకు ఆదేశాలిచ్చిన గొప్ప నాయకుడు మోదీ అని కొనియాడారు. తెలంగాణ సెక్రెటేరియట్ వద్ద మాట్లాడిన ఆయన ఓబీసీలకు క్రిమిలేయర్ పరిమితిని 8 లక్షలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అసలు బీసీలకు క్రిమిలేయర్ పరిధినుండి తొలగించాలని,  వారికి క్రిమిలేయర్ అవసరం లేదని కృష్ణయ్య తెలిపారు.
 

కాకినాడలో పట్టుబడ్డ బెట్టింగ్ రాయుళ్లు

కాకినాడలో  క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్ ద్వారా సమాచార మార్పిడి చేసుకుంటూ కాకినాడ పట్టణంలోనే కాకుండా, వేరే ప్రాంతాల్లో కూడా వీరు బెట్టింగ్ లను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడైతే తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశామని, వారిని విచారించి ఇందులో కీలకంగా వ్యవహరించిందెవరో తెలియజేస్తామని జిల్లా ఎస్పీ  విశాల్‌ గున్నీ తెలిపారు. 
 

టాస్ గెలిచిన టీం ఇండియా

మొదటి వన్డేలో ఘనవిజయం సాధించి మంచి ఊపుమీదున్న టీం ఇండియా అదే ఫార్ములాను రెండో వన్డేలోను వాడుతోంది. పస్ట్ వన్డే మాదిరిగానే  కాండెలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకుంది.  తొలి వ‌న్డేలో ఆడిన జ‌ట్టుతోనే రెండ‌వ వ‌న్డేలో ఆడుతున్న‌ట్లు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. అయితే శ్రీలంక జట్టు పలు మార్పులు చేసింది. తిస‌రా, వ‌నిడు, సంద‌క‌న్‌లు టీమ్ నుంచి బయటకు వెళ్లగా, దుష్మంత‌, అఖిల ధ‌నంజ‌య‌, మిలిండ సిరివ‌ర్ధ‌న‌లు వారి స్థానాల్లో ఆడనున్నారు. 
 

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో స్వచ్చ రైల్ కార్యక్రమం

 

 

హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో రైల్వేశాఖ ఆద్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ రైల్ కార్యక్రమంలో రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైల్వే స్టేషన్లో ఆయన  తనిఖీలను నిర్వహించారు. స్టేషన్ పరిసరాలు, ప్లాట్ ఫాంలను, ఆగివున్న పలు రైళ్లను పరిశీలించిన ఆయన స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

బండ్లగూడ సర్పంచ్ కు షోకాజ్ నోటీసులు

రాజేంద్రనగర్: నిధుల దుర్వినియోగాని పాల్పడ్డాడన్న అభియోగంపై బండ్లగూడ సర్పంచ్ హరికృష్ణపై షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.  దీనిపై 10 రోజుల్లో  వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని   డీపీవో పద్మజరాణి తెలిపారు.  తమ విచారణలో సర్పంచ్ హరికృష్ణ  రూ.3.16 కోట్ల గ్రామ పంచాయతీ నిధులను నిబంధనలకు విరుదంగా ఖర్చు చేసినట్లు తేలిందని అన్నారు.
 

టీడీపీ కార్యకర్తల వీరంగం

నంద్యాల లోని విశ్వానగర్ లో కొందరు ఓటర్లు వైఎస్సార్సీపికి ఓటేసారన్న అనుమానంతో టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ రోజు ఉదయం కావాలనే టీడీపీ నాయకుడికి సంబంధించిన ఇసుక ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగాపెట్టి కాలని వాసులకు  అసౌకర్యం కలిగించారు. ఇదేంటని అడిగిన మహిళలను దుర్భాశలాడుతూ దాడిచేసారు.  రాములు అనే వ్యక్తి ఓ మహిళపై దాడికి పాల్పడుతుండగా అడ్డువచ్చిన ఆమె కుమారుడు శ్రీనివాసరెడ్డి పై కర్రలతో, కత్తులతో  దాడి చేసి గాయపర్చారు.
 

రూ.3కు పెరిగిన శ్రీవారి లడ్డూ కవర్‌

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ కవరు ధర పెరిగింది. ప్లాస్టిక్‌ కవర్లపై జీఎస్టీ పడడంతో కవరుపై రూపాయి పెంచి రూ.2 నుంచి రూ.3కు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. పెరిగిన ధరను బుధవారం ఉదయం నుంచి అమలుచేయనున్నట్లు వెల్లడించింది.

 

గాంధీ ఆసుపత్రిలో చేరిన గవర్నర్ 

 గవర్నర్ నారసింహన్ గాంధీ ఆసుపత్రి లో అడ్మిట్  అయ్యారు. గత కొన్ని రోజులుగా కుడికాలి కింది బాగంలో చిన్న ఆణే పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు.దీనితో  నిన్నఆయన గాంధీ ఆసుపత్రికి వచ్చి డాక్టర్స్ సంప్రదించారు. వారు  శాస్ర చికిత్స అవసరమని చెప్పారు. ఈ ఆయన రోజు రక్త నమూనాలను ఇచ్చారు. పరీక్షల అంతరం ఆపరేషన్ చేయించు కొనున్నారు.

 

రెండొందల నోటు ... రేపు విడుదల

కొత్త రెండొందల నోటును భారతీయ రిజర్వుబ్యాంక్ రేపు విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నది. చాలా రోజులుగా ఈ నోటు మీద ఉత్కంఠ నడుస్తూ ఉంది. నోట్ల రద్దు తర్వాత రెండువేలు,అయిదొందల నోట్లు మాత్రమే వచ్చాయి. ఇవి కొత్త చిల్లర సమస్యను తీసుకువచ్చాయి.అందువల్ల రెండొందల నోటు అవసరమయింది.

 

 

శిల్పా చక్రపాణి రెడ్డిపై కాల్పులు (వీడియో)

నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డిపై భూమా వర్గీయులు హత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి.నంద్యాలలో వైసీపి కార్యకర్త చనిపోవడంతో, ఈ అంతిమయాత్రలో పాల్గొనడానికి వచ్చిన  శిల్పా చక్రపాణిని టీడిపి కార్యకర్తలతో కలిసి అభిరుచి మధు అడ్డుకున్నారు. ఇదే సమయంలో ఆయనపై కాల్పులు జరిగినట్లు పమాచారం. అయితే చక్రపాణి రెడ్డికి ఎలాంటి హాని జరగలేదు. 
 

ఇసుక మాఫియా మా పొట్ట కొడుతోంది 

గుంటూరు జిల్లా మున్నంగి ఇసుక క్వారీలో కార్మికుల ఆందోళన చేపట్టారు. ఇసుకను భారీ యంత్రాల ద్వారా తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.  స్థానిక అధికార టీడిపి పార్టీ నేతల ప్రోద్బలంతో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని వారు వాపోయారు.  మా కడుపు కొట్టి భారీ యంత్రాల ద్వారా ఇసుకను తరలించడం అన్యాయమని, దీని వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ఇసుక మాఫియా యదేచ్చగా తమ పని తాము చేసుకుపోతుంటె అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని మున్నంగి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనుంచైనా ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని సీఎం కు వినతి చేశారు.
 

అర్జున్ రెడ్డి సినిమా పై వీహెచ్ ఆందోళన

అర్జున్ రెడ్డి సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఇంతకు ముందే అసెంబ్లీ వద్ద ఆందోళన చేసిన కాంగ్రెస్ నేత హన్మంతరావు, ఇవాళ సెన్సార్ బోర్డ్ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా వీహెచ్  మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమాలో అశ్లీలం ఎక్కువయిందని, దీని ద్వార యువత పెడదారి పట్టే అవకాశం వుందని అన్నారు. ఈ  మూవీని నిర్మిస్తున్నది సీఎం భందువులేనని, అందువల్లే ఎన్ని ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. హిందువుల పవిత్ర పండగ వినాయక చవితి రోజు ఇలాంటి సినిమా విడుదల అవ్వడం దురదృష్టకరమన్నారు వీహెచ్.
అలాగే  బస్సులపై ముద్దు సన్నివేశాలతో కూడిన పోస్టర్లు వేయడం వల్ల వాటిని చూస్తూ వాహనదారులు రోడ్డు ప్రమాదాలు  గురవుతున్నారని, ఇకనుంచైనా బస్సులపై ఇలాంటి పోస్టర్స్ ను అనుమతించరాదని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు వీహెచ్ తెలిపారు. 
 
 

మైనర్ బాలికను పెళ్లిచేసుకున్న అరబ్ షేక్ ల అరెస్టు ,, 

మైలార్ దేవ్ పల్లి లోని అక్బర్ నగర్ లో ఇద్దరు అరబ్ షేకుల పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు 15 రోజుల క్రితం అక్బర్ నగర్ కు చెందిన ఓ యువతిని డబ్బులిచ్చి వివాహం చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అరబ్ షేక్ కు పెళ్లి చేసుకోడానికి, వివాహ ఒప్పంద పత్రం తయారికి సహకరించిన మరో  బ్రోకర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.  
 

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే

వ్యక్తిగత గోప్యత అంశంపై సుప్రీంకోర్టు న్యాయస్థానం సంచలన తీర్సు ఇచ్చింది. వ్యక్తిగత సమాచారం అనేది  ప్రాథమిక హక్కు అని ధర్మాసనం తేల్చింది. అందువల్ల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వంతో గాని, ప్రైవేట్ సంస్థలతో పంచుకోవడం తప్పనిసరి కాదని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయాన్ని వెలువరించింది. గతంలో 1957 నాటి తీర్పును పున:సమీక్షించి వ్యక్తిగత గోప్యత అంశంలో అప్పటి తీర్పును తప్పుబట్టిన  సుప్రీం కోర్టు,  దీన్ని రాజ్యాంగం కల్పించిన హక్కుగా పేర్కొంటు మరోతీర్నునిచ్చింది..  

రేపటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు

 

 హైదరాబాద్‌: తెలంగాణలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు భారీ వర్షాలు  కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి చెప్పారు. కోస్తా జిల్లాలపై ఉపరితల ఆవర్తనం ఉన్నందున దాని ప్రభావంతో వర్షాలు తెలంగాణలో సైతం పెరుగుతాయని తెలిపారు. గత రెండు రోజులుగా అంతంతమాత్రంగానే కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు అత్యధికంగా మిర్యాలగూడ, కొణిజెర్ల, రామన్నపేటల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.