గుంటూరులో కుక్కల దాడితో బాలుడి మృతి

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఊర కుక్కల గుంపు దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలై మృతి చెందాడు.కొద్ది సేపటి క్రతమే హ్యాపీగా ఆడుకున్న కొడుకు ఇంతలోనే మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
 

శంషాబాద్ లో యువతి మిస్సింగ్

శంషాబాద్ లో ఓ యువతి మిస్సింగ్ మిస్టరీ గా మారింది. శంషాబాద్ లో ప్యామిలీతో కలిసి నివాసముంటున్న జాబిలీ వర్మ అనే యువతి నిన్న ఆఫీస్ కి వెళుతున్న అంటూ ఇంటి నుండి బయటకు వెళ్లింది.అయితే రాత్రి అయిన ఇంటికి రాకపోడం తో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అచినా యువతి ఆచూకీ దొరక్కపోవడంతో వారు హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై అక్టోబర్ 3 లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
 

బాచుపల్లిలో పాతనేరస్థుడి అరెస్ట్
 

పట్టపగలే ఇళ్ళలో చోరీలకు పాల్పడుతున్న చేప్యాల గోపాల్‌  అనే పాత నేరస్థుడిని బాచుపల్లి పోలిసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద వున్న 6 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి, రెండు లాప్ టాప్ లు, మూడు సెల్ ఫోన్లు, నాలుగు వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.                        

సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసి ఆద్వర్యంలో కొత్తగూడెంలో నిరసన

సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి రామన్న పై పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ కు పాల్పడ్డారని పేర్కొంటూ కొత్తగూడెం లో సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసి కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ నిరసన లో సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ కె,ముఖ్తార్ పాషా, రాష్ట్ర నాయకులు మండల వెంకన్న లతో పాటు పార్టీ జిల్లా నాయకులు,కార్యకర్తలు పాల్గొని పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ బులెట్ కలకలం 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద బులెట్ దొరకడం కలకలం సృష్టించింది. హైద్రాబాద్ నుండి లక్నో వెలుతున్న సతీష్ కుమార్ అనే ప్రయాణికుని వద్ద బులెట్ లభ్యమయింది. బులెట్ స్వాదీనం చేసుకున్న పోలీసులు ప్రయాణికుడిని విచారణ చేపట్టారు.  నిందితుడు ఎల్ బి నగర్ వాసిగా గుర్తించిన పోలీసులు అతడి గురించి ఆరా తీస్తున్నారు.  

గుత్తా మహేందర్ రెడ్డి భార్య శ్రీలత ఆత్మహత్య

నల్గొండ పార్లమెంటు సభ్యుడు, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆయన సోదరుడు ప్రగతి స్కూల్ వ్యవస్థాపకుడు గుత్తా మహేందర్ రెడ్డి భార్య శ్రీలత(45)  బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్య కారణాల వల్లే ఆమె ఆత్మ హత్యకు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
 

విజయవాడ ఎస్‌బీఐలో బయటపడ్డ బంగారు ఆభరణాల కుంభకోణం (వీడియో)

విజయవాడ : గాయత్రీ నగర్ ఎస్‌బీఐ లో తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాలను తస్కరించి, తాకట్టుపెట్టిన బ్యాంక్ ఉద్యోగి భాగోతం బయటపడింది. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తులో ఉద్యోగి అవకతవకలు బయలపడ్డాయి.
వివరాల్లోకి వెళితే  ఎస్‌బీఐ హెడ్ క్లర్క్ కృష్ణ చైతన్య ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను దుర్వినియోగం చేశాడు. బ్యాంకులోని 10.5 కిలో ల బంగారాన్ని తీసుకుని, మనప్పురం గోల్డ్ లోన్ లో  తాకట్టు పెట్టి 3 కోట్లు రుణం పొందాడు. దీనిపై విచారణ జరిపిన సీఐడి ప్రధాన సూత్రదారి ఎస్‌బీఐ ఉద్యోగి కృష్ణ చైతన్య తో పాటు అతడికి సహకరించిన మనప్పురం గోల్డ్ లోన్ ఉద్యోగి ఫణికుమార్ అరెస్టు చేసారు.    
 ఈ వ్యవహారంలో ఎస్‌బీఐ బ్యాంకు, మనప్పురం గోల్డ్ లోన్ సంస్థ లో ఇతర అధికారుల పాత్రపైనా సీఐడీ పోలీసులు విచారణ చేస్తున్నారు.             
 

ఇంకో కూలీని బలి తీసుకున్న కాళేశ్వరం సొరంగం

కాళేశ్వరం ప్రాజెక్టు సొరంగం ఇంకో కూలీని బలి తీసుకుంది. ప్రాజెక్టు పరిధిలోని ధర్మారం మల్లాపురం వద్ద ఘటన జరిగింది. బండరాళ్లు మీద పడి అసోం రాష్ట్రానికి చెందిన ఒక వర్కర్ చనిపోయాడు. నిన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం జరిగి ఏడుగురు మరణించి 24 గంటలు గడవకముందే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మరో మరణం బాధ కలిగిస్తోంది. మరిన్న వివరాలు అందాల్సి ఉంది.

పెరిగిన రైల్వే ప్లాట్ ఫాం ధరలు
 

దసరా సెలవుల రధ్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ రూల్వేస్టేషన్ లో ప్లాట్ ఫాం టిక్కెట్ ధరలను 10 రూపాయలు పెంచుతున్నట్లు సీపీఆర్‌వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. అంటే ఇప్పుడున్న 10 రూపాయలకు అదనంగా మరో 10 రూపాయలు పెంచి ఇరవై రూపాయలు చేశారు.  పెరిగిన టిక్కెట్ ధర ఈ నెల 21 నుండి వచ్చేనెల 3 వ తేదీ వరకు అమలవుతాయి.