కేంద్ర మంత్రి సుజనా చౌదరి కి తెలంగాణ పోలీసుల షాక్

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana
Highlights

విశేష వార్తలు

  • కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన షాపింగ్ మాల్ పై క్రిమినల్ కేసు
  • కాకినాడ కలెక్టరేట్  ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
  • ఏసిబి వలలో ఐసిడిఎస్ ఉద్యోగి వెంకట నారాయణ రెడ్డి
  • రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదం, ఓ యువకుడి మృతి
  • మణిపూర్‌లో స్వల్ప భూకంపం

 విజయవాడలో పందెం రాయుళ్ల అరెస్ట్ 

విజయవాడ సమీపంలోని పెద పులిపాక లో పందెం రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎసీపీ మురళీధర్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి.  దీంతో కోడిపందేలు నిర్వహిస్తోన్న 28 మంది పట్టుబడ్డారు. వారి వద్దనుంచి రెండు పందెం కోళ్లు, 24 సెల్ ఫోన్లు,  41 బైక్ లు, 25 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తప్పుడు వార్తలు రాస్తున్న వెబ్ సైట్ల ఆట కట్టిస్తాం

ప్రచారం కోసం తప్పుడు రాతలు రాస్తున్న, అశ్లిల వెబ్ సైట్స్  పై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు పై సైబర్ క్రైమ్ పోలీసుల కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ 67,67ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలో ఇలాంటి వెబ్ పైట్ల నిర్వహకులపై చర్యలు తీసుకోడానికి ఆధారాలు సేకరిస్తున్నారు.ఇకపై ఇలాంటి వెబ్ సైట్ల పై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు.  

కేంద్ర మంత్రి సుజనా చౌదరి కి తెలంగాణ పోలీసుల షాక్

కేంద్ర మంత్రి సుజనా చౌదరి కి చెందిన షాపింగ్ మాల్ పై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే 5 రోజుల క్రితం విజయ్ మోహన్ అనే  వినియోగదారుడు సుజనా మాల్ లో అక్రమంగా పార్కింగ్ వసూళ్లు చేస్తున్నారని పోలీసులకు పిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులు ఇవాళ ఈ మాల్ పై 420,188 ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.  

విజయవాడలో గంజాయి ముఠా అరెస్ట్

విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను   పట్టుకున్నారు. వారు అత్యంత పకడ్భందీగా ఆయిల్ ట్యాంకర్ లో తరలిస్తున్న గంజాయిని రామవరప్పాడు కూడలి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీలో ఒరిస్సా నుంచి చెన్నైకి తరలిస్తోన్నదాదాపు 45 లక్షల విలువైన 850 కేజీల గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ గంజాయి తో పాటు, తరలింపుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  
 

బస్సు బోల్తాపడి ఆరుగురికి గాయాలు

క్రిష్ణా జిల్లా: ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది.  ప్రిన్స్ టూరిస్ట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు బోల్తాపడటంతో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంతోని చిన ఆవుటపల్లి లో ఆస్పత్రికి తరలించారు. బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్  వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.             

పోలీస్ స్టేషన్ లో మహిళ ఆత్మహత్యాయత్నం

వనస్థలిపురంలోని పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ ఆత్మహత్యామత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే  రేణుక అనే మహిళ తన భర్త రెండవ పెళ్లి చేసుకుని తనను పట్టించుకోవడం లేదని పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే ఈ  కేసును పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తూ భాదిత మహిళ పోలీస్ స్టేషన్ లోనే బ్లేడ్ తో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
దీంతో తీవ్ర రక్త స్రావం అవుతుండటం తో పోలీసులు ఆమెను వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
 

వైన్ షాప్ ఏర్పాటును అడ్డుకున్న ఎమ్మెల్యే

పాతబస్తిలోని కుర్మగూడలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న మద్యం దుకాణాన్ని స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్, కార్పొరేటర్లు సమీనా, ముజఫ్ఫార్ హుస్సేన్ లతో కలిసి అడ్డుకున్నారు. వీరి ఆందోళనతో సంఘటన స్థలానికి చేరుకున్నమాదన్నపేట్ పోలీసులు వైన్ షాప్ యజమానితో మాట్లాడి ఖాళీ చేయిస్తానని వారికి హామీ ఇవ్వడంతో ఆందోళర విరమించారు.                        

కాకినాడ కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఘోరం జరిగింది. కలెక్టరేట్ గేట్ వద్ద ఓ గుర్తు తెలియని మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ మహిళ 70 శాతం కాలిపోవడంతో  ఆస్పత్రికి చేరేలోపే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈమె వయసు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.
అయితే కలెక్టరేట్ కు, డిఎస్పి ఆపీసులు అతి సమీపంతో ఈ ఆత్మహత్యాయత్నం జరిగింది. దీంతో పోలీసులు ఆమెకు ఏదైనా ప్రభుత్వ పరంగా సమస్యలు ఎదురయ్యాయా, లేక వ్యక్తిగత సమస్యల వల్ల మరణించిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. 
 

మెడికల్ ఎమర్జెన్సీ తో విమానం అత్యవసర ల్యాడింగ్
 

మస్కట్ నుండి బ్యాంకాక్ వెళుతున్న విమానం ఒకటి మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది.  ఒమన్ దేశానికి చెందిన అల్ఫారి షమి అల్ (63) తీవ్ర అస్వస్థతకు గురవగా అత్యవసరంగా ల్యాడింగ్ చేశారు. అతడిని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిసప్పటికి ఫలితం లేకుండా పోయింది. చికిత్స అందిస్తుండగా అతడు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

ఏసిబి వలలో మరో అవినీతి అధికారి

అనంతపురం : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఐసిడిఎస్ ఉద్యోగి వెంకట నారాయణ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కోవూరు నగర్ లోని ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏడు ఎసిబి బృందాలు దాడులు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచి కోసాగుతున్నఈ తనికీల్లో దాదాపు 50 కోట్ల ఆస్తులను అధికారులు గుర్తించినట్లు సమాచారం.

మణిపూర్‌లో భూకంపం

మణిపూర్‌ రాష్ట్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఉక్రుల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 7.18 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించనలేదని అధికారులు తెలిపారు.   గడిచిన మూడు నెలల్లో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో భూకంపం సంభవించడం ఇది నాల్గొవసారి కావడం కాస్త ఆందోళన కల్గించే అంశం.

రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదం, ఓ యువకుడి మృతి

 

రాజమహేంద్రవరంలోని  ఆర్టీసీ  కాంప్లెక్స్   రోడ్   ఎస్వీజి మార్కెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడటంతో కారులో ఉన్న ముగ్గురు యువకుల్లో ఒకరు మృత్యువాత పడగా, మరో ఇద్దరు యువకులకు  తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయనడిన యువకులను ఆస్పత్రికి తరలించారు.
అయితే ప్రమాదానికి  గురైన  కారు విజిలెన్స్  డీఎస్పీ మోహన్ దిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో  మరణించిన యువకుడు డీఎస్పీ కుమారుడు వంశీ కృష్ణ కాగా, గాయపడిన యువకులు అతడి స్నేహితులుగా పోలీసులు తెలిపారు. 

 

loader