Asianet News TeluguAsianet News Telugu

జగన్ డిశ్చార్జ్ పిటిషన్ విచారణ 22కు వాయిదా

విశేష వార్తలు

  • జగన్ డిశ్చార్జ్ పిటిషన్ విచారణ 22కు వాయిదా
  • మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
  • మలక్ పేట పోలీసులో హెచ్చార్సీలో ఫిర్యాదు
  • కృష్ణాజిల్లా కంచికచర్ల  వద్ద ప్రమాదం, ఐదుగురు విద్యార్థులకు గాయాలు 
  • వినాయక నిమజ్జనం లో షి బృందాలకు చిక్కిన 30 మంది పోకిరీలు
  • ఇంకా ఎన్నో...
asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

జగన్ డిశ్చార్జ్ పిటిషన్ విచారణ  22కు వాయిదా

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

అక్టోబర్ నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్న వైసిపి అధినేత జగన్ సీబీఐ కోర్టులో నేడు తన మీద  నడుస్తున్న  కేసులనుంచి విముక్తి కోరుతూ  డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. రాంకీ, వాన్ పిక్, జగతి పబ్లికేషన్ పెట్టుబడుల వ్యవహారంలో ఛార్జిషీట్ నుంచి తన పేరు తొలగించాలని ఆయన కోర్టును కోరారు. అయితే జగతి పబ్లికేషన్ పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. పెట్టుబడిదారులను జగన్ మోసం చేశారని జగన్ పాత్రకు సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని సీబీఐ తన కౌంటర్ లో పేర్కొంది. వైస్ జగన్ డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ ను సిబిఐ కోర్టు ఈ నెల 22  కి వాయిదా వేసింది.

తిరుమల మఠంలో అపచారం

తిరుమలలోని ప్రతివాది భయంకర్ మఠంలో పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం తనిఖీలు చేపట్టి అవాక్యయ్యారు.  మఠంలో పెద్ద ఎత్తున గుట్కా, పాన్‌పరాగ్‌ పొట్లాలను పోలీసులు కొనుగొన్నారు.ముందస్తు సమాచారం మేరకు తిరుమల గోగర్భం ప్రాంతంలోని ఈ  మఠంలో పోలీసులు దాడులు చేశారు. పవిత్రమైన ప్రదేశంలో నిషేధిత వస్తువులు కలిగి ఉండడంపై పోలీసులు కేసు నమోదు చేశారు.మఠం నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.

మలక్ పేట పోలీసులపై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

హైదరాబాద్, మలక్ పెట్ సిఐ గంగిరెడ్డి , ఎస్సై రంజిత్ పై చర్యలు తీసుకోవాలంటూ ముసారాంబాగ్ కు చెందిన కొందరు స్థానికులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లోపిటిషన్ వేశారు. ఈ నెల 4న అరుణ్ అనే విద్యార్థిని అకారణంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చితకబాదారని ఈ విషయంపై ఏసీపీ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వారు కమిషన్ కు వివరించారు.  దీనిపై స్పందించిన హెచ్చార్సీ నవంబర్ 11లోగా నివేదిక సమర్పించాలని ఈస్ట్ జోన్ డీసీపీకి దేశాలు జారీ చేసింది.(ఫోటో సింబాలిక్ గా వాడింది)

 నిర్మల్ కలెక్టొరేట్ ఆస్తుల జప్తు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం బామ్ని గ్రామానికి సంబంధించిన భూసేకరణ  (2004) వ్యవహారం మీద ఈ రోజు లో కోర్ట్ లో విచారణ జరిగింది. రు.  రు. 12,84,970- విలువైన కలెక్టర్ ఆస్తులను కోర్ట్ కు అటాచ్ చేస్తూ నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జ్ సంతోష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీనితో  కలెక్టర్ ఆఫీస్ లోని ఫర్నీచర్, కంప్యూటర్లను కోర్ట్ సిబ్బంది జప్తు చేసుకున్నారు.బామ్ని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఎస్సారెస్సీ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయారు. వారికి నష్ట పరిహారం ఇంకా చెల్లించాల్సి ఉంది. అందుకే కేసు కోర్టు కొచ్చింది.

 విజయవాడలో రోహింగ్యా మద్దతు ర్యాలీకి అనుమతి నిరాకరణ

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

విజయవాడలో శుక్రవారం నాడు  నమాజ్ అనంతరం  మయన్మర్ లోరోహింగ్యా ముస్లిమ్ ల దారుణ ఉచ కోతకు నిరసనగా 10 ముస్లిమ్ సంఘాల ఆధ్వర్యంలో భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసులు ర్యాలీ కి అనుమతి నిరాకరించారు. ఈ విషయంలో పంజా సెంటర్ నుండి ర్యాలీ గా వెళ్తున్న వారిని అడ్డుకోవడం తొ నిరసన కారులకు పోలిస్ లకు మధ్య సంఘర్షణ చోటు చేసుకుంది మత పెద్దలు కలగ జేసు కొని పరిస్తితి అదుపులోకి తెచ్చారు.నెల్లూరులో ముస్లింలు శాంతియుతంగా, ఆజాద్  సెంటర్ నుండీ పెద్ద ర్యాలీ గా బయల్దేరి గాంధీబొమ్మ సెంటర్  మీదుగా కలెక్టర్ ఆఫీసుకు  చేరుకుని మెమోరాండం ఇవ్వడం జరిగింది(ఫోటో).

 మెదక్ జిల్లాలో ఆర్టిసి బస్సు తగిలి ముగ్గురు మృతి

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

మెదక్  జిల్లా నర్సాపూర్‌ మండలం కొండాపూర్‌ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.  ఆర్ టిసి బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు బైక్ లను ఢీకొట్టింది. ఫలితంగా బైకు మీద  ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరిని నర్సాపూర్ కు చెందిన మీర్జాసల్మాన్‌బేగ్‌, ఎండి అజ్మత్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీడియా మీద  రెస్టరెంట్ బౌన్సర్ల దాడి

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి, భర్త రాజ్‌కుంద్రాతో కలిసి ముంబయిలో బాస్టియన్‌ రెస్టారెంట్‌కి వెళ్లింది. ఈ విషయం తెలిసి ఫొటోగ్రాఫర్లు రెస్టారెంట్‌ వద్దకు చేరుకున్నారు. శిల్పా, రాజ్‌లు కారులో నుంచి దిగగానే ఫొటోగ్రాఫర్లు గబగబా ఫొటోలుతీశారు. ఇందుకు రాజ్‌, శిల్పా కూడా సహకరించారు. కానీ రెస్టారెంట్‌ వద్ద ఉన్న బౌన్సర్లు మాత్రం అత్యుత్సాహం చూపారు.  వారి ఫొటోలు తీసినందుకు సోను, హిమాన్షు అనే ఇద్దరు ఫొటోగ్రాఫర్లపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత  పోలీసులు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు.

 

వివాదాస్పద హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ పై సైదాబాద్ లో కేసు 

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

తన సెలూన్ ప్రచారం కోసం హిందూ దేవుళ్లను అవమానపరుస్తూ వివాదాస్పద రీతిలో ప్రకటనలు ఇచ్చిన హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను కించపర్చేలా జావేద్ కు సంభందించిన సెలూన్ ప్రకటన ఉందని సైదాబాద్ కు చెందిన న్యాయవాది కరుణా సాగర్  పోలీస్ స్టేషన్ లో  పిర్యాధు చేశాడు. దీంతో పోలీసులు హబీబ్ పై  ఐపీసి 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
 

నాచారంలో ప్లాస్టిక్ ఫర్నిచర్ మ్యానుప్యాక్చర్ అసోసియేషన్ సభ్యుల ఆందోళన (వీడియో)

