విశేష వార్తలు వర్ధన్నపేట డిఎస్పీ దుర్గయ్య యాదవ్ మృతి శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ అక్రమ బంగారం చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటి సూపరిండెంట్ చింతల దశరథంపై కేసు నమోదు
నెల్లూరు అక్రమ ఫ్యాక్టరీలోపేలుడు, ఒకరి మృతి

నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేఘనూరు సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేరు బోర్డు లేకుండా నిర్వహిస్తున్న ఆ ఫ్యాక్టరీలిన బాయిలర్ ఉదయం అకస్తామత్తు పేలింది. ఈ పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న అవినాష్ అనే యువకుడు కాలిన గాయాలతో చనిపోయాడు. అవినాశ్ అదే గ్రామానికి చెందిన వాడు. పోతే,ఫ్యాక్టరీకి కొంచెందూరంలో పనిచేస్తున్న మరొక అయిదుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని స్థానికులు ఆసుప్రతికి తరలించారు. ఈ విషయం తెలిశాక పోలీసులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేశారు.
కెటిఆర్ ఆగ్రహం
బి హెచ్ ఇ ఎల్ రావూస్ హైస్కూల్ లో యూనిఫాం వేసుక రాలేదని అమ్మాయి ని అబ్బాయి ల మూత్రశాలలో నిలబెట్టడంపై రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఆగ్రహం వక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విాట్ ద్వారా పోలీసుల దృష్టి కి తీసుకువచ్చారు. ఈ విషయం మీద ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన చర్య తీసుకోవాలని కోరతానని చెప్పారు.

ఒక బాలికకు జరిగిన ఈ అవమానాన్ని బాలల హక్కుల కమిషన్ గౌరవ అధ్యక్షుడు అచ్చుత రావు వెలుగులోకి తీసుకువచ్చారు.మొదట అమ్మాయి తండ్రి అమిరి శెట్టి రామకృష్ణ బాలల హక్కుల సంఘానికి తన కూతరుకు పాఠ శాల విధించిన శిక్ష మీద ఫిర్యాదు చేశారు. తన కూతురు బి హెచ్ ఇ ఎల్ రావూస్ హైస్కూల్ లో చదువుతున్నదని,యునిఫాం వేసుక రాలేదన్నకారణంతో అబ్బాయిల మూత్ర శాలలో చాలా పు నిలబెట్టారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ నవ్య దృష్టికి తీసుక వెళ్లినా స్పందించక పోగా సిబ్బంది నే సమర్దించారని ఆయన చెప్పారు.
ఈ ఘటన తో మానసికంగా ఆవేదన చెందుతున్న చిన్నారి తాను జన్మ లో స్కూల్ కి వెళ్ళనని చెబుతున్నదని తండ్రి ఆరోపించారు.
రావూస్ హైస్కూల్ వారు చేసిన ఈ నిర్వాకం పోక్సో చట్టం ప్రకారం నేరంగా పరిగణించ వచ్చునని అచ్యుత రావు తెలిపారు. ఆ మేరకు బాలల హక్కుల సంఘం రావూస్ హైస్కూల్ యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నదని ఆయన తెలిపారు. నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన పై విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పంఘం కమిషన్ గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు కోరారు.
స్కూల్ బస్సుల మధ్య పోటీ, తృటిలో తప్పిన ప్రమాదం
కంకిపాడు మండలం మంతెన వద్ద తృటి ఒక స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పంది. చైతన్య స్కూల్ బస్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం లో విజయవాడ కు చెందిన రవీంద్ర భారతి స్కూల్ బస్ అదుపు తప్పింది. రోడ్ పక్కనే ఉన్న దిమ్మలను గుద్దుకొనింది. అయితే బస్సు బోల్తాపడ లేదు. ఒక పక్కపోయి ఒరిగి ఆగిపోయింది. ప్రమాదo జరిగిన సమయం లో బస్ లో 55 మంది విద్యార్దులున్నారు. స్థాననికుల సాయం తో విద్యార్దులను కిందకు దించారు. ప్రమాదం జరిగిన తీరు పై విద్యార్దుల తల్లి దండ్రుల ఆగ్రహం వ్కక్తం చేశారు.
5 కోట్ల విలువయిన డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్న జవాన్ల అరెస్ట్

సుమారు 5 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ను తరలిస్తున్న రాజు షేక్, ఫూల్ సింగ్ అనే ఇద్దరు జవాన్లను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు డెహ్రడూన్‌లో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి కారులో తరలిస్తున్నారు. సోదా చేస్తున్నపుడు మేం జవాన్లం అంటూ వారు వాగ్వాదానికి దిగారు. హెరాయిన్‌తో పట్టుపడిన జవాన్లను, మూడో వ్యక్తిని డెహ్రాడూన్ తరలించారు. వీరి మీద మాదక ద్రవ్యాల అక్రమ రవాణ 8/21 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నివేదిత తెలిపారు.
ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో కుప్పకూలిన ప్లైఓవర్
ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో భారీ ప్రమాదం సంభవించింది. నగరం లోని ఓ ప్లై ఓవర్ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా శిథిలాల క్రింద క్షతగాత్రులు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు శిథిలాలను తొలగిస్తన్నారు.
భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్ లోని సోఫియాన్ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. మరో టెర్రరిస్టును భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరులో పిడుగుపాటుతో ఇద్దరు చిన్నారుల మృతిచిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని చిన ఈటి పాకంలో పిడుగుపాటు సంభవించి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. బస్ స్టాప్ వద్ద పడిన ఈ పిడుగు దాటికి మరో ఇద్దరికి తీవ్ర గాయాలకు లోనయ్యారు. వారిని సమీప హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పట్టుబడ్డ బంగారం

హైదరాబాద్ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టులో మరోసారి భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. ముంబై నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న 75 లక్షల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
చర్లపల్లి జైలు సూపరిండెంట్ పై కేసు నమోదు

చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటి సూపరిండెంట్ చింతల దశరథంపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. చర్లపల్లి జైలు లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న తన భర్త జాన్ అబ్రహంను కలవడానికి వచ్చినపుడు జైలు సూపరిండెంట్ దశరథం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని షీరా జాని అనే మహిళ కుషాయిగుడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో దశరథంపై సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుషాయిగుడ పోలీసులు తెలిపారు.
వర్ధన్నపేట డిఎస్పీ దుర్గయ్య యాదవ్ మృతి

వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట డిఎస్పీ దుర్గయ్య యాదవ్ ఇవాళ మృతి చెందారు. మలక్ పేట్ లోని యశోద హాస్పిటల్లో గత వారం రోజులుగా స్వైన్ ప్లూ తో భాదపడుతూ చికిత్స పొందుతున్నారు. కానీ ఇవాళ ఆయన అరోగ్య పరిస్థితి పూర్తిగి క్షీణించింది.స్వైన్ ప్లూ కారణంగా కాలేయం పూర్తిగా పాడైపోయి మరణానికి దారి తీసిందని వైద్యులు తెలిపారు.
