Asianet News TeluguAsianet News Telugu

ట్రాఫిక్ విధుల్లో నెటిజన్లు

విశేష వార్తలు

  • ట్రాఫిక్ పోలీసుల అవతారం ఎత్తనున్న నెటిజన్లు
  • రైలుకింద పడి అనంతపురంలో యువకుడి ఆత్మహత్య 
  • కీసర సమీపంలో కుప్పకూలిన రక్షణ శాఖ విమానం
  • నేటి నుంచి ఏపిలో  నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు
  • గన్ మిస్ ఫైర్ ఘటనలో మంత్రి గన్ మెన్ మృతి
asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

అనంతపురం జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్

అనంతపురం జిల్లాలో కరుడుగట్టిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల నుంచి రూ.40 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పది మంది నిందితులపై ఏపీ, కర్నాటక, తమిళనాడులో 32 కేసులు ఉన్నట్లు అనంతపురం ఎస్పీ తెలిపారు. వీరి నుంచి మరింత సమాచారం కోసం విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

నెటిజన్లు కూడా ట్రాఫిక్ విధులు నిర్వర్తించవచ్చు

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

హైదరాబాద్ లో ఇకపై ట్రాఫిక్ విధులను ట్రాఫిక్ పోలీసులే కాదు నెటిజన్లు కూడా నిర్వర్తించనున్నారు. ఈ అవకాశాన్ని ట్రాఫిక్ విభాగం హైదరాబాద్ ప్రజలకు కల్పించింది. ఇది ఎలా అంటే ట్రాఫిక్ నిభందనలు పాటించని వారిని పోలీసులే పట్టుకోవాల్సిన అవసరం లేదు అది గమనించివారు ఎవరైనా దాన్ని ఫోటో తీసి పోలీసులకు పంపవచ్చు. వీటి ఆధారంగా కూడ ఉల్లంఘనధారులపై చర్యలు తీసుకునేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. దీనికోసం నెటిజన్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్ అకౌంట్ @HYDTP కి ఫోటో ట్యాగ్ చేస్తే చాలు. పోలీసులు వారి పని వారు చేస్తారు.

చదువు భారమై యువకుడి ఆత్మహత్య 

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

చదువును భారంగా భావించిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పామిడి ప్రాంతానికి చెందిన అక్మల్ అనే యువకుడు బిటెక్ చదువుతున్నాడు. అయితే ఇతడు చదువులో వెనుకబడటంతో తీవ్ర మనస్థాపానికి గురై, కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉంటున్నాడు. అయితే ఇవాళ పామిడి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్మల్ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.  

పొలాల్లో కూలిన రక్షణ శాఖ విమానం
 

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

కీసర సమిపంలో ట్రైనింగ్ విమానం ఒకటి కుప్పకూలింది. అంకిరెడ్డిపల్లి క్రషర్ మిషన్ వద్ద పొలాల్లో విమానం కూలడంతో శకలాలు మంటల్లో చిందమందరగా పడ్డాయి. హకీంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన పది నిమిషాలకే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫైలెట్ లతో పాటు మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు.               

మంత్రి ఆదినారాయణ రెడ్డి గన్ మెన్ మృతి

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ చంద్రశేఖరరెడ్డి అకస్మాత్తుగా మరణించిన సంఘటన ఇది. కడప జిల్లాలో చంద్రశేఖరరెడ్డి తన చేతిలో ఉండే గన్ ను శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయినట్లు చెబుతున్నారు. ఆ గన్ పేలడంతో గన్ మెన్ తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే కడపలోని హిమాలయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 
మంత్రి గన్ మెన్ మిస్ ఫైర్ కారణంగా మరణించిన ఘటపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపడితే కానీ తెలిసే అవకాశం లేదు. అయితే ఇది ఎలా జరిగిందన్నదానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుమల రోడ్డు మీద ప్రమాదం

తిరుమలలో బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. 12-13 మలుపు వద్ద సుమో  బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. గరుడసేవ అనంతరం తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

నేటి నుంచి ఏపిలో నో హెల్మెట్ నో పెట్రోల్

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారుల రక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు పెట్రోల్ పోయరాదని పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే నో హెల్మెట్ నో పెట్రోల్ అన్నమాట. అంతే కాకుండా కారులో ప్రయాణించే వారు విధిగా సీటు బెల్టు పెట్టుకోవాలని ఆదేశించింది. ఈ నిభందనలను నేటి నుంచి కఠినంగా అమలుచేయనున్నట్లు, దీని అమలుకోసం అధికారిక తనిఖీలు నిర్వహించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios