Asianet News TeluguAsianet News Telugu

ఈ క్రైం కథ తిరగబడింది, అబ్బాయిని వేధిస్తున్న అమ్మాయి

విశేష వార్తలు

  • ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన 60 ఏళ్ల వృద్దుడు
  • టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న నేరెళ్ల కేసు
  • పాతబస్తీలో అమర్ అనే యువకుడి  హత్య
  • ఇంటర్‌ విద్యార్థినిని చాందిని జైన్ దారుణ హత్య
  • ఆంధ్రా ఇసుక తెలంగాణాకు అక్రమరవాణ
  • ఇంకా ఎన్నో విశేషాలు...
asianet telugu crime news  Andhra Pradesh and Telangana
ఈ క్రైం కథ తిరగబడింది, అబ్బాయిని వేధిస్తున్న ఒక అమ్మాయి

సాధారణంగా యువకులు యువతులను వేల గాని వేల  ఫోన్లు చేసి వేధిస్తుంటారు. మాటు కాచి ఫాలో అవుతుంటారు. మాట కలుపుతుంటారు.   కానీ హైదరాబాద్ లో  సతీష్ కథ తిరగబడింది. ఒక అమ్మాయి టెలిఫోన్ వేధింపులు భరించలేక కోర్టు శరణు కోరాడు. ఒక  యువతి తనను సెల్‌ఫోన్‌లో వేధిస్తుందంటూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రోడ్ నెం.14లో నివసించే సతీష్ వ్యాపారం చేస్తుంటాడు. అయితే గత రెండేళ్లుగా ఫోన్‌లో నెట్ కాలింగ్ ద్వారా అర్థరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుఝామున 5 వరకు ఓ యువతి అతనికి  ఫోన్ చేస్తూ ఉంది. అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకుంటే పరువు తీస్తానంటూ బెదిరిస్తూ ఉంది. ఆమె ఎవరని ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పడం లేదని సతీష్ వాపోతున్నాడు. దీంతో విసుగు చెందిన కోర్టును ఆశ్రయించాడు. అతని అభ్యర్థనను మన్నించిన   న్యాయస్థానం కేసు నమోదు చేయాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాతకక్షలతో దంపతుల దారుణ హత్య

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం నాగశాల వద్ద దారుణ హత్య జరిగింది. బైక్ పై వెళుతున్న దంపతులను ఆటోలో వెంబడించిన దుండగులు అదే ఆటోతో వారి వాహనాన్ని డీ కొట్టారు. వారు కింద పడిపోగానే వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే చనిపోగా, తీవ్ర గాయాలపాలైన భార్యను హస్పిటల్ కు తరలించారు. అయితే చనిపోయిన వ్యక్తిది తిమ్మాజీపేటగా పోలీసులు గుర్తించారు. హత్యకు పాతకక్షలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.  

విజయవంతమైన తెలంగాణ అటవీ శాఖ అరుదైన ప్రయత్నం (వీడియో)

  • అంతరించి పోతున్న మూషిక జింకల జాతికి పునరుజ్జీవన ప్రయత్నం విజయవంతం
  • నెహ్రూ జూ పార్క్ లో అభివృద్ది చేసి, అమ్రాబాద్ అడవుల్లో విడుదల

తెలంగాణ అటవీ శాఖ చేసిన ఓ అరుదైన ప్రయత్నం విజయవంతం అయింది. నల్లమల అడవుల్లో గతంలో విరివిగా ఉండి, ఆ తర్వాత అంతరించే దశకు చేరుకున్న మూషిక జింకల (మౌజ్ డీర్) జాతికి అటవీ శాఖ పునరుజ్జీవనం కల్పించింది. జర్ని పంది గా కూడా పిలిచే ఈ రకమైన జంతువులు దట్టమైన ఆకుపచ్చని అడువుల్లోనే జీవిస్తాయి. అయితే అడవులు క్రమంగా పలచబడటం, వేటగాళ్ల వల్ల ఇవి క్రమంగా అంతరించే దశకు చేరుకున్నాయి. అయితే ఈ ప్రత్యేకమైన జాతిని సంరక్షించాలన్న అటవీ అధికారుల సంకల్పం ఎట్టకేలకు ఫలితాన్ని ఇచ్చింది.  అటవీ ప్రాంతం నుంచి సేకరించిన కొన్ని మూషిక జింకలను నెహ్రూ జూ పార్క్ లో ప్రత్యేకంగా సంరక్షించటంతో పాటు, ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని కేంద్ర వణ్య ప్రాణి సంరక్షణ బోర్డు నిపుణుల సహకారం కూడా ఇందుకోసం తీసుకున్నారు.  2010లో మొదలైన ఈ ప్రయత్నం అటవీ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలతో పూర్తి విజయవంతమైంది. ఆరేళ్ల తర్వాత ఈ మూషిక జింకల జాతి క్రమంగా పెరిగి 172 కు చేరింది. వీటిలో  96 మగవి, 76 ఆడవి ప్రస్తుతం అటవీ అధికారుల సంరక్షణలో ఉన్నాయి. వీటిని ప్రయోత్మకంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారులు నల్లమలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ లో కి మంగళవారం విడిచిపెట్టారు. కొద్ది రోజుల పాటు వీటిని పరిశీలించిన తర్వాత అడవిలోకి వదిలిపెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. సుమారు రెండున్నర హెక్టార్లలో సీసీ కెమెరాలు, సోలార్ ఫెన్సింగ్, నీటి సౌకర్యంతో పూర్తి రక్షిత చర్యలతో ఎన్ క్లోజర్ ఏర్పాటు చేశారు. సుమారు రెండు వారాల పాటు వీటిని గమనించి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో అడవిలోకి విడుదల చేస్తామని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎం.సి. పర్గేయిన్ వెల్లడించారు. దేశంలోనే ఇలాంటి ప్రయత్నం జరగటం ఇదే మొదటిసారని, విడతల వారీగా అన్ని మూషిక జింకలను నల్లమలలో విడిచిపెడతామని అధికారులు తెలిపారు. తాము చేస్తున్న ప్రయత్నం ఫలించి నల్లమల అడవుల్లో మళ్లీ మూషిక జింకలు బాగా విస్తరిస్తాయనే ఆశాభావాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు.

శంషాబాద్ లో రోడ్డు కోసం హోర్డింగ్ ఎక్కిన యువకుడు  
 

రోడ్డు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ దర్నా చేస్తున్న స్థానికులను పోలీసులు   అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన యువకుడు హోర్డింగ్ ఎక్కి  గందరగోళం సృష్టించిన ఘటన శంషాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే శంషాబాద్ బస్టాండ్ నుండి గ్రామానికి వెళ్ళే ప్రదాన రహదారి మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు  ధర్నాకు దిగారు. అయితే ఈ ధర్నా వల్ల ట్రాఫిక్ జామ్ కావడంతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు ధర్నాను అడ్డుకున్నారు. దీంతో రాము అనే స్థానిక యువకుడు పక్కనే వున్న అడ్వర్ టైజింగ్ హోర్డింగ్ ఎక్కి ఆత్యహత్యకు పాత్పడతానని బెదిరించాడు.  అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని హామీ ఇస్తేనే కిందికి దిగుతానని అంటున్నరాము ను నచ్చచెప్పి కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.

బిజెపి నేతల అరెస్టు

asianet telugu crime news  Andhra Pradesh and Telangana

వనపర్తి జిల్లా సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వమే అధికారంగా నిర్వహించిలని  బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మరియు   కొత్తకోట మండల నాయకులను పోలీసులు అరెస్టు చేసి వనపర్తి టౌన్ పోలీసు స్టేషన్ కు 300  మంది బీజేపీ కార్యకర్తలను తరలించారు ఈ కార్యక్రమంలో రాజవర్ధన్ రెడ్డి  రాజేందర్ రెడ్డి మాధవ్ రెడ్డి వెంకట్ రెడ్డి సాయిరాం కోటీశ్వర్  శ్రీను ఈశ్వర్ రాంమోహన్ మన్యం సురేష్ పరమేష్ తదితరులు అరెస్టు అయ్యిన వారిలో ఉన్నారు

 

ఏడేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్దుడి అత్యాచారం

asianet telugu crime news  Andhra Pradesh and Telangana

 

హైదరాబాద్ : ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేసిన ఘటన కుషాయిగూడలో జరిగింది. తన ఇంటి పక్కన ఉండే చిన్నారికి మాయమాటలు చెప్పి  తన ఇంట్లోకి తీసుకెళ్లిన యాదయ్య అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని చాక్లెట్లు ఆశ చూపాడు. అయినా కూడ పాప జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో యాదయ్యను పట్టుకుని దేహశుద్ది చేసిన స్థానికులు, పోలీసులకు అప్పగించారు. చిన్నారి ని అత్యాచారం చేసినందుకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

కంచె ఐలయ్య కు వ్యతిరేకంగా భూపాలపల్లిలో ఆర్యవైశ్యుల ధర్నా 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ప్రొపెసర్ కంచె ఐలయ్య అర్య వైశ్యులపై అభ్యంతరకరంగా పుస్తకాన్ని రచించి, ప్రచురించడాన్ని నిరసిస్తూ భూపాలపల్లి పట్టణంలో అర్య వైశ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. తమపై అవమానకరంగా పుస్తకాన్ని రాసిన ఐలయ్య వెంటనే క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు.

నకిలీ విజయ బ్రాండ్ సరుకులు తయారుచేస్తున్న విజయవాడ  పార్లర్

విజయవాడు కృష్ణా లంక, చౌదరి పేట లో విజయ మిల్క్ బ్రాండ్ ముసుగులో నకిలీ బట్టర్ మిల్క్, లసి,పెరుగు ప్యాకెట్లు తయారు చేస్తున్న వారిని టాస్క్ పోర్స్ అధికారులు కనిపెట్టారు. సాయి జోత్యి మిల్క్ పార్లర్ లో ఈ బ్రాండ్ పేరుతో నకిలీ వితయారవుతున్నాయని టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిలో వెల్లడయింది.ప్రమాదకరమైన రసాయనలు ఉపయోగించి రస్నా ప్యాకెట్స్ తయారు చేస్తున్నట్లు తేలసింది.వేల సంఖ్యలో నకిలీ సరుకును   టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

 

పంచాయతీరాజ్ డీఈఈ ఆస్తులపై ఏసిబి దాడులు

asianet telugu crime news  Andhra Pradesh and Telangana

అక్రమ ఆస్తులు కలిగివున్నాడన్న సమాచారంతో పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్  సుదర్శన్‌రెడ్డి ఇంటిపై అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటితో పాటు, ఆయన స్వస్థలం మహబూబ్ నగర్ లోని బందువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఏసిబి అధికారులు దాడులు చేశారు.  ఈ సోదాల్లో దాదాపు మూడు కోట్ల వరకు అక్రమ ఆస్తులు బయటపడ్డట్లు సమాచారం. 
 

టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న నేరెళ్ల కేసు

asianet telugu crime news  Andhra Pradesh and Telangana

సిరిసిల్ల ఇసుక దందా కు సంబంధించి నేరేళ్ల లో జరిగిన దాడిలో గాయపడిన దానయ్య,హరీష్ లకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉస్మానియా వైద్యులచే  రేపు ఉదయం 10 గంటలకు మెడికల్ ఎక్సమినేషన్ నిర్వహించాలని ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొది.  సిరిసిల్ల జిల్లా నెరేళ్ల  ఘటన పై గతంలో రిటైర్డు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ రాసిన లేఖకు  హైకోర్టు  స్పందించింది.  ఈ లేఖ ను హైకోర్టు పిల్ గా స్వీకరించింది. బాధితులకు న్యాయం చేసి,దోషుల పై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ కోర్టు ను కోరారు.దీనిపై నేరేళ్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

 

పాతబస్తిలో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ లోని పాతబస్తీ మంగళ్‌హాట్‌ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. పెద్దలకు ఇష్టం లేకుండా యువతిని పెళ్లి చేసుకున్న అమర్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. తన చెల్లెల్ని లేపుకుపోయాడన్న కోపంతో లక్ష్మణ్ అనే యువకుడు అమర్ ను కర్రలు, రాళ్లతో కొట్టి చంపాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుమేరకు కేసు సమోదుచేసుకుని,నిందితుడు లక్ష్మణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