నాచారం  పారిశ్రామిక వాడలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న టీఎస్ & ఏపీ ప్లాస్టిక్  ఫర్నిచర్ మ్యానుప్యాక్చర్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ ఆందోళనను ఉదృతం చేశారు.  వారి నిరాహార దీక్షకు ప్రభుత్వం స్పందించక పోవడం తో ఆగ్రహించిన రోడ్డుపై బైఠాయించి ప్లాటిక్ ఛైర్స్ ను కాల్చివేసారు. ఈ ఆందోళనతో నాచారం ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్లాస్టిక్ అసోసియేషన్ సభ్యులను అరెస్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఆటో పల్టీ కొట్టిన ఘటనలో 5 గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు (వీడియో)

కృష్ణాజిల్లా కంచికచర్ల బై పాస్ రోడ్ నందు విజయవాడ నుండి పెనుగంచి ప్రోలు గుడివద్దకు వెళ్తున్న ఆటో చెవిటికల్లు బై పాస్ క్రాస్ వద్దకు రాగానే అదుపుతప్పి పల్టీ కోటింది 
ఈ ఘటనలో విజయవాడకు చెందిన ఒక ప్రైవేట్ కాలేజీ కు చెందిన విద్యార్థులు 5 గురు తీవ్రంగా గాయపడగా 108 లో వారిని విజయవాడకు తరలించారు పోలీస్ లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

మెక్సికోలో భారీ భూకంపం

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

మెక్సీకోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.0 గా నమోదైంది. సముద్ర గర్బంలో 35 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో మెక్సికో తో పాటు మరో 8 దేశాలకు సునామి హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. 
 

రాజధాని ఎక్స్ ప్రెస్ లో అక్రమ బంగారం రవాణ

ఢిల్లీ నుండి బెంగుళూరుకు రాజధాని ఎక్స్ ప్రెస్ లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జీఫిఆర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమృత్ సర్ నుంచి 4.5 కిలోల బంగారాన్ని డిల్లీకి చేర్చి, అక్కడ్నుంచి బెంగళూరుకు తరలిస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కారు నిందితులు. వీరి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని  కస్టడీకి తరలించారు.
 

 నిరుద్యోగ జేఏసి పాదయాత్ర

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

కేయూ నుంచి ఓయు వరకు నిరుద్యోగ జేఏసి చేపడుతున్న మెగా డిఎస్సీ మహాపాదయాత్ర కు మద్దతు పలికి. సహకరిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యకు జెఏసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపింది.వరంగల్ లోని రఘునాథపల్లి, జనగామలలో కాంగ్రెస్ శ్రేణులను, విద్యార్థి సంఘాలు,  నిరుద్యోగులను కదిలించి వారు యాత్రలో పాల్గొనేలా  పొన్నాల  కృషి చేసారని జేఏసి నేతలు పేర్కొన్నారు.  

నిమజ్జనంలో వేధింపుల పర్వం

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

హైదరాబాద్‌: వినాయక నిమజ్జనాల చివరి రోజు మహిళలపై వేధింపులకు పాల్పడిన పోకిరీల్ని షి బృందాలు పట్టుకున్నాయి. నగర షి బృందాల ఇన్‌ఛార్జి స్వాతిలక్రా తెలిపిన వివరాల ప్రకారం... షి బృందాల నిఘాలో ట్యాంక్‌బండ్‌తో పాటు ఎస్‌ఆర్‌నగర్‌, చార్మినార్‌, ఫలక్‌నుమా, మెహిదీపట్నం, చాదర్‌ఘాట్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో పోకిరీల వెకిలి చేష్టలు బహిర్గతమయ్యాయి. మహిళలపై పూలు, కాగితాలు విసరడం, నీళ్లు చల్లడంతో పాటు ఈలలు వేయడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అనుసరించడం, తెలియకుండా చిత్రాలు తీయడంలాంటి చేష్టలను షి బృందాలు రికార్డు చేశాయి. ఈ క్రమంలో 30 మందిని పట్టుకున్నాయి. వారిలో ఎనిమిది మందిని మైనర్లుగా గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios