హి౦డిస్ ఫ్యాక్టరీ ముందు గొర్రెలతో బాధితులు ధర్నా

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana
Highlights

  • చిట్యాలలో హి౦డిస్ ఫార్మాస్యూటికల్ ఫాక్టరీ ముందు బాధితుల ధర్నా
  • టోలీచౌకీలో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు
  • వికారాబాద్  జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం
  • చేవెళ్ల వద్ద రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

హి౦డిస్ ఫ్యాక్టరీ ముందు గొర్రెలతో బాధితులు ధర్నా

చిట్యాల మండలంలోని వెలిమినేడు దగ్గరలోగల 'హి౦డిస్ ఫార్మాస్యూటికల్ ఫాక్టరీ' కాలుశ్యపు నీటి వల్ల గొర్రెలను కోల్పోయిన బాధితులు వారి వందలాది గొర్రెలు జీవాలతో కలిసి ప్రజా పోరాట సమితి (పి.ఆర్.పి.ఎస్) ఆధ్వర్యంలో బాధిత ప్రజలు ఫాక్టరీ గేట్ ముందు ధర్నా నిర్వహి౦చారు.
         ఈ ధర్నాలో పాల్గొన్న పి.ఆర్.పి.ఎస్. రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ "మదపుటేనుగు లాంటి మదమెక్కిన హి౦డిస్ ఫాక్టరీ యాజమాన్య౦ అధికారులను, ప్రజా ప్రతినిధులను డబ్బుతో కొనేస్తూ హద్దూ అదుపూ లేకుండా విషజలాలను, విషవాయువులను వెదజల్లుతుండడం వల్లనే విషపునీరు త్రాగి మెట్టు సైదులు కుటుంబ౦ యొక్క 3 గొర్రెలు చచ్చాయనీ ఇందులో రెండింటిని యాజమాన్యం మటుమాయ౦ చేసి౦దనీ, ఈ రోజు గొర్రెల చావుకు కారణమైన ఫాక్టరీ రేపు మనుషుల చావుకు కూడా కారణమౌతు౦ది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పి.సి.బి) ఇ.ఇ. జవహర్‌లాల్ విచారణ జరిపి, యాజమాన్యానికి లొంగి పోయి చేతులు దులుపుకున్నారు. వారు లొ౦గి పోకపోతే పి.సి.బి. అధికారులు నిజాయితీగా ఉంటే తక్షణం ప్రాణాంతకమైన హి౦డిస్ ఫాక్టరీని మూసెయ్యాలి. జిల్లా అధికారులపై ప్రజలకు నమ్మక౦ లేదు కాబట్టే ఆధారాలతో హైకోర్టులో కేసు వేయనున్నామని, ప్రాణాంతకమైన హి౦డిస్ ఫాక్టరీని మూసేయించే వరకు పోరాడుతామని" ప్రజా పోరాట సమితి (పి.ఆర్.పి.ఎస్.) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి తెలిపారు.
         ఫాక్టరీ చుట్టూరా ఉన్న గ్రామాల బాధిత ప్రజలు పి.ఆర్.పి.ఎస్. నాయకులకు ఫాక్టరీ నుండి వస్తున్న కాలుశ్యపు విష జలాలను చూపించారు. ఈ ఆధారాలతో హైకోర్టులో కేసు వేసి ఫాక్టరీని మూసేయి౦చుదామని బాధితులకు హామీ ఇచ్చారు.
         ఈ ధర్నాలో గొర్రెలు చనిపోయిన గొర్లకాపర్లు మెట్టు సైదులు, మెట్టు రమేష్, మెట్టు వెంకన్న, పి.ఆర్.పి.ఎస్. నాయకులు నీలకంఠ నరేష్, నాగిళ్ళ యాదయ్య, బొల్ల శ్రీనివాస్, రుద్రవరం నరసింహ, ఐతగాని రవిగౌడ్, అర్రూరి శ్రీశైలం, ఎం.డి.జహంగీర్, భిల్లపాటి లక్ష్మారెడ్డి, సిధ్ధగోని శ్రీకా౦త్, మేడి కృష్ణయ్య, అందె భగవంత, మేడి అచ్చయ్య, పున్న మురళి తదితరులు పాల్గొన్నారు.

మరో ఇండిగో విమానానికి ప్రమాదం 

చత్తీస్ గడ్ నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది.  రాయ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానం టేకాఫ్‌ అయిన వెంటనే ఒక పక్షిని ఢీకొంది. దీంతో అప్రమత్తమైన పైలట్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి రాయ్పూర్ విమానాశ్రయంలోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదని, ప్రయాణికులను సురక్షితంగా హైదరాబాద్ కి చేరుస్తామని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
 

నగరంలో ఉగ్ర కదలికలు
 

హైదరాబాద్ లో మళ్లీ ఉగ్రవాద కదలికలు మొదలయ్యాయి. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న నగరంతో మళ్లీ ఐసీస్ ఉగ్రవాద జాడలు బయలపడ్డాయి. నగరం లోని టోలీచౌకి లో తలదాచుకుంటున్న ఐసిస్ ఉగ్రవాదులు అబ్దుల్ ఖయీం, పయజుల్లా,మాలిక్ లను ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. యూపీ లో ఫేలుళ్లకు పాల్పడి గత నాలుగు సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న ఖయూం ను మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.దేశంలో పలు విద్వంసాలకు వ్యూహరచన చేసిన ఇతడు ఇపుడు హైదరాబాద్ లో ప్రత్యక్షమవడంతో ఇక్కడ ఏమైనా విద్వంసానికి ప్లాన్ చేశారా అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. 
 

ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యకు దారితీసిన సీనియర్ల వేధింపులు

ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట బాలికల హాస్టల్‌లో శనివారం ఉదయం ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యా చేసుకోబోయారు.  శిరీష, సాయినిధి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సీనియర్లు వేధించడంతో విద్యార్థినులు ఆత్మహత్యయత్నం చేశారని తోటి విద్యార్థులు తెలిపారు.

ఆర్మీ వ్యాన్- కారు ఢీ... బాలిక మృతి

 రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామ సమీపం లో హైద్రాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల వైపు నుంచి వేగంగా వస్తున్న ఇండికా కారు పంచర్ కావడంతో అదుపుతప్పి ఎదురుగా  వస్తున్న మిలీటరీ డీసియం వ్యాను డికొట్టింది. దీంతో కార్లో ఉన్న 4సంవత్సరాల పాప అక్కడి అక్కడే మృతి చెందగా, మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనూ అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలపాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మైనర్ బాలికపై అత్యాచారం

ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే  వికారాబాద్ జిల్లా కుల్క చర్లకు చెందిన గోపాల్ అనే వ్యక్తి అదే గ్రమానికి చెందిన మైనర్ బాలికపై కన్నేసాడు. తనకు పెళ్లైన విషయం దాచి పెట్టి మైనర్ బాలిక ను లోబర్చుకున్న అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి మాట ఎత్తేసరికి మొఖం చాటేసాడు. దీంతో మోసపోయానని గ్రహించిన భాదితురాలు  తనకి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.

loader