రోడ్డు ప్రమాదంలో తల్లీ బిడ్డ మరణం

ప్రకాశం  జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన తల్లీ బిడ్డ ఒక ప్రమాదంలో మరణించారు. బంధువుల వివాహానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ఈ ప్రమాదం సంభవించింది. రాయవరానికి చెందిన  కులూకూరి కొండయ్య ఆతని భార్య మేరీ (26), కుమారుడు కౌశిక్(4)లు కంచేపల్లిలో వివాహానికి వెళ్లివస్తున్నారు.అయితే, పొదలి సమీపంలో కనిగిరి నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసి బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పి తల్లీ, బిడ్డలు బస్సు వెనుక చక్రం కింద పడి చనిపోయారు. ఈ ప్రమాదంలో కొండయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పొదలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అవంతి కళాశాల విద్యార్థుల ఆందోళన

రంగారెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. 2 రోజులుగా ఆందోళన చేస్తున్న  వారిపై కాలేజీ చైర్మన్ అవంతి శ్రీనివాస్  బెదిరింపులకు పాల్పడుతున్నారని  విద్యార్థులు తెలిపారు. బెదిరింపులను మానుకుని తమ సమస్యలపై దృష్టి సారించాలని విధ్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 

ఇంటర్మీడియట్ విద్యార్థిని చాందిని జైన్ దారుణ హత్య

asianet telugu crime news  Andhra Pradesh and Telangana

హైదరాబాద్‌ : మియాపూర్‌ మదీనాగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని  అమీన్‌పూర్‌ సమీపంలోని కొండల్లో పడేశారు.   మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థిని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న చాందిని జైన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 9న  కళాశాలకు వెళ్లిన విద్యార్థిని ఇంటికి తిరిగిరాలేదు. దీంతో చాందిని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇవాళ శశమై కనిపించిన చాందినిని చూసి బోరున విలపిస్తున్నారు. ఘటనాస్థలిని సంగారెడ్డి ఎస్పీ తో పాటు మియాపూర్ ఏసీపీ పరిశీలించారు.  

అంధ్రా ఇసుక తెలంగాణా అక్రమ రవాణ

కృష్ణా జిల్లా  మైలవరం మండలం మొర్సుమల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న  ఇసుక లారీ లను మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. లారీలను మైలవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.  ప్రభుత్వం అందరికి అందుబాటులో ఉండేవిధంగా ఇసుక ధరను నియంత్రణ చేస్తుంటే అక్రమార్కులు వక్ర మార్గాల లో సహజ సంపద ను తరలిస్తున్నారని అన్నారు. విజిలెన్స్ అధికారులు ఇక పై ఇటువంటి చర్యలను తీవ్రంగా అడ్డుకుంటారని తెలిపారు. స్వాధీనం చేసుకున్న నాలుగు లారీ ల ఇసుక విలువ ప్రస్తుత ధర ప్రకారం రెండు లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. గుంటూరు జిల్లా అచ్చంపేట, కోసురు కి చెందిన లారీ యజమానుల పై క్రిమినల్ కేస్ లు పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో విజిలెన్స్ సి. ఐ అబ్దుల్ నబీ ,బాలజీనాయక్(ఏ. జి),మైలవరం పోలీస్ సి. ఐ రామచంద్రరావు, ఎస్. ఐ రామకృష్ణ పాల్గొన్నారు

 

ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

asianet telugu crime news  Andhra Pradesh and Telangana

శ్రీ గాయత్రి విద్యా సంస్థ లెక్చరర్ల నిర్వాకంతో ఓ విద్యార్థి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఘటన చంపాపేట్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే చంపాపేట్ లోని గాయత్రి జూనియర్ కాలేజీలో  ఇంటర్  సెకండ్ ఈయర్ చదువుతున్న విద్యార్థి సంజయ్ ని ముగ్గురు లెక్చరర్లు కలిసి చితకబాదారు. ఇది అవమానంగా భావించిన విద్యార్థి తన నివాసమైన బాలాపూర్ లోని జనప్రియ అపార్ట్ మెంట్ 5 వ అంతస్తు నుండి  దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో వున్న సంజయ్ ని హాస్పిటల్ కి తరలించిన తల్లిదండ్రులు, దీనికి కారణమైన లెక్చరర్ల పై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